STOCKS

News


ఐపీఓకు కోల్డెక్స్‌ కంపెనీ

Friday 30th November 2018
Markets_main1543554481.png-22505

న్యూఢిల్లీ: కోల్డెక్స్‌ లిమిటెడ్‌ కంపెనీ ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌కు (ఐపీఓ) రానుంది. పుడ్‌ సప్లై చెయిన్‌ డిస్ట్రిబ్యూషన్‌ కార్యకలాపాలు నిర్వహించే ఈ కంపెనీ ఐపీఓ సంబంధిత పత్రాలను ఇటీవలే మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీకి సమర్పించింది. ఐపీఓలో భాగంగా ఈ కంపెనీ 10.10 లక్షల తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనున్నది. వీటితో పాటు ఈ కంపెనీలో భాగస్వామ్యం ఉన్న ఎస్‌ఏబీఆర్‌ ఇండియా ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ 16.56 లక్షల షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) విధానంలో విక్రయించనుంది. ఈ ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను ఐటీ ఇన్‌ఫ్రా కోసం, అనుబంధ కంపెనీ కోల్డెక్స్‌ లాజిస్టిక్స్‌ వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాల కోసం, ఇతర కంపెనీల కొనుగోళ్లకు, ఇతర వ్యూహాత్మక, సాధారణ వ్యాపార కార్యకలాపాలకు వినియోగించుకోవాలని కంపెనీ యోచిస్తోంది. ఈ ఐపీఓకు బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్‌గా పంటోమ్యాథ్‌ క్యాపిటల్‌ అడ్వైజర్స్‌ వ్యవహరిస్తోంది. ఆహార సేవల రంగంలోని వివిధ కంపెనీలతో పాటు, ఎఫ్‌ఎంసీజీ, కన్ఫెక‌్షనరీ, డెయిరీ, రిటైల్‌ రంగంలోని పలు కంపెనీలకు ఈ సంస్థ సేవలందిస్తోంది.



You may be interested

8 శాతం వృద్ధి కోసం మరిన్ని సంస్కరణలు

Friday 30th November 2018

న్యూఢిల్లీ: దేశ జీడీపీ వృద్ధి రేటును 8 శాతానికి పైగా తీసుకెళ్లేందుకు మరిన్ని సంస్కరణలు అవసరమని నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ చెప్పారు. అలాగే, తక్కువ వడ్డీ రేట్లతోపాటు సమృద్ధిగా నిధుల అందుబాటులో ఉండటమన్నది అధిక వృద్ధికి అవసరమని అభిప్రాయపడ్డారు. దేశ జీడీపీ వృద్ధి 2016-17లో 7.1 శాతం, 2017-18లో 6.7 శాతంగా నమోదైన విషయం తెలిసిందే. గురువారమిక్కడ ‘పెహలే ఇండియా ఫౌండేషన్‌’ నిర్వహించిన కార్యక్రమంలో రాజీవ్‌కుమార్‌

పెద్ద నోట్ల రద్దు దారుణం..

Friday 30th November 2018

న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు తదితర అంశాలపై కేంద్ర మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పెద్ద నోట్ల రద్దు దారుణమైన చర్యంటూ... ద్రవ్య విధానానికి పెద్ద షాక్‌లాంటిదని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్థిక వృద్ధి రేటు మరింత వేగంగా పడిపోవడానికి ఇదే కారణమని అరవింద్ పేర్కొన్నారు. త్వరలో విడుదల కానున్న "ఆఫ్‌ కౌన్సిల్ - ది చాలెంజెస్ ఆఫ్ మోదీ- జైట్లీ ఎకానమీ" పేరిట

Most from this category