కంపెనీల ఎర్నింగ్స్‌లో భారీగా కోతలు
By P Pavan Adithya

ముంబై: టాప్ 10 అనలిస్టులు ట్రాక్ చేస్తున్న 269 కంపెనీల్లో ఏకంగా 168 కంపెనీల ఎర్నింగ్స్ అంచనాల్లో సవరణజరిగింది. అంటే దాదాపు 60 శాతం కంపెనీల ఎర్నింగ్స్‌లో వీరు భారీగా కోతలు విధించారు. రూపాయి బలహీనత కారణంగా ఐటీ రంగాన్ని మినహాయించి మిగిలిన అన్ని రంగాల కంపెనీల ఈపీఎస్‌లను తగ్గించారు. 18 కంపెనీల్లో ఏకంగా 50 శాతం వరకు అంచనాలను సవరించారు. అత్యధికంగా టెలికం, సిమెంట్, హాస్పటల్ రంగాల్లో ఈ విధమైన భారీ కోత ఉన్నట్లు వెల్లడైంది. ఆ వివరాలను ఒకసారి పరిశీలిస్తే.. భారతి ఎయిర్టెల్: ధరల ఒత్తిడి కొనసాగుతున్న కారణంగా డిసెంబర్ 2018లో సవరించిన ఈపీఎస్ అంచనా -3.56 ఉండగా.. ఈ ఏడాది ఏప్రిల్‌లో 7.44 వద్ద ఉంది. ఇక ఈపీఎఫ్ అంచనా పెరిగిన కంపెనీల జాబితాలో డీఎల్ఎఫ్, నాల్కో, డిష్‌టీవీ, స్టీల్ కంపెనీలు ఉన్నట్లు తెలిపారు.
ఫోర్టిస్ హెల్త్‌కేర్: ఆసుపత్రి వ్యాపారంలో సవాళ్లు, డయాగ్నొస్టిక్ యూనిట్ అంతంత మాత్రంగా ఉండడం ఆధారంగా ఈపీఎస్ అంచనాలో అనలిస్టులు 97 శాతం కోత విధించారు. 0.1గా తెలిపారు.
హెల్త్‌కేర్ గ్లోబల్: అధిక వడ్డీ వ్యయాలు, విదేశీ మారక ద్రవ్య నష్టాల కారణంగా ఈ ఏడాది తొలి అర్ధభాగంలో నష్టాలను ప్రకటించింది. ఈపీఎస్ అంచనా -0.1గా తెలిపారు.
టాటా కమ్యునికేషన్స్: డేటా విభాగం నెమ్మదించిపోవడం, టెలికాం పరిశ్రమలో కన్సాలిడేషన్ కారణంగా ఈపీఎస్ అంచనా 84.6 శాతం తగ్గి 1.93 వద్ద ఉన్నట్లు విశ్లేషించారు.
ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్: తొలి అర్థభాగంలో భారీగా పెరిగిన ముడిచమురు ధరలు, బలహీన పడిన రూపాయి మారకం వల్ల ఈపీఎస్ అంచనా 84 శాతం తగ్గి 11.93 వద్ద ఉన్నట్లు విశ్లేషించారు.
సిమెంట్ కంపెనీలు: ముడి పదార్థాల అధిక ధరలు, ఇదే సమయంలో సిమెంట్ ధరలు తక్కువగా ఉండడం నష్టాలకు కారణంగా తెలిపారు.
సద్భావ్ ఇంజనీరింగ్, టాటా మోటార్స్, స్ట్రైడ్స్ ఫార్మా, హెచ్‌టీ మీడియా: తొలి అర్థభాగంలో పనితీరు అంతంత మాత్రంగానే ఉంది.
You may be interested
సెన్సెక్స్ నష్టం 572 పాయింట్లు
Thursday 6th December 2018181 పాయింట్లను కోల్పోయిన నిఫ్టీ ప్రపంచమార్కెట్ల పతనంతో దేశీయ మార్కెట్ వరుసగా మూడోరోజూ నష్టాలతోనే ముగిసింది. ఆయిల్, మెటల్ షేర్లు సూచీల భారీ పతనానికి కారణమయ్యాయి. వచ్చేవారం వెలువడనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు, నేడు ఆస్ట్రేలియాలో జరగనున్న ఒపెక్ దేశాల సమావేశాల సందర్భంగా ఇన్వెస్టర్ల అప్రమత్తత కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఫలితంగా బీఎస్ఈ సెన్సెక్స్ 527 పాయింట్లు నష్టపోయి 35,312 వద్ద, ఎన్ఎస్సీ నిఫ్టీ 182 పాయింట్ల
మార్కెట్ టార్చ్‌బేరర్.. రిలయన్స్
Thursday 6th December 2018స్టాక్ మార్కెట్ కొత్త ర్యాలీకి రిలయన్స్ ఇండస్ట్రీస్ నేతృత్వం వహిస్తుందని సెంట్రమ్ వెల్త్ మేనేజ్మెంట్ హెడ్ (ఈక్విటీ అడ్వైజర్) దేవాంగ్ మెహతా తెలిపారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. విక్రయాల కోసం ఎగుమతులపై ఆధారపడే ఆటోమొబైల్ సంస్థలు లేదా వాహన విడిభాగాల కంపెనీలకు ప్రస్తుతం దూరంగా ఉండటం మంచిదని సూచించారు. మరోవైపు దేశీయంగా చూస్తే వాహన విక్రయాలు నెమ్మదించాయని గుర్తు చేశారు. రానున్న