STOCKS

News


ఒడిదుడుకులకు సిద్ధంకండి!

Friday 4th January 2019
Markets_main1546588019.png-23410

మార్కెట్‌పై సీఎల్‌ఎస్‌ఏ సూచన
కొత్త ఏడాది మార్కెట్లో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లు చాలా జాగ్రత్తగా ఉండాలని, ఒడిదుడుకులను ఎదుర్కొనేందుకు రెడీగా ఉండాలని ప్రముఖ బ్రోకింగ్‌ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ సూచించింది. స్వల్పకాలానికి మార్కెట్‌ రిస్కు డౌన్‌సైడ్‌ ఉండొచ్చని అంచనా వేసింది. ప్రైవేట్‌ పెట్టుబడులు పెరగడం, గృహనిర్మాణ రంగంలో రికవరీకి మరికొంత కాలం పట్టవచ్చని అభిప్రాయపడింది.

ఏడాది చివరకు నిఫ్టీ టార్గెట్‌ను 11,000 పాయింట్లుగా సీఎల్‌ఎస్‌ఏ పేర్కొంది. ఈ సంవత్సరం ఎర్నింగ్స్‌ రెండంకెల స్థాయిని చేరతాయని అంచనా వేసింది. అయితే ఎర్నింగ్స్‌ మెరుగుదల అంచనాలను మార్కెట్‌ ఇప్పటికే ప్రైస్‌ఇన్‌ చేసిందని వివరించింది. ఈ ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలు అత్యంత కీలకమని తెలిపింది. ఈ ఎన్నికల ఫలితాల ఆధారంగా మార్కెట్‌ కదలికలుంటాయని తెలిపింది. దీంతో పాటు గ్రామీణ ఎకానమీలో పునరుత్తేజం, ఉద్యోగ కల్పన కూడా మార్కెట్‌పై కీలక ప్రభావం చూపవచ్చని అంచనా వేసింది.
ఏడాది కోసం సీఎల్‌ఎస్‌ఏ సిఫార్సులు: హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకు, రిలయన్స్‌, ఐటీసీ, ఇన్ఫోసిస్‌, ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ, ఎంఅండ్‌ఎం, ఇండస్‌ఇండ్‌బ్యాంకు, గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌.



You may be interested

రియల్టీ ఇండెక్స్‌ 1 శాతం అప్‌

Friday 4th January 2019

 రియల్టీ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ రియల్స్‌ ఇండెక్స్‌ నేటి ట్రేడింగ్‌లో 1శాతం ర్యాలీ చేసింది. మధ్యాహ్నం గం.1:45ని.లకు ఇండెక్స్‌ గత ముగింపు(233.95)తో పోలిస్తే 0.75శాతం లాభంతో 235.45ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇండెక్స్‌లో అత్యధికంగా ఓబేరాయ్‌ రియల్టీ 3శాతం ర్యాలీ చేయగా, ఫోనిక్స్‌ లిమిటెడ్‌ 2శాతం, గోద్రేజ్‌ పాపర్టీస్‌, డీఎల్‌ఎఫ్‌ 1శాతం పెరిగాయి. యూనిటెక్‌ అరశాతం లాభపడింది. మరోవైపు శోభ 3.50శాతం నష్టపోగా, సన్‌టెక్‌ 1.50శాతం, ప్రెస్టేజ్‌ 1శాతం,

పీఎస్‌యూ బ్యాంకింగ్‌ షేర్ల ర్యాలీ

Friday 4th January 2019

ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లు శుక్రవారం లాభాల బాట పట్టాయి. ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రాతినిథ్యం వహించే నిప్టీ పీఎస్‌యూ ఇండెక్స్‌ ఇంట్రాడేలో 2శాతం లాభపడింది. బ్యాంకులకు రుణాలను ఇచ్చే సామర్థం తగ్గిపోయిన నేపథ్యంలో క్యాపిటల్‌ అడెక్వసీ నిబంధనలను మరింత సరళతరం చేయాల్సిందిగా గురవారం భారత రిజర్వు బ్యాంక్‌ను పార్లమెంటరీ ప్యానెల్‌ కోరింది. బాసెల్‌ 3 నిబంధనలను మించి క్యాపిటల్‌ అడెక్వసీ నిబంధనలను ఆర్‌బీఐ అమలు చేయడాన్ని కమిటీ ప్రశ్నించింది.

Most from this category