STOCKS

News


28 నుంచి కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ బైబ్యాక్‌

Friday 23rd November 2018
Markets_main1542959896.png-22347

ప్రభుత్వ రంగానికి చెందిన నౌకా నిర్మాణ సంస్థ కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ తాజాగా షేర్ల బైబ్యాక్‌ తేదీని ప్రకటించింది. నవంబర్‌ 28న బైబ్యాక్‌ ఆఫర్‌ ప్రారంభమౌతుందని పేర్కొంది. 43.95 లక్షల ఈక్విటీ షేర్లను బైబ్యాక్‌ చేస్తామని, వీటి విలువ రూ.200 కోట్ల వరకు ఉండొచ్చని తెలిపింది. బైబ్యాక్‌ షేర్లు కంపెనీ మొత్తం ఈక్విటీలో 3.23 శాతం వాటాకు సమానం. ఇక షేర్ల బైబ్యాక్‌ ఆఫర్‌ డిసెంబర్‌ 11న ముగుస్తుంది. ఎడిల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌.. కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ షేర్ల బైబ్యాక్‌ ఆఫర్‌కు మేనేజర్‌గా వ్యవహరిస్తుంది. కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ బోర్డు గత నెలలో రూ.200 కోట్ల విలువైన ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌ ఆఫర్‌కు ఆమోదం తెలిపింది. బైబ్యాక్‌ ఆఫర్‌లో భాగంగా కంపెనీ ఒక్కొక్క షేరుకు రూ.455 చెల్లించనుంది. కాగా కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ గత ఏడాది ఆగస్ట్‌లో ఐపీవోకు వచ్చిన విషయం తెలిసిందే. 



You may be interested

స్పల్పంగా పెరిగిన పసిడి ధర

Friday 23rd November 2018

డాలర్‌ ఇండెక్స్‌ పతనంతో పాటు వచ్చే వారంలో జరగనున్న జీ-20 సదస్సు నేపథ్యంలో ప్రపంచమార్కెట్లో పసిడి ధర శుక్రవారం స్వల్పంగా బలపడింది. అంతర్జాతీయ మార్కెట్లను వణికిస్తున్న ‘‘అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం’’పై ఆ దేశాధ్యక్షులు చర్చలు జరపనున్నారు. వచ్చే వారంలో నవంబర్‌ 30న అర్జెంటీనాలో జరగనున్న జీ-20 సదస్సు ఇందుకు వేదికకానుంది. ‘‘వచ్చే వారం చర్చల అనంతరం ప్రతికూల వార్తలు వెలువడే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ఇన్వెస్టర్లు రక్షణాత్మకంగా పసిడి ఫ్యూచర్ల

రియల్‌మి కొత్త ఫోన్‌ ‘యూ1’

Friday 23rd November 2018

కేవలం నాలుగు స్మార్ట్‌ఫోన్లతోనే తన సత్తా చాటుకున్న చైనాకు చెందిన మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ ‘రియల్‌మి’ మరొక కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకు వచ్చేందుకు సిద్ధమైంది. నవంబర్‌ 28న ‘యూ1’ అనే కొత్త ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకురాబోతోంది. సెల్ఫీ కెమెరా ప్రధాన బలంగా కంపెనీ ఈ ఫోన్‌ను ఆవిష్కరించనుంది. అలాగే ఇందులో హీలియో పీ70 ప్రాసెసర్‌ను ఉపయోగిస్తోంది. ప్రపంచంలోనే ఈ రకం ప్రాసెసర్‌తో వస్తోన్న తొలి స్మార్ట్‌ఫోన్‌ ఇదే.

Most from this category