News


కరెక్టివ్‌ బౌన్స్‌కు ఛాన్స్‌!!

Tuesday 9th October 2018
Markets_main1539081412.png-20981

మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోందన్నారు నర్నోలియా ఫైనాన్షియల్‌ అడ్వైజర్స్‌ హెడ్‌ (టెక్నికల్‌ అండ్‌ డెరివేటివ్‌ రీసెర్చ్‌) షబ్బీర్‌ కైయుమి తెలిపారు. గత శుక్రవారం నిప్టీ ఇండెక్స్‌ 200 రోజుల మూవింగ్‌ యావరేజ్‌ కిందకు వచ్చేసిందని, ఆరు నెలల కనిష్ట స్థాయి వద్ద క్లోజయ్యిందని పేర్కొన్నారు. క్రూడ్‌ ధరల పెరుగుదల, రూపాయి క్షీణత అంశాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయని తెలిపారు. ఇండియా వీఐఎక్స్‌ గరిష్ట స్థాయిల్లో ట్రేడవుతోందని, ఇది మార్కెట్‌లో అధిక ఒడిదుడుకులను సూచిస్తోందని పేర్కొన్నారు. గత ఆరు వారాలుగా వీఐఎక్స్‌ కొత్త గరిష్ట స్థాయిలను నమోదు చేస్తూ వస్తోందన్నారు.
నిఫ్టీ అన్ని స్వల్ప కాల మూవింగ్‌ యావరేజ్‌ల దిగువకు వచ్చేసిందని షబ్బీర్‌ తెలిపారు. 5 రోజులు, 20 రోజులు, 50 రోజులు, 200 రోజులు మూవింగ్‌ యావరేజ్‌ల కిందకు పడిపోయిందన్నారు. ఇది మార్కెట్‌లో బేర్స్‌ ఆధిపత్యాన్ని సూచిస్తోందని పేర్కొన్నారు. అయితే ఇండెక్స్‌కు 10,100-9,950 స్థాయిల్లో కీలక మద్దతు లభించొచ్చని తెలిపారు. అలాగే ప్రస్తుతం 200 రోజుల మూవింగ్‌ యావరేజ్‌ నిరోధ స్థాయిగా పనిచేయనుందని పేర్కొన్నారు. అక్టోబర్‌ 4న ఇది 10,821-10,754 శ్రేణిలో ఉందన్నారు. ఇండెక్స్‌ కీలక మూవింగ్‌ యావరేజ్‌లకు దూరంగా వెళ్లడంతో ఎప్పుడైనా కరెక్టివ్‌ బౌన్స్‌ అయ్యే అవకాశముందని తెలిపారు. ఇదొక్కటే మార్కెట్‌కు ఉన్న ఒకే ఒక పాజిటివ్‌ అంశమని, కొంత కన్సాలిడేషన్‌ వచ్చేంత వరకు మార్కెట్‌తో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. సమీప కాలంలో 6-19 శాతం రాబడిని అందించే ఐదు స్టాక్స్‌ను సిఫార్సు చేశారు. అవేంటో చూద్దాం..

ఎస్‌బీఐ
ఈ స్టాక్‌ రూ.250-254 వద్ద కీలక మద్దతు తీసుకుంది. ఎంఏసీడీలో పాజిటివ్‌ క్రాసోవర్‌.. దీర్ఘకాలంలో లాంగ్‌ పొజిషన్లను సూచిస్తోంది. రూ.270 పై స్థాయిలో కొనుగోళ్ల జోరు ప్రారంభం కావొచ్చు. ఇక్కడే 200 రోజుల మూవింగ్ యావరేజ్‌ ఉంది. రూ.254 వద్ద రూ.231 స్టాప్‌లాస్‌తో రూ.302 టార్గెట్‌ ప్రైస్‌తో ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చు.

సన్‌ ఫార్మా
రూ.679 గరిష్ట స్థాయిని తాకిన తర్వాత స్టాక్‌ రూ.591 స్థాయికి పడిపోయింది. ఇది రూ.620-590 రేంజ్‌బౌండ్‌లో కదలాడుతోంది. కనిష్ట స్థాయిల్లో ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చు. ఆర్‌ఎస్‌ఐ, ఇతర ఇండికేటర్లు ఓవర్‌సోల్డ్‌  జోన్‌ సమీపంలో ఉన్నాయి. ఇది స్టాక్‌ ధరలో పెరుగుదలను సూచిస్తోంది. స్టాక్‌ రూ.550పైన కదలాడితే రూ.652 స్థాయికి చేరొచ్చు.

టొరెంట్‌ పవర్‌
రూ.211 కనిష్ట స్థాయికి పడిపోయిన తర్వాత స్టాక్‌ మళ్లీ రిబౌన్స్‌ అయ్యింది. లోయర్‌ లెవెల్‌లో ఇన్వర్టెడ్‌ హెడ్‌ అండ్‌ షోల్డర్‌ ప్యాట్రన్‌ ఏర్పడింది. అందువల్ల రానున్న సెషన్లలో పుల్‌బ్యాక్‌ ఉండొచ్చు. అలాగే పాజిటివ్‌ ఆర్‌ఎస్‌ఐ కూడా బుల్లిష్‌ ట్రెండ్‌ సూచిస్తోంది. రూ.211-212 వద్ద బలమైన మద్దతు ఉంది. రూ.210 స్టాప్‌లాస్‌తో రూ.233 పైన కొనుగోలు చేయవచ్చు. టార్గెట్‌ ధర రూ.258.

అపోలో హాస్పిటల్స్‌
ఇటీవల కాలంలో ఈ స్టాక్‌ రూ.1,234 గరిష్ట స్థాయి నుంచి కరెక‌్షన్‌కు గురయ్యింది. అప్‌వర్డ్‌ స్లోపింగ్‌ లైన్‌ నుంచి సపోర్ట్‌ తీసుకుంది. ఇది కొనుగోలు ఆపర్చునిటీని సూచిస్తోంది. ఆర్‌ఎస్‌ఐ కూడా ఓవర్‌సోల్డ్‌ జోన్‌ సమీపంలో బాటమ్‌ అయ్యింది. ట్రెండ్‌ రివర్స్‌ను తెలియజేస్తోంది. రూ.1,024 స్టాప్‌లాస్‌తో రూ.1,057 స్థాయిలో రూ.1,126 టార్గెట్‌ ప్రైస్‌తో స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చు.

నెస్లె ఇండియా
రూ.11,705 గరిష్ట స్థాయి నుంచి స్టాక్‌ రూ.9,113కి పడిపోయింది. రూ.9,700పైన స్టాక్‌ స్థిరపడితే అప్‌ట్రెండ్‌ ఉంటుంది. ఎంఏసీడీ బుల్లిష్‌ క్రాసోవర్‌ను ఏర్పరచింది. రూ.9,198 స్టాప్‌లాస్‌తో రూ.9,400 వద్ద రూ.10,000 టార్గెట్‌తో ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చు.

 You may be interested

మరింత పతనం మిగిలే ఉంది!

Tuesday 9th October 2018

నోమురా హెచ్చరిక భారత స్టాక్‌ మార్కెట్లలో మరో 5- 10 శాతం పతనం సంభవించే అవకాశాలను తోసిపుచ్చలేమని  ప్రముఖ బ్రోకరేజ్‌ దిగ్గజం నోమురా అభిప్రాయపడింది. దేశీయ మార్కెట్ల వాల్యూషన్లు ఇంకా ఖరీదుగానే ఉన్నాయని తెలిపింది. తాజా పతనంలో వాల్యూషన్లు కరిగిపోయినా, ఇంకా మరింత దిగిరావాల్సిఉందని పేర్కొంది. ఆగస్టులో 18.8 శాతమున్న వాల్యూషన్లు పతనానంతరం అక్టోబర్‌ నాటికి 16 శాతానికి దిగివచ్చాయి. వచ్చే ఏడాది జూన్‌ నాటికి నిఫ్టీ 11892 పాయింట్లకు, సెప్టెంబర్‌

లాభాలు ఒక్కరోజుకే పరిమితం

Tuesday 9th October 2018

మార్కెట్‌కు మంట పెట్టిన ముడిచమురు ధర కొత్త కనిష్టానికి చేరిన రూపాయి మార్కెట్‌ లాభాలు ఒక్కరోజుకే పరిమితమయ్యాయి. సూచీలు మంగళవారం మళ్లీ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా ముడిచమురు మంటలు మరోసారి చెలరేగడంతో దేశీయంగా రూపాయి కొత్త కనిష్టాన్ని అందుకుంది. ఫలితంగా అటో, ఎఫ్‌ఎంజీసీ, బ్యాంకింగ్‌ రంగ షేర్లలో నెలకొన్న అమ్మకాలు మార్కెట్‌కు నష్టాల ముగింపునకు కారణమయ్యాయి. నిఫ్టీ సూచి 47 పాయింట్ల నష్టంతో 10301 వద్ద, సెన్సెక్స్‌ 175 పాయింట్లను కోల్పోయి 34299

Most from this category