STOCKS

News


కోల్‌ ఇండియాతో కేంద్రానికే లాభాల పంట!

Wednesday 14th November 2018
Markets_main1542217476.png-22008

కోల్‌ ఇండియా... ఇది కేంద్రం ప్రభుత్వరంగ మహారత్న కంపెనీ. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న బొగ్గు ఉత్పత్తి సంస్థ. దేశీయ బొగ్గు రంగంలో గుత్తాధిపత్యం కలిగినది. ఈ కంపెనీలో ఇన్వెస్ట్‌ చేస్తే మంచి రాబడులు కచ్చితంగా వస్తాయి...? అని అనుకుంటే అది హాస్యాస్పదమే అవుతుంది!. ఎందుకంటే కోల్‌ ఇండియా స్టాక్‌ ఎక్సేంజ్‌ల్లో లిస్ట్‌ అయి ఎనిమిదేళ్లు అవుతోంది. ఈ కాలంలో ఇది కేవలం డివిడెండ్‌ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి రూ.74,000 కోట్ల ఆదాయాన్ని సమకూర్చింది. మరి 2010లో ఐపీవో ధర రూ.245కు సొంతం చేసుకున్న వారికి వచ్చిందేమిటి? ఇష్యూ ధరతో పోల్చితే 9 శాతం వృద్ధి. నాడు లిస్టింగ్‌ ధర రూ.287.75 కంటే ప్రస్తుత ధర రూ.265.60 తక్కువే. రిటైల్‌ ఇన్వెస్టర్లు ఐపీవోలో 5 శాతం తక్కువకు సొంతం చేసుకుని ఉన్నారనుకుంటే... ధర పరంగా 15 శాతం లాభం వచ్చినట్టు. కానీ, ఈ కాలంలో ద్రవ్యోల్బణ ప్రభావాన్ని పెట్టుబడి వృద్ధి నుంచి తీసివేస్తే నికర నష్టమే అని చెప్పుకోవాల్సి ఉంటుంది. కానీ, ఇదే కాలంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 231 శాతం వృద్ధి చెందింది. 

 

కోల్‌ ఇండియాలో కేంద్ర ప్రభుత్వానికి అత్యధిక వాటా ఉంది. ఈ కారణంగా కంపెనీ ప్రకటించిన డివిడెండ్‌ (లాభాల్లో కొంత మేర వాటాదారులకు ఏటా పంపిణీ)లో అధిక వాటా కేంద్రానికే వెళుతుంది. ఎనిమిదేళ్లలో 2010-11 నుంచి 2017-18 వరకు కేంద్రం పొందిన డివిడెండ్‌ మొత్తం రూ.74,267 కోట్లు. కానీ, ఈ కాలంలో కోల్‌ ఇండియా పంపిణీ చేసిన మొత్తం డివిడెండ్‌ రూ.88,916 కోట్లు. ఇందులో కేంద్రానికి వెళ్లిన మొత్తాన్ని తీసివేసి చూస్తే రూ.14,649 కోట్లు మిగిలిన వాటాదారులకు డివిడెండ్‌ రూపంలో లభించినట్టు. సెప్టెంబర్‌ త్రైమాసికం నాటికి కంపెనీలో కేంద్రానికి ఉన్న వాటా 78.32 శాతం. అయితే, ఇటీవలే ఆఫర్‌ ఫర్‌ సేల్‌ మార్గంలో 3.19 శాతాన్ని విక్రయించింది. గతేడాది కోల్‌ ఇండియా 165 శాతం డివిడెండ్‌ ప్రకటించింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో డివిడెండ్‌ 199 శాతంగా ఉంది. 



You may be interested

ఎన్నికల ఫలితాలు మార్కెట్‌ను పడేస్తాయా?

Wednesday 14th November 2018

తెలంగాణ, మధ్యప్రదేశ్‌, ఛత్తీ్స్‌గఢ్‌, రాజస్థాన్‌, మిజోరాంలో ఈ నెల, వచ్చే నెల మొదటి వారంలో జరిగే ఎన్నికల ఫలితాల కోసం చాలా మంది ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాష్ట్రాల ఫలితాలు వచ్చే నెల 11న వెలువడనున్నాయి. అప్పటి వరకు నిఫ్టీ 10,000-11,000 మధ్య ట్రేడ్‌ అవుతుందని, ఈ శ్రేణిని దాటి పోకపోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వచ్చే ఏడాది జరిగే సాధారణ ఎన్నికలపై రాష్ట్రాల ఎన్నికలు ప్రభావం చూపిస్తాయని

భారత మార్కెట్‌లో ఇంకా రిస్క్‌ ఉంది..!

Wednesday 14th November 2018

సీఎల్‌ఎస్‌ఏ ఇండియా స్ట్రాటజిస్ట్ మహేష్ నందూర్కర్ వ్యాఖ్య న్యూఢిల్లీ: భారత మార్కెట్‌లో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇంకా కొనసాగుతూనే ఉందని వ్యాఖ్యానించిన సీఎల్‌ఎస్‌ఏ ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌, ఇండియా స్ట్రాటజిస్ట్ మహేష్ నందూర్కర్.. వచ్చే కొద్ది నెలల్లో ద్రవ్య లోటు, వడ్డీ రేట్లు అంశాలు మార్కెట్‌కు అతిపెద్ద సవాళ్లుగా ఉన్నాయని వివరించారు. సంస్థ 21వ ఇండియా ఇన్వెస్టర్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత మార్కెట్ల భవిష్యత్తుపై

Most from this category