News


కోల్‌ ఇండియా టార్గెట్‌ ధర రూ.360

Tuesday 13th November 2018
Markets_main1542085707.png-21937

ముంబై: మంగళవారం నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో కోల్‌ ఇండియా లిమిటెడ్‌ (సిఐఎల్‌) షేరు ధర ఒక శాతం లాభపడి రూ.268కు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2018-19) రెండో త్రైమాసికంలో సంస్థ నికర లాభం ఎనిమిది రెట్లు పెరిగిన నేపథ్యంలో షేరు ధర ఇవాళ లాభాల్లో ప్రారంభమైంది. క్యూ2(జులై-సెప్టెంబర్‌) క్వార్టర్‌లో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.3,085 కోట్ల నికరలాభాన్ని ఆర్జించిన ఈ సంస్థ.. గత ఆర్థిక సంవత్సర క్యూ2లో రూ.370.4 కోట్ల లాభాన్ని ప్రకటించింది. ఈ నేపథ్యంలో షేరు ధరపై పాజిటీవ్‌గా ఉన్నట్లు ప్రముఖ బ్రోకింగ్‌ సంస్థలైన సీఎల్‌ఎస్‌ఏ, మాక్వైరీలు వెల్లడించాయి. ఎర్నింగ్స్‌ గ్రోత్‌ అవుట్‌లుక్‌ మెరుగ్గా ఉండడం, ఆకర్షణీయ విలువ కలిగిన ఈ సంస్థకు ఇంతకుముందు ఇచ్చిన బై రేటింగ్‌ను కొనసాగిస్తున్నట్లు సీఎల్‌ఎస్‌ఏ ప్రకటించింది. షేరు టార్గెట్‌ ధర రూ.360 వద్ద నిర్ణయించినట్లు తెలిపింది. సర్దుబాటు ఎబిటిడా తమ అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయని తెలిపిన మరో గ్లోబల్‌ బ్రోకింగ్‌ సంస్థ మాక్వైరీ.. డివిడెండ్‌ ఈల్డ్‌ అధికంగా ఉండవచ్చని విశ్లేషించింది. షేరుకు అవుట్‌పెర్ఫార్మ్‌ రేటింగ్‌ ఇచ్చిన ఈ సంస్థ.. కంపెనీ టార్గెట్‌ ధరను రూ.335 వద్ద నిర్ణయించినట్లు తెలిపింది. 



You may be interested

ఇంటెల్‌పై విచారణకు కాంపిటీషన్ కమిషన్‌ ఆదేశం

Tuesday 13th November 2018

న్యూఢిల్లీ: భారత మార్కెట్లో ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందన్న ఆరోపణలకు సంబంధించి చిప్ తయారీ దిగ్గజం ఇంటెల్ కార్పొరేషన్‌పై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) విచారణకు ఆదేశించింది. బెంగళూరుకు చెందిన వేలాంకని ఎలక్ట్రానిక్స్ ఫిర్యాదుతో ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. వేలాంకని సంస్థ.. దేశీయంగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల డిజైనింగ్‌, తయారీ కార్యకలాపాలు సాగిస్తోంది. వీటికి కీలకమైన ప్రాసెసర్స్‌, చిప్‌సెట్స్‌, మదర్‌బోర్డు/సర్వర్ బోర్డులు మొదలైన వాటిని ఇంటెల్ తయారు చేస్తోంది.

పారిశ్రామిక ఉత్పత్తి ఉసూరు!

Tuesday 13th November 2018

న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి సెప్టెంబర్‌లో అంతంతమాత్రంగానే నమోదయ్యింది. వృద్ధి రేటు కేవలం 4.5 శాతంగా తాజా గణాంకాలు వెల్లడించాయి. అంటే 2017 సెప్టెంబర్‌తో పోల్చితే 2018 సెప్టెంబర్‌లో పారిశ్రామిక ఉత్పత్తి కేవలం 4.5 శాతం పెరిగిందన్నమాట. అంతక్రితం గడచిన నాలుగు నెలల్లో ఇంత తక్కువ స్థాయిలో వృద్ధిరేటు నమోదుకావడం ఇదే తొలిసారి. మైనింగ్‌ రంగం, అలాగే భారీ యంత్ర పరికరాల ఉత్పత్తి, డిమాండ్‌కు ప్రతిబింబమైన క్యాపిటల్‌ గూడ్స్‌ రంగాల పేలవ

Most from this category