STOCKS

News


ఆటో స్టాక్స్‌లో ఇవి బెటర్‌..

Thursday 15th November 2018
Markets_main1542264198.png-22044

ఆటో రంగంలో మారుతీ సుజుకీ, హీరో మోటొకార్ప్‌, బజాజ్‌ ఆటో స్టాక్స్‌పై బుల్లిష్‌గా ఉన్నామని ఇండిపెండెంట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్‌ వివేక్‌ మవాని తెలిపారు. మారుతీ సుజుకీ షేరు ఇప్పటికే 25-30 శాతం కరెక‌్షన్‌కు గురయ్యిందని గుర్తుచేశారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. ప్రస్తుత క్వార్టర్‌లో ఆటో రంగ కంపెనీల ఎర్నింగ్స్‌ కొంత నిరుత్సాహానికి గురిచేశాయని తెలిపారు. అయితే మళ్లీ వృద్ధి తిరిగి వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. టూవీలర్‌ విభాగంలో బజాజ్‌ ఆటో, హీరో మోటొకార్ప్‌.. వాణిజ్య వాహన విభాగంలో అశోక్‌ లేలాండ్‌, టాటా మోటార్స్‌ కంపెనీలు ఆరోగ్యకరమైన ట్రెండ్‌ను సూచిస్తున్నాయని తెలిపారు. ముడిపదార్ధాల ధరలు పెరగడం, మార్జిన్లు స్తంభించిపోవడం వంటి అంశాలు ప్రతికూల ప్రభావం చూపాయని పేర్కొన్నారు. రానున్న కాలంలో ఆటో కంపెనీలు మంచి పనితీరు కనబరుస్తాయని అంచనా వేశారు. మారుతీ సుజుకీ, హీరో మోటొకార్ప్‌, బజాజ్‌ ఆటో షేర్లపై బుల్లిష్‌గా ఉన్నామని తెలిపారు. 
వడ్డీ రేట్ల పెరుగుదల ఆటో రంగానికి మంచిది కాదని వివేక్‌ మవాని పేర్కొన్నారు. కొనుగోలుదారులు ఎక్కువగా బ్యాంక్స్‌/ఎన్‌బీఎఫ్‌సీ ఫైనాన్స్‌ రూపంలో వాహనాలను కొంటారని తెలిపారు. వాణిజ్య వాహనాలు, వ్యవసాయ పరికరాలు, ఇతర అధిక విలువ కలిగిన వాహనాల కొనుగోలులో ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని పేర్కొన్నారు. రానున్న కాలంలో అమ్మకాల్లో గణనీయమైన వృద్ధి ఉంటుందని చెప్పడం లేదని, అయితే గరిష్ట ఒక అంకె వృద్ధి అయితే నమోదువుతుందని తెలిపారు. ఆటో కంపెనీలు దాదాపుగా రుణ రహితంగా ఉన్నాయని పేర్కొన్నారు. హీరో మోటొకార్ప్‌, మారుతీ సుజుకీ, బజాజ్‌ ఆటో కంపెనీలు అయితే రుణ రహితం మాత్రమే కాకుండా అధిక ఫ్రీ క్యాష్‌ ఫ్లో కలిగి ఉంటాయని తెలిపారు. ఈ కంపెనీలకు నగదు ఎక్కువగా ఉన్న బ్యాలెన్స్‌ షీట్లు ఉంటాయని పేర్కొన్నారు. అందువల్ల వడ్డీ రేట్ల ప్రభావం వీటిపై ఉండదని తెలిపారు. అయితే మారుతీ వాహన కొనుగోలుదారుడిపై ప్రతికూల ప్రభావం ఉంటుందని, అయితే అది పెద్దగా ఆందోళన చెందాల్సిన అంశం కాదని పేర్కొన్నారు. వాణిజ్య వాహనాలు, వ్యవసాయ పరికరాలపై ఉన్నంత ప్రభావం వీరిపై ఉండదని గుర్తుచేశారు.  
క్రూడ్‌ ధరలకు, ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీల మధ్య విలోమ పరస్పర సంబంధం ఉందని వివేక్‌ మవాని తెలిపారు. క్రూడ్‌ ధరలు పడిపోతే ఈ స్టాక్స్‌ ర్యాలీ చేస్తున్నాయని, అదే క్రూడ్‌ ధరలు పెరిగితే.. ఈ స్టాక్స్‌ పడిపోతున్నాయని వివరించారు. గత కొన్ని నెలలుగా చూస్తే క్రూడ్‌ ధరలు పెరగడం వల్ల ఈ స్టాక్స్‌ ర్యాలీకి బ్రేక్‌ పడిందని తెలిపారు. ఇప్పుడు క్రూడ్‌ ధరలు తగ్గుతున్నాయని, గత కొన్ని రోజుల్లో 20 శాతం పతనమయ్యాయని పేర్కొన్నారు. అందువల్ల హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, ఐఓసీ స్టాక్స్‌కు ప్రాధాన్యమివ్వొచ్చని తెలిపారు. అయితే దీర్ఘకాలంలో చూస్తే ఈ స్టాక్స్‌పై జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. 



You may be interested

సీఆర్‌ఆర్‌ తగ్గించే యోచనలో ఆర్‌బీఐ..!

Thursday 15th November 2018

ముంబై: బ్యాంకింగ్ వ్యవస్థలో నగదు లభ్యతను పెంచడంలో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్)లో కోత విధించేందుకు అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. బ్యాంకులు తమ వద్దకు వచ్చిన మొత్తం డిపాజిట్లలో కొంత భాగాన్ని తప్పనిసరిగా ఆర్‌బీఐ వద్ద ఉంచాలన్న నిబంధనే సీఆర్‌ఆర్‌ కాగా, ప్రస్తుతం ఈ రేటు 4 శాతంగా ఉంది. సీఆర్‌ఆర్‌ రూపంలో ఆర్‌బీఐ వద్ద రూ.5 లక్షల కోట్లు

టాటాల కన్ను... జెట్‌ ఎయిర్‌వేస్ 8శాతం జూమ్‌..!

Thursday 15th November 2018

తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో చిక్కుకున్న జెట్‌ ఎయిర్‌వేస్‌ కొనుగోలుకు టాటా సన్స్‌ కసరత్తును వేగవంతం చేసిందనే వార్తల నేపథ్యంలో గురువారం జెట్‌ ఎయిర్‌వేస్‌ కంపెనీ షేరు భారీగా లాభపడింది. విస్తారా బ్రాండు విమానయాన సేవల సంస్థను నిర్వహిస్తున్న టాటా ఎస్‌ఐఏ ఎయిర్‌లైన్స్‌ షేర్ల విలీనం ద్వారా జెట్ ఎయిర్‌వేస్‌ను సొంతం చేసుకోవడానికి సిద్ధమైంది. జెట్‌ ఎయిర్‌వేస్‌ కొనుగోలుకు సంబంధించి టాటా సన్స్‌ రెండో విడత చర్చలు కూడా పూర్తి చేసినట్లు

Most from this category