STOCKS

News


ఈ 8 షేర్లతో మార్కెట్‌ ర్యాలీ

Tuesday 4th December 2018
Markets_main1543915951.png-22620

ముంబై: ప్రధాన సూచీల్లోని ఎంపిక చేసిన ఎనిమిది షేర్ల ఎర్నింగ్స్‌ వృద్ధి మొత్తం ర్యాలీకి దోహదపడనుందని ప్రముఖ బ్రోకరేజ్‌ సీఎల్‌ఎస్‌ఏ విశ్లేషించింది. కేవలం ఈ షేర్లలో వృద్ది ద్వారానే తరువాత ర్యాలీ ఉండనుందని తెలిపింది. వచ్చే ఆర్థిక సంత్సరంలో నిఫ్టీ ఎర్నింగ్స్‌ 25 శాతం వృద్ధి చెందేందుకు అవకాశం ఉందని వివరించిన ఈ బ్రోకింగ్‌ సంస్థ.. గడిచిన ఎనిమిదేళ్ల సగటు 6.5 శాతంగా ఉన్నట్లు తెలిపింది. తమ విశ్లేషణ ప్రకారం ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, వేదాంత, టాటా మోటార్స్‌తో పాటు మూడు ఆయిల్‌ కంపెనీల ఎర్నింగ్స్‌ వృద్ధి 18-19 శాతం మేర నమోదుకానుందని వెల్లడించింది. ఈ అంశంపై అనేక మంది మార్కెట్‌ పండితులు సానుకూలంగా స్పందించారు. సీఎల్‌ఎస్‌ఏ పేర్కొన్న 8 షేర్లలో సత్తాను వివరించారు. ఆ విశ్లేషణలను ఒకసారి పరిశీలిస్తే..

ఐసీఐసీఐ బ్యాంక్
రుణ వ్యయాలు తగ్గుతుండడం వల్ల ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకులకు కలిసిరానుందని మాక్వైరీ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ సురేష్ గణపతి అన్నారు. రుణ వ్యయం సాధారణ స్థితికిరావడం చేత ఇరు సంస్థలు వృద్ధిని నమోదుచేయనున్నట్లు తెలిపారు. 

ఎస్‌బీఐ
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎన్‌పీఏల నుంచి రైట్‌బ్యాక్స్‌ ద్వారా రూ.50,000 కోట్లను రికవరీ చేయాలని బ్యాంక్‌ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందువల్ల మార్చి త్రైమాసిక ఎర్నింగ్స్‌ ఒక్కసారిగా ఎగసే అవకాశం ఉంది. ఇక ఎన్‌బీఎఫ్‌సీలోని మార్కెట్‌ వాటాను కూడా క్రమంగా ఈ సంస్థ పెంచుకుంటోంది అని ఐఐఎఫ్‌ఎల్‌ మార్కెట్స్‌ అండ్‌ కార్పొరేట్‌ ఎఫైర్స్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సంజీవ్‌ భాసిన్‌ విశ్లేషించారు. మోర్గాన్‌ స్టాన్లీ ఈ షేరకు ఓవర్‌వెయిట్‌ రేటింగ్‌ ఇచ్చి రూ.350 టార్గెట్‌ ధరను ప్రకటించింది.

భారతీ ఎయిర్‌టెల్
ట్యారిఫ్‌లు పెరగడం మొదలై టెలికం రంగంలో ప్రస్తుతం మూడు సంస్థలు మాత్రమే పోటీలో నిలిచినట్లు స్పష్టమైంది. ఈ సంస్థ ఆఫ్రికా యూనిట్‌ ఐపీఓకు వెళ్లడం కారణంగా బ్యాలెన్స్‌ షీట్‌ ఆకర్షణీయంగా మారనుందని మార్కెట్‌ నిపుణులు అంబరేష్ బాలిగా అన్నారు. ఇక ఈ షేరు సీఎల్‌ఎస్‌ఏ ఎంపిక చేసిన టెలికం సెక్టార్‌ పిక్‌గా ఉంది.

వేదాంత
డివిడెండ్‌ ఈల్డ్‌ ఆకర్షణీయంగా ఉన్నందు వల్ల 2020లో ఎర్నింగ్స్‌ గ్రోత్‌ అంచనాలకు అనుగుణంగా ఉండనుందని సీఎల్‌ఎస్‌ఏ భావిస్తోంది. రూ.220 టార్గెట్‌ ధరను ప్రకటించింది. అయితే, ఐసీఐసీఐ డైరెక్ట్‌ మ్రాతం అల్యూమినియం విభాగం వల్ల కంపెనీ మార్జిన్లు తగ్గేందుకు అవకాశం ఉందని భావిస్తోంది.

ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు
ముడిచమురు ధరలు భారీగా పతనం కాగా, మూడు ప్రధాన ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ఈ ప్రయోజనాన్ని పొందుతున్నాయని విశ్లేషించింది. నిఫ్టీ తరువాత ర్యాలీలో ఈ మూడు షేర్లు కీలకం కానున్నట్లు విశ్లేషించింది. అయితే మార్కెట్‌ నిపుణులు అంబరేష్ బాలిగా మాత్రం ఈ రంగ షేర్లపై తటస్థ వైఖరిని వెల్లడించారు. క్రూడ్‌ ధరల పతనం ఎంతవరకు కొనసాగుతుందనే అనుమానాలను వ్యక్తంచేశారు. 

టాటా మోటార్స్
ఎర్నింగ్స్‌ పరంగా ఈ షేరును సంజీవ్ భాసిన్ డార్క్‌ హార్స్‌గా అభివర్ణించారు. చైనా ఆర్థిక వ్యవస్థ నెమ్మదించడం, బ్రెగ్జిట్‌ ప్రభావం పరిగణలోనికి వచ్చేసిందని వివరించారు. అయితే, ఎడిల్‌వీజ్‌ మాత్రం అధిక మూలధన దశ వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ కొనసాగుతుందని అంచనావేసింది. షేరు టార్గెట్‌ ధరను రూ.251 నుంచి రూ.204 వద్దకు సవరించింది.You may be interested

మిడ్‌క్యాప్‌ ఐటీ భేష్‌

Tuesday 4th December 2018

ముంబై: దేశీ స్టాక్‌ సూచీలు ముడిచమురు ధరల ఒడిదుడుకులకు, రూపాయి కదలికలకు నాట్యం చేశాయని వ్యాఖ్యానించిన ప్రముఖ స్మాల్‌క్యాప్‌ ఇన్వెస్టర్ పొరింజు వెలియాత్.. అసలైన సవాళ్లు మార్కెట్‌లో ఇంకా ఉన్నాయని అన్నారు. వాణిజ్య యుద్ధం, ఎన్‌బీఎఫ్‌సీ అంశాలను మార్కెట్‌ మరీ అతిచేసి చూసిందని ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించిన ఆయన.. ఇప్పుడు ఈ అంశాలను సాధారణంగా చూస్తూ ర్యాలీకి ఒక కారణంగా చూపుతున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాదిలో

మిశ్రమంగా రియల్టీ షేర్లు

Tuesday 4th December 2018

మార్కెట్‌ నష్టాల ట్రేడింగ్‌లో భాగంగా బుధవారం రియల్టీరంగ షేర్లు మిశ్రమంగా ర్యాలీ అవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో రియల్టీరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ 1శాతానికి పైగా నష్టపోయింది. ముఖ్యంగా ఈ ఇండెక్స్‌లోని ప్రెస్టేజ్‌ ఎస్టేట్స్‌, ఓబేరాయ్‌ రియల్టీ, గోద్రేజ్‌ ప్రాపర్టీ, ఇండియాబుల్స్‌ రియల్‌ఎస్టేట్‌ షేర్ల పతనం ఇండెక్స్‌పై ఒత్తిడిని పెంచుతున్నాయి. మధ్యాహ్నం గం.2:45.ని.లకు ఇండెక్స్‌ గత ముగింపు (237.60)తో పోలిస్తే 0.85శాతం నష్టంతో 235.55 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

Most from this category