STOCKS

News


కార్పోరేట్‌ లెండింగ్‌ బ్యాంకుల ర్యాలీ... రిటైల్‌ బ్యాంకు డీలా

Monday 29th October 2018
Markets_main1540797835.png-21560

ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు ప్రస్తుత ఆర్థిక సంవత్సంతరం రెండో త్రైమాసిక ఫలితాలు విశ్లేషకుల అంచనాలకు ఉండటంతో సోమవారం కార్పోరేట్‌ లెండింగ్‌ బ్యాంకు షేర్లు ర్యాలీ చేస్తున్నాయి. కార్పోరేట్‌ లెండింగ్‌ బ్యాంకులుగా పిలువబడే ఐసీఐసీఐ, యాక్సిస్‌, ఎస్‌బీఐ బ్యాంకుల షేర్లు 9 నుంచి 5శాతం లాభపడ్డాయి. ఈ మూడు షేర్లు ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ-50 సూచీలో టాప్‌-5 గెయిర్‌లో మొదటి మూడు స్థానాలను దక్కించుకున్నాయి.  క్యూ2లో ఐసీఐసీఐ బ్యాంక్‌ నికర లాభం 56శాతం క్షీణించి రూ. 909 కోట్లకు పరిమితమైంది. నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) 12 శాతం వృద్ధి చెంది రూ.6417 కోట్లను ఆర్జించింది. నికర వడ్డీ మార్జిన్లు 3.19 శాతం నుంచి 3.33 శాతానికి పెరిగాయి. ఎన్‌పీఏలు 8.81 శాతం నుంచి 8.54 శాతానికి తగ్గాయి. మరోవైపు దివాలా చట్టం అమలు ద్వారా ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో రూ.1.80లక్షల కోట్ల ఎన్‌పీఎలు రికవరీ కాగలని ఆర్థిక శాఖ అంచనా వేసింది. ఈ సానూకూల అంశాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఈ బ్యాంక్‌ షేర్ల కొనుగోళ్లకు మొగ్గుచూపారు.
ఐసీఐసీఐ బ్యాంకు:- నేడు బీఎస్‌ఈలో రూ.328.90ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 9.18శాతం లాభపడి రూ.344.00ల గరిష్టానికి చేరుకుంది. ఉదయం గం.11:00లకు షేరు గతముగింపు ధర(రూ.315.05)తో పోలిస్తే 8శాతం లాభంతో రూ.341.30ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.256, రూ.344లుగా నమోదయ్యాయి.
ఎస్‌బీఐ బ్యాంకు:- నేడు బీఎస్‌ఈలో రూ.248.95ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 5శాతం లాభపడి రూ.259.90ల గరిష్టానికి చేరుకుంది. ఉదయం గం.11:00లకు షేరు గతముగింపు ధర(రూ.248.1)తో పోలిస్తే 4శాతం లాభంతో రూ.259.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.232.00, రూ.351.50లుగా నమోదయ్యాయి.
యాక్సిస్‌ బ్యాంక్‌:-  నేడు బీఎస్‌ఈలో రూ.541.80ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 7శాతం లాభపడి రూ.576.10ల గరిష్టానికి చేరుకుంది. ఉదయం గం.11:00లకు షేరు గతముగింపు ధర(రూ.537.35)తో పోలిస్తే 6శాతం లాభంతో రూ.571.40ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.477.50, రూ.676.90లుగా నమోదయ్యాయి.

క్షీణంచిన రిటైల్‌ బ్యాంకు షేర్లు:- రిటైల్‌ లోన్‌ బుక్‌ అధికంగా కలిగి తక్కువ ఎన్‌పీఏలతో మంచి బ్యాంకులుగా గుర్తింపు పొందిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు మాత్రం డీలా పడ్డాయి. ఒకవైపు కార్పోరేట్‌ లెండింగ్‌ బ్యాంక్‌ షేర్లు ర్యాలీ చేయడంతో ఆ పెట్టుబడుల వైపు ఆకర్షితులై ఇన్వెస్టర్లు రిటైల్‌ బ్యాంకుల షేర్లు విక్రయిస్తున్నారని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నారు. రిటైల్‌ బ్యాంకులుగా గుర్తింపు పొందిన ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు, కోటక్‌ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యస్‌ బ్యాంక్‌ షేర్లు 2 నుంచి 4శాతం క్షీణించాయి.  నేటి ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో నిఫ్టీ టాప్‌-5 లూజర్లలో మొదటి నాలుగు స్థానాల్లో ఈ నాలుగు బ్యాంక్‌ షేర్లు ఉండటం గమనార్హం.



You may be interested

భారీ లాభాల్లో ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లు

Monday 29th October 2018

ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్ల భారీ ర్యాలీ కారణంగా మిడ్‌సెషన్‌ సమయానికి సూచీలు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ షేర్లకు ప్రాతనిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ ఇంట్రాడేలో 7.50శాతం లాభపడింది. మధ్యాహ్నం గం.1.00లకు ఇండెక్స్‌ గత ముగింపు(2572.85)తో పోలిస్తే 7శాతం లాభంతో 2,753.45ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి సూచీలో అత్యధికంగా ఓరియంటల్‌ బ్యాంక్‌ 12శాతం లాభపడింది. యూనియన్‌ బ్యాంక్‌ 10శాతం, కెనరా బ్యాంక్‌ 9శాతం,

ఎంఎఫ్‌లు ఎంచుకున్న ఏడు స్టాకులు

Monday 29th October 2018

ఇటీవల కాలంలో ఎంఎఫ్‌లు ఎక్కువగా వాటాలు పెంచుకున్న స్టాకులను పరిశీలించగా వాటిలో 7 స్టాకులు అన్ని పారామీటర్లకు తగినట్లున్నాయని తేలింది. ఆర్‌ఓఈ, పీఈ, కంపెనీ మూలాలు, బాలెన్స్‌షీట్‌, భవిష్యత్‌ ధృక్పధం, మేనేజ్‌మెంట్‌ నిర్వహణ తదితర పలు అంశాలను పరిగణనలోకి తీసుకొని వీటిని ఎంపిక చేయడం జరిగింది. ఎంఎఫ్‌లు మక్కువ చూపిన ఈ స్టాకుల్లో పెట్టుబడులు పెడితే ఎంఎఫ్‌ల్లాగే దీర్ఘకాలం వేచిచూడాలని, అప్పుడే మంచి ఫలితాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఏడు కంపెనీల్లో ఎంఎఫ్‌లు

Most from this category