STOCKS

News


ఈ మూడు బ్యాంకుల్లో అప్‌ట్రెండ్‌

Friday 10th August 2018
Markets_main1533896338.png-19125

స్టాక్‌ మార్కెట్‌ పరుగులకు లార్జ్‌క్యాప్స్‌ కారణమన్నారు నిర్మల్‌ బ్యాంగ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ రీసెర్చ్‌ హెడ్‌ గిరీశ్‌ పాయ్‌. క్రూడ్‌ ధరల తగ్గుదల, స్థూల ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల, విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి భారత్‌ మార్కెట్లలోకి రావడం వంటి అంశాలు వల్ల ఇన్వెస్టర్లు లార్జ్‌క్యాప్స్‌పై బుల్లిష్‌ ఉన్నారని పేర్కొన్నారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. దేశీ ఇన్వెస్ట్‌మెంట్లు తగ్గినప్పటికీ సిప్‌ ఇన్వెస్ట్‌మెంట్లు బాగా పెరిగాయని గుర్తుచేశారు.
ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ బ్యాంక్‌ షేర్లలో అప్‌ట్రెండ్‌ కనిపిస్తోందని గిరీశ్‌ తెలిపారు. జూన్‌ క్వార్టర్‌ ఆర్థిక ఫలితాలను గమనిస్తే ఎన్‌పీఏలు త్రైమాసికం పరంగా తగ్గుతూ వస్తున్నాయని పేర్కొన్నారు. ఐసీఐసీఐ బ్యాంక్‌ లోన్‌ బుక్‌లో రిటైల్‌ వాటా పెరుగుతోందని తెలిపారు. రిటైల్‌ వాటా 60 శాతం దాకా ఉందన్నారు. దీని వల్ల మార్జిన్లు పెరగొచ్చని అంచనా వేశారు. గత కొన్ని త్రైమాసికాలుగా మంచి పనితీరు కనబరచని బ్యాంక్‌ షేర్లు పెరగొచ్చని అభిప్రాయపడ్డారు.  
పీఎస్‌యూ బ్యాంక్స్‌లో కొన్ని స్టాక్స్‌పై పాజిటివ్‌గా ఉన్నామని గిరీవ్‌ తెలిపారు. ప్రైవేట్‌ రంగ బ్యాంకులకు అధిక ప్రాధాన్యమిస్తున్నామని పేర్కొన్నారు. ఇవి రిటైల్‌, కన్సూమర్‌ విభాగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయని తెలిపారు. ఫండమెంటల్స్‌ పరంగా హెచ్‌డీఎఫ్‌సీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంకులపై పాజిటివ్‌గా ఉన్నామని తెలిపారు. కార్పొరేట్‌ బ్యాంకింగ్‌ వైపు ప్రైవేట్‌ బ్యాంకుల్లో యస్‌ బ్యాంక్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంకులపై సానుకూలంగా ఉన్నామని పేర్కొన్నారు. ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంకులలో ఐసీఐసీఐలో అప్‌ట్రెండ్‌ ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేశారు. మేనేజ్‌మెంట్‌ సంబంధిత సమస్యల వల్ల ఈ స్టాక్‌ బాగా ఇబ్బంది పడిందని పేర్కొన్నారు. బ్యాంక్‌ లోన్‌ బుక్‌లో 60 శాతం దాకా రిటైల్‌ వాటా ఉందని, దీంతో ఐసీఐసీఐని ఇకపై కార్పొరేట్‌ బ్యాంక్‌గా పరిగణించకూడదని తెలిపారు. మేనేజ్‌మెంట్‌ సంబంధిత సమస్యలపై కమిటీలు ఏర్పాటు అయ్యాయని గుర్తుచేశారు. వీటి నివేదికలు బయటకు వచ్చిన తర్వాత సమస్యలన్నీ పరిష్కారమౌతాయని పేర్కొన్నారు. దీంతో బ్యాంక్‌ షేరు పెరగొచ్చని తెలిపారు. హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ బలమైన లిస్టింగ్‌ను గమనిస్తే ఐసీఐసీఐ బ్యాంక్‌ అనుబంధ సంస్థల విలువ కూడా ఎక్కువగా ఉంటుందనే విషయాన్ని అర్థం చేసుకోవాలన్నారు. ప్రైవేట్‌ ఇన్సూరెన్స్‌లో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌, ఏఎంసీ మార్కెట్‌లో ఐసీఐసీఐ ప్రు ఏఎంసీ బలమైన సంస్థలుగా ఉన్నాయని గుర్తుచేశారు. 
స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకుల విషయానికి వస్తే ఏయూ ఫైనాన్స్‌ కన్నా ఉజ్జీవన్‌ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని గిరీశ్‌ సూచించారు. రానున్న రోజుల్లో ఇందులో గణనీయమైన పెరుగుదల ఉంటుందని అంచనా వేశారు. You may be interested

రికవరీ బాటలో పీఎస్‌బీలు

Friday 10th August 2018

ముంబై: మొండి బాకీల భారంతో కుదేలవుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీ) క్రమంగా రికవరీ బాట పడుతున్నాయి. బాకీలు రాబట్టుకునేందుకు అవి తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆయా బ్యాంకులు ప్రకటిస్తున్న ఆర్థిక ఫలితాలే ఇందుకు నిదర్శనం. ఉదాహరణకు నీరవ్‌ మోదీ కుంభకోణంలో చిక్కుకున్న పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికంలో స్థూలంగా రూ. 7,700 కోట్ల బాకీలను రికవర్‌ చేసుకుంది. గత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద

లాభాల బాటలో ఆటో షేర్లు

Friday 10th August 2018

ముంబై:- మిడ్‌సెషన్‌ సమయానికి సూచీలు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నప్పటికీ..,  ఆటో రంగ షేర్లు మాత్రం లాభాల బాటపట్టాయి. ఎన్‌ఎస్‌ఈ అటో రంగ సూచీలకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ అటో ఇండెక్స్‌ నేటి ఇంట్రాడేలో 1శాతం వరకూ ర్యాలీ చేసింది. సూచీలోని ఐషర్‌ మోటర్స్‌ (5శాతం), మహీంద్రా అండ్‌ మహీం‍ద్రా (2శాతం) లాభపడంతో ఈ రంగానికి చెందిన షేర్లు లాబాల బాట పట్టాయి. మధ్యాహ్నం గం.2:30ని.లకు ఇండెక్స్‌ గత ముగింపు(10814)తో పోలిస్తే అరశాతం

Most from this category