News


6 నెలల గరిష్టం అయినా... అదుపులోనే!

Tuesday 14th May 2019
Markets_main1557814299.png-25725

  •  ఏప్రిల్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం 2.92 శాతం
  • ఆర్‌బీఐ నిర్దేశిత లక్ష్యం 4 శాతం 
  • ఇదే తీరు కొనసాగితే మరోదఫా రేటు కోత

న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యో‍ల్బణం ఏప్రిల్‌లో 2.92 శాతంగా నమోదయ్యింది. అంటే 2018 ఏప్రిల్‌లో సూచీలోని వస్తువుల బాస్కెట్‌ ధర 2019 ఏప్రిల్‌లో 2.92 శాతం పెరిగిందన్నమాట. ఈ స్థాయిలో రిటైల్‌ ధరల స్పీడ్‌ నమోదుకావడం ఆరు నెలల్లో ఇదే తొలిసారి. అయితే ఇది రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నిర్దేశిత లక్ష్యం 4 శాతం లోపే ఉండడం గమనార్హం. మున్ముందు ఇదే రీతిలో ధరలు కొనసాగితే ఆర్‌బీఐ మరోదఫా రేటు రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపో- ప్రస్తుతం 6 శాతం) తగ్గింపు ఖాయమన్న సంకేతాలు ఉన్నాయి. కూరగాయలు, మాంసం, చేపలు, గుడ్లుసహా ఆహార ఉత్పత్తుల ధరలు పెరగడం వల్ల ఏప్రిల్‌లో ధరల స్పీడ్‌ కొంత పెరిగింది. కేంద్రం సోమవారం విడుదల చేసిన గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే...

  • మార్చిలో రిటైల్‌ ద్రవ్యో‍ల్బణం 2.86 శాతం ఉంటే, 2018 ఏప్రిల్‌లో 4.58 శాతంగా ఉంది. -
  • అక్టోబర్‌ 2018 తరువాత (3.38 శాతం) ఈ స్థాయిలో రిటైల్‌ ద్రవ్యోల్బణం నమోదవడం ఇదే తొలిసారి. -
  • ఒక్క ఆహార ఉత్పత్తులను చూస్తే, ధరలు 1.1 శాతం పెరిగాయి. మార్చిలో ఈ పెరుగుదల రేటు కేవలం 0.3 శాతంగా ఉంది. కూరగాయల ధరలు 2.87 శాతం పెరిగాయి. అయితే పండ్ల ధరలు మాత్రం గత ఏడాది ఏప్రిల్‌ నుంచి 2019 ఏప్రిల్‌ను చూస్తే తగ్గాయి. -  
  • ఇంధనం, లైట్‌ విభాగంలో ద్రవ్యోల్బణం 2.42 శాతం నుంచి 2.56 శాతానికి పెరిగింది. -
  • కాగా గ్రామీణ భారతంలో ధరల స్పీడ్‌ మార్చిలో 1.8 శాతం ఉంటే, ఏప్రిల్‌లో ఇది 1.87 శాతానికి పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో ఈ రేటు 4.1 శాతం నుంచి 4.23 శాతానికి చేరింది. -
  • నిర్దేశిత కొన్ని పట్టణాలు, గ్రామాల నుంచి ఎన్‌ఎస్‌ఎస్‌ఓ ఫీల్డ్‌ ఆపరేషన్స్‌ డివిజన్ల నుండి ఈ గణాంకాలను సేకరించడం జరుగుతుంది. 

2019-2020లో 4 శాతం
అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019 ఏప్రిల్‌ నుంచి 2020 మార్చి) రిటైల్‌ ద్రవ్యో‍ల్బణం సగటున 4 శాతం ఉంటుందని భావిస్తున్నట్లు క్రిసిల్‌ రిసెర్చ్‌ అంచనావేస్తోంది. 2018-19లో ఈ రేటు 3.4 శాతంగా ఉంది. ఆహార ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశాలు ఉండడం తమ అంచనాలకు కారణంగా పేర్కొంది. 



You may be interested

వొడాఫోన్ ఐడియా నష్టం రూ. 4,882 కోట్లు

Tuesday 14th May 2019

న్యూఢిల్లీ: దేశీ టెలికం మార్కెట్లో టారిఫ్‌ల పరంగా తీవ్రమైన పోటీ నేపథ్యంలో టెలికం దిగ్గజం వొడాఫోన్ ఐడియా గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో భారీ నష్టాలు నమోదు చేసింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.4,882 కోట్ల నష్టం ప్రకటించింది. సీక్వెన్షియల్‌గా చూస్తే మూడో క్వార్టర్‌లో నమోదైన రూ.5,005 కోట్లతో పోలిస్తే మాత్రం కొంత తగ్గింది. వొడాఫోన్‌, ఐడియా సంస్థలు గతేడాది ఆగస్టులో విలీనం కావడంతో అంత క్రితం ఆర్థిక సంవత్సరంతో

పల్లెలు... రెడీ టు ఈట్‌!!

Tuesday 14th May 2019

సమయం ఆదా, సౌకర్యం కూడా పల్లెవాసుల నుంచి వీటికి ఆదరణ జోరుగా పెరుగుతున్న అమ్మకాలు దీంతో కంపెనీల ప్రత్యేక ప్రణాళికలు తక్కువ ధరలతో ఉత్పత్తుల విడుదల న్యూఢిల్లీ: కోరుకున్న వెంటనే, అప్పటికప్పుడు పది నిమిషాల్లో ఆహారాన్ని సిద్ధం చేసుకునే అవకాశం కల్పించేవి రెడీ టు ఈట్‌ ఉత్పత్తులు. అంత సమయం కూడా లేదనుకుంటే ప్యాకేజ్డ్‌ ఫుడ్స్‌ ఉండనే ఉన్నాయి. ఇప్పటిదాకా పట్టణాల్లోని మధ్య తరగతి వినియోగదారులే లక్ష్యంగా కంపెనీలు ఈ ఉత్పత్తులను గురిపెట్టేవి. అయితే, ఈ మధ్య

Most from this category