STOCKS

News


ఈ 5 షేర్లు రక్షణాత్మకం

Friday 7th December 2018
Markets_main1544177917.png-22735

ముంబై: వచ్చే ఏడాది చివరి వరకు దేశీ మార్కెట్‌ పతనం దిశగానే ఉండనుండగా.. ఈకాలంలో ఒడిదుడుకులు కూడా అధిక స్థాయిలోనే ఉండేందుకు అవకాశం ఉందని నిర్మల్ బాంగ్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్, రీసెర్చ్ హెడ్ గిరీష్ పై విశ్లేషించారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులకు రక్షణనిచ్చే షేర్లలో పెట్టుబడి చేయడం సరైన నిర్ణయమని ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. పెట్టుబడి, విలువ రక్షణకు అనుగుణంగా ఉన్నటువంటి షేర్లలో వార్ల్‌పూల్‌ ఇండియా, ఐఎఫ్‌బీ ఇండస్ట్రీస్ వంటి మిడ్‌క్యాప్స్‌లోని కన్సూమర్ డ్యూరబుల్స్‌ రంగ షేర్లను సూచించారు. కన్సూమర్‌ డిస్క్రిషనరీలో పీవీఆర్‌, ఐనాక్స్‌ షేర్లను సూచించారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన సిటీ యూనియన్‌ బ్యాంక్‌ ఫైనాన్షియల్‌ రంగంలో మంచి ఎంపికగా ఉండనుందన్నారు. ఇంటర్నేషనల్ బిజినెస్ మెషిన్స్ కార్పొరేషన్(ఐబీఎం)ను హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌ కొనుగోలు చేయడం వల్ల ఆ సంస్థ రిటర్న్‌ రేషియో ఏమంత ప్రతికూలంగా ఉండబోదన్నారు. ఐబీఎం నుంచి 1.8 బిలియన్‌ డాలర్ల విలువైన పలు రకాల సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తులను కొనుగోలు చేయనున్నట్లు దేశీ మూడో అతిపెద్ద ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ ఇప్పటికే ప్రకటించగా.. గతంలో శివ్ నాడార్ ఇన్ఫోసిస్‌తో పోటిపడి కొనుగోలుచేసిన యాక్సాన్‌తో కలిపి మొత్తం గడిచిన పదేళ్లలో ఈ కంపెనీ డీల్స్‌ విలువ 3 బిలియన్‌ డాలర్లుగానే ఉందన్నారు. వచ్చే రెండు, మూడేళ్లలో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ అమ్మకాలు కాస్త నెమ్మదించే అవకాశం ఉందన్నారు. రిటైల్ ప్రైవేట్ ఫైనాన్షియల్ బ్యాంకులలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంకులను సూచించారు. అంతర్జాతీయ విషయాలకు వస్తే.. ఇంతకుముందు ప్రతికూలంగా ఉన్నటువంటి అంశాలు ప్రస్తుతం సానుకూలంగా ఉన్నాయి. ముడిచమురు ధర 70 నుంచి 60 డాలర్లకు దిగివచ్చింది. 10-ఏళ్ల ఈల్డ్‌ 8.2 నుంచి 7.5 శాతానికి తగ్గింది. దీర్ఘకాలంలో ఎలా ఉండనున్నాయనే విషయంలో మాత్రం కాస్త అనుమానాలు ఉన్నాయన్నారు. యూఎస్‌ ఫెడ్‌, ఈసీబీ, బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌లు వచ్చే 10 ఏళ్లలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయో, బబుల్‌ ఎక్కడ ఉందో చెప్పలేమన్నారు. You may be interested

నష్టాలకు బ్రేక్‌

Friday 7th December 2018

ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌, ఫైనాన్స్‌ సర్వీసెస్‌, అటో రంగ షేర్ల ర్యాలీతో మార్కెట్‌ మూడురోజుల నష్టాలకు శుక్రవారం బ్రేక్‌ పడింది. బెంచ్‌మార్క్‌ సూచీలైన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 361 పాయింట్ల లాభంతో 35673 వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 92.50 పాయింట్ల లాభంతో 10693 వద్ద ముగిశాయి. గత కొద్ది రోజులుగా భారీ అమ్మకాలతో తల్లడిల్లిన ప్రపంచమార్కెట్లు తిరిగి లాభాల్లో మళ‍్లడం, రూపాయి రీకవరీ తదితర అంశాలు నేటి సూచీల లాభాల ర్యాలీకి

స్టీల్‌ షేర్ల పతనం: కళ తప్పిన మెటల్‌ షేర్లు

Friday 7th December 2018

స్టీల్‌ షేర్ల పతనంతో శుక్రవారం మెటల్‌ షేర్లు కళతప్పాయి. ప్రముఖ రేటింగ్‌ సం‍స్థ సిటీ దేశీ స్టీల్‌ కంపెనీలకు డౌన్‌గ్రేడ్‌ రేటింగ్‌ను కేటాయించడంతో స్టీల్‌ షేర్లు నష్టాల బాట పట్టాయి. స్టీల్‌ షేర్ల ధరలు అధిక వ్యాల్యూవేషన్స్‌ వద్ద ట్రేడ్‌ అవుతుండటం, ఆయా ఆయా కంపెనీలకు రుణ భారం పెరుగుదల,  అధిక వ్యాల్యుయేషన్స్‌ తదితర కారణాలతో గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సంస్థ సిటీ తాజాగా స్టీల్‌ షేర్ల రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌

Most from this category