STOCKS

News


ఈనెల 28 నుంచి సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌ ప్రారంభం

Saturday 24th November 2018
Markets_main1543036624.png-22357

ముంబై: నాలుగో విడత సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్ ఎక్సేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌ (సీపీఎస్ఈ ఈటీఎఫ్) ఈనెల 28 (వచ్చే బుధవారం) నుంచి తమ ఎక్స్ఛేంజీలో ప్రారంభంకానుందని బొంబే స్టాక్స్‌ ఎక్స్ఛేంజ్‌ ప్రకటించింది. ఇంటర్‌నెట్ ఆధారిత బుక్‌ బిల్డింగ్‌ వ్యవస్థ (ఐబీబీఎస్‌) ప్లాట్‌ఫాం ద్వారా సీపీఎస్ఈ ఈటీఎఫ్ ఎఫ్‌ఎఫ్‌ఓ-3 సబ్‌స్రిప్షన్‌ ప్రారంభమవుతుందని, ఇదే నెల 30న (శుక్రవారం) ముగియనుందని వెల్లడించింది. మ్యూచువల్‌ ఫండ్స్‌ అసోసియేషన్‌ యాంఫీలో నమోదైన ట్రేడింగ్‌ మెంబర్లకు మాత్రమే ఈ ప్లాట్‌ఫామ్‌ అందుబాటులో ఉండనుందని తెలిపింది. తాజా ఫండ్‌లో ఓఎన్‌జీపీ, కోల్ ఇండియా, ఐఓసీ, ఎన్‌టీపీసీ, పీఎఫ్‌సీ, ఆర్ఈసీ, బీఈఎల్‌, ఆయిల్ ఇండియాతో కలిపి మొత్తం 11 ప్రభుత్వ రంగ కంపెనీలు ఉన్న విషయం తెలిసిందే. ఇంతకుముందు మూడు విడతల ద్వారా ప్రభుత్వం రూ.11,500 కోట్లను సమీకరించింది. ఈసారి దాదాపు రూ.8,000 కోట్లను సమీకరించే అవకాశం ఉందని అంచనా. అధిక స్పందన లభించిన పక్షంలో గ్రీన్‌ షూ ఆప్షన్‌ మార్గంలో మరో రూ.6,000 కోట్ల వరకు సమీకరించే అవకాశం ఉంది. ఇక ఇష్యూధరపై కనీసం 4 శాతం వరకు డిస్కౌంట్‌ ఉండనుందని సమాచారం. 



You may be interested

కోటక్‌ సెక్యూరిట్‌ సిఫార్సు: పీఎన్‌సీ షేరును కొనండి

Saturday 24th November 2018

నిర్మాణ, ఇంజనీరింగ్‌, రియల్‌ ఎస్టేట్‌ రంగంలో సేవలు అందించే పీఎన్‌సీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్‌ షేరును కొనవచ్చని రేటింగ్‌ సంస్థ కోటక్‌ సెక్యూరిటీస్‌ సిఫార్సు చేస్తుంది. నిర్ణీత కాలంలో ప్రాజెక్ట్‌ల నిర్మాణాలను పూర్తి చేసే సామర్థ్యం కలిగి ఉండటం‍తో క్యూ2లో అంచనాలకు మించి ఆర్థిక ఫలితాలను నమోదు చేసినట్ల రేటింగ్‌ సంస్థ చెబుతుంది. అయితే ఎబిటా మార్జిన్‌ అంచనాలను అందుకోలేకపోయిందని కోటక్‌ తెలిపింది. పీఎన్‌సీ షేరుపై కోటక్‌ సెక్యూరిటీస్‌ విశ్లేషణలు ఎలా ఉన్నాయో

వారంలో 4.4 శాతం పతనమైన డోజోన్స్‌

Saturday 24th November 2018

శుక్రవారం అమెరికా స్టాక్‌ సూచీలు నష్టాల్లో ముగిశాయి. డోజోన్స్‌ ఇండస్ట్రియల్‌ యావరేజ్‌ 179 పాయింట్లు (0.73 శాతం) నష్టపోయి 24,285 వద్ద ముగిసింది. నాస్‌డాక్‌ 33 పాయింట్లు (0.48 శాతం) కోల్పోయి 6,939 వద్ద స్థిరపడింది. ఎస్‌ అండ్‌ పీ 17 పాయింట్లు (0.66 శాతం) నష్టపోయి 2,632 దగ్గర ముగిసింది. వారం మొత్తం మీద డోజోన్స్‌ ఏంకగా  1,127 పాయింట్లు (4.4 శాతం) నష్టపోయింది. ఈఏడాది జూలై తరువాత

Most from this category