STOCKS

News


10250 దాటితేనే!

Monday 29th October 2018
Markets_main1540797577.png-21558

దేశీయ మార్కెట్లో ప్రస్తుతానికి పెరిగినప్పుడు అమ్ము సూత్రమే వర్తిస్తుందని నార్నోలియా బ్రోకింగ్‌ సంస్థ అభిప్రాయపడింది. గతవారం నిఫ్టీ రెండు శాతం మేర నష్టపోయింది. అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ఉండడంతో దేశీయ సూచీలు సైతం డీలా పడ్డాయి. దీంతో నిఫ్టీ 10100 పాయింట్ల దిగువకు వచ్చింది. ప్రస్తుతం 10150 పాయింట్ల వద్ద నిరోధం ఉందని, దీన్ని దాటితే నెమ్మదిగా 10250 పాయింట్ల వరకు పుల్‌బ్యాక్‌ ఉండొచ్చని నార్నోలియా తెలిపింది. 10250 పాయింట్లపైన స్థిరంగా ఉంటే 10450 పాయింట్ల వరకు ఎగబాకవచ్చని అంచనా వేసింది. ఒక వేళ పదివేల పాయింట్లను కోల్పోతే 9700 పాయింట్ల వరకు దిగజారవచ్చని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో 10250 పాయింట్లను చేరే వరకు పెరిగినప్పుడు అమ్ము సూత్రం పాటించాలని సూచించింది. ఈ స్థాయిని బలంగా దాటితేనే కొనుగోళ్లను పరిశీలించవచ్చని తెలిపింది.

నిఫ్టీ ప్రస్తుతం అన్ని డీఎంఏ స్థాయిలకు దిగువన ఉన్నదని, స్వల్పకాలిక పుల్‌బ్యాక్‌ ఎప్పుడైనా ఉండొచ్చని తెలిపింది. చార్టుల్లో బుల్లిష్‌ ఉల్ఫ్‌ వేవ్‌ పాటర్న్‌ చూపుతోందని వివరించింది. ఈ పాటర్న్‌ ప్రకారం నిఫ్టీ 10250 పాయింట్లను దాటితే 10550 వరకు దూసుకుపోతుందని అంచనా వేసింది. గత ఆరు నెలల్లో ఎన్నడూ లేనంత గతనెల రోలోవర్లు పెరిగాయని తెలిపింది. డౌన్‌ట్రెండ్‌లో రోలోవర్లు ఎక్కువగా ఉంటే ట్రెండ్‌ రివర్సల్‌ ఉంటుందని విశ్లేషించింది. బ్యాంకు నిఫ్టీకి 24300 పాయింట్ల వద్ద బలమైన మద్దతు ఉందని తెలిపింది. పైస్థాయిలో 25400 పాయింట్ల వద్ద నిరోధం ఉందని తెలిపింది. సోమవారం సూచీలు పాజిటివ్‌గా ట్రేడవుతున్నాయి. నిఫ్టీ 10100 పాయింట్ల పైన స్థిరంగా కదలాడుతోంది. 



You may be interested

ఎంఎఫ్‌లు ఎంచుకున్న ఏడు స్టాకులు

Monday 29th October 2018

ఇటీవల కాలంలో ఎంఎఫ్‌లు ఎక్కువగా వాటాలు పెంచుకున్న స్టాకులను పరిశీలించగా వాటిలో 7 స్టాకులు అన్ని పారామీటర్లకు తగినట్లున్నాయని తేలింది. ఆర్‌ఓఈ, పీఈ, కంపెనీ మూలాలు, బాలెన్స్‌షీట్‌, భవిష్యత్‌ ధృక్పధం, మేనేజ్‌మెంట్‌ నిర్వహణ తదితర పలు అంశాలను పరిగణనలోకి తీసుకొని వీటిని ఎంపిక చేయడం జరిగింది. ఎంఎఫ్‌లు మక్కువ చూపిన ఈ స్టాకుల్లో పెట్టుబడులు పెడితే ఎంఎఫ్‌ల్లాగే దీర్ఘకాలం వేచిచూడాలని, అప్పుడే మంచి ఫలితాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఏడు కంపెనీల్లో ఎంఎఫ్‌లు

ఫార్మా షేర్ల పరుగులు

Monday 29th October 2018

భారీ లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించిన సూచీలు ఇంట్రాడేలో ప్రభుత్వ రంగ, ఫార్మా షేర్ల అండతో అదే జోరును కనబరుస్తున్నాయి. సన్‌ఫార్మా, డాక్టర్‌ రెడ్డీస్‌, సిప్లా, దివీస్‌ ల్యాబ్స్‌ షేర్ల ర్యాలీ అండతో నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌ 4శాతం లాభపడింది. ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ ఇండెక్స్‌(6 శాతం) తరువాత అత్యధికంగా లాభపడినది నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌ కావడమే విశేషం. నేడు నిఫ్టీ ఇండెక్స్‌ 9,172ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ట్రేడింగ్‌ ప్రారంభంలో దివీస్‌ల్యాబ్స్‌

Most from this category