STOCKS

News


ఎన్నికల వేళ వీటికి కళ

Friday 24th August 2018
Markets_main1535094750.png-19596

గ్లోబల్‌ బ్రోకరేజ్‌ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ తాజాగా పలు రకాల స్టాక్స్‌ను సిఫార్సు చేసింది. ఎన్నికలు దగ్గరలో ఉండటం వల్ల వినియోగ రంగం, హౌసింగ్‌ విభాగపు షేర్లు మంచి పనితీరు కనబరచవచ్చని పేర్కొంది. బీజేపీ 2014లో చూపించిన పనితీరు ఇప్పుడు చూపించకపోవచ్చని, అయితే ఇప్పటికీ ఇదే ఫెవరేట్‌గా ఉందని తెలిపింది. ప్రజల్లో వ్యతిరేకత, ప్రతిపక్షల ఐక్యత వంటి అంశాలు బీజేపీకి పెద్ద రిస్క్‌లని పేర్కొంది. బీజేపీకి 272 సీట్లు రాకపోవచ్చని, 60 సీట్లు తగొచ్చని అంచనా వేసింది. 
ఎన్నికల నేపథ్యంలో రక్షణాత్మక పోర్ట్‌ఫోలియోను కలిగి ఉండటం మంచిదని సూచించింది. గ్రామీణ వినియోగం, హౌసింగ్‌ కంపెనీల షేర్లను కలిగి ఉండాలని సూచించింది. గ్రామీణ వినియోగ విభాగంలో మహీంద్రా అండ్‌ మహీంద్రా, డాబర్‌ ఇండియా షేర్లను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. హౌసింగ్‌ రంగంలో హెచ్‌డీఎఫ్‌సీ, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ షేర్లను ఎంపిక చేసుకోవచ్చని పేర్కొంది. ఐటీసీని రక్షణాత్మక కన్సూమర్‌ స్టాక్‌గా అభివర్ణించింది. ఇది ఆమోదయోగ్యమైన వ్యాల్యుయేషన్స్‌ వద్ద ఉందని, టుబాకో పన్ను చార్జీలు తక్కువగా ఉన్నాయని పేర్కొంది. ఎగుమతి ఆధారిత స్టాక్స్‌పై కూడా కన్నేయవచ్చని తెలిపింది. ఎన్నికలప్పుడు మార్కెట్‌ ఒడిదుడుకుల వల్ల ఎఫ్‌ఐఐలు ఇన్వెస్ట్‌మెంట్లను వెనక్కు తీసుకోవచ్చని, అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి పడిపోవచ్చని పేర్కొంది. ఇటాంటి సందర్భాల్లో ఎగుమతి ఆధారిత స్టాక్స్‌కు ప్రయోజనం కలుగుతుందని తెలిపింది. 

2019 ఎన్నికల నేపథ్యంలో సీఎల్‌ఎస్‌ఏ సిఫార్సు చేసిన స్టాక్స్‌ను గమనిస్తే..

స్టాక్‌: డాబర్‌ ఇండియా
రేటింగ్‌: కొనొచ్చు
టార్గెట్‌ ప్రైస్‌: రూ.500
గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం పుంజుకుంటే డాబర్‌ ఇండియా ఎక్కువగా లాభపడుతందని పేర్కొంది. పోటీ తక్కువగా ఉండటం కలిసొచ్చే అంశమని తెలిపింది. ఆయుర్వేద/నేచురల్‌ ప్రొడక్టులకు కస్టమర్ల నుంచి ఆదరణ లభిస్తుండటం సానుకూల అంశమని పేర్కొంది. 

స్టాక్‌: గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌
రేటింగ్‌: కొనొచ్చు
టార్గెట్‌ ప్రైస్‌: రూ.1,097
గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ సంస్థ భారత్‌లో ఒకేఒక దేశవ్యాప్త ప్రాపర్టీ డెవలపర్‌గా అవతరించిందని పేర్కొంది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ప్రి-సేల్స్‌ కొత్త గరిష్ట స్థాయికి చేరాయని తెలిపింది. కొత్త ప్రాజెక్టులు అమలులో ఉన్నాయని పేర్కొంది. కార్పొరేట్‌ గవర్నెన్స్‌ మెరుగుపడటం, ప్రొఫెషనల్‌ మేనేజ్‌మెంట్‌, ఆన్‌టైమ్‌ కంప్లీషన్‌ ట్రాక్‌ రికార్డ్‌ వంటివి సానుకూల అంశాలని వివరించింది. 

స్టాక్‌: హెచ్‌డీఎఫ్‌సీ
రేటింగ్‌: కొనొచ్చు
టార్గెట్‌ ప్రైస్‌: రూ.2,480
అందుబాటు గృహాల డిమాండ్‌ వల్ల లబ్ది పొందటానికి హెచ్‌డీఎఫ్‌సీ సిద్ధంగా ఉందని పేర్కొంది. వ్యాల్యుయేషన్స్‌ ఆకర్షణీయంగా ఉన్నాయని తెలిపింది. 2018-21 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో ప్రధానమైన ఆపరేటింగ్‌ ప్రాఫిట్స్‌లో 15 శాతం చక్రగతి వృద్ధి నమోదుకావొచ్చని అంచనా వేసింది. ​ 

స్టాక్‌: మహీంద్రా అండ్‌ మహీంద్రా
రేటింగ్‌: కొనొచ్చు
టార్గెట్‌ ప్రైస్‌: రూ.1,120
ట్రాక్టర్లకు, తేలికపాటి వాణిజ్య వాహనాలకు ఉన్న బలమైన డిమాండ్‌ ఎంఅండ్‌ఎంకు కలిసొచ్చే అంశమని తెలిపింది. గ్రామీణ ప్రాంత డిమాండ్‌ బలంగా ఉండొచ్చనే అంచనాలున్నాయని పేర్కొంది. ఇది పాజిటివ్‌ అంశమని తెలిపింది.

స్టాక్‌: సన్‌ ఫార్మా
రేటింగ్‌: కొనొచ్చు
టార్గెట్‌ ప్రైస్‌: రూ.750
ఎర్నింగ్స్‌లో బలమైన వృద్ధి కనబరిచే అవకాశముందని పేర్కొంది. అడ్డంకులు ఉన్నప్పటికీ వ్యూహాల అమలు సమర్థవంతంగా ఉండటం సానుకూల అంశమని తెలిపింది. 

స్టాక్‌: ఇన్ఫోసిస్‌
రేటింగ్‌: కొనొచ్చు
టార్గెట్‌ ప్రైస్‌: రూ.1,560
డిమాండ్‌ ఔట్‌లుక్‌లో మెరుగుదల కనిపిస్తోందని పేర్కొంది. ప్రాజక్టులను సమర్థవంతంగా అమలు చేయడం, డిజిటల్‌ సర్వీసుల్లో భిన్నత్వం వంటి అంశాలు సానుకూలమని తెలిపింది. ఎగ్జిక్యూషన్‌పై మళ్లీ దృష్టిపెట్టడం వల్ల క్లయింట్స్‌ పెరగొచ్చని, వృద్ధి పుంజుకోవచ్చని పేర్కొంది. వ్యాల్యుయేషన్స్‌ ఆమోదయోగ్యంగానే ఉన్నాయని తెలిపింది.

స్టాక్‌: ఐటీసీ
రేటింగ్‌: కొనొచ్చు
టార్గెట్‌ ప్రైస్‌: రూ.390
సిగరెట్లపై పన్ను అంశాన్ని ఎక్కువగా అంచనా వేశారని పేర్కొంది. సిగరెట్ల విక్రయాల వృద్ధి రికవరీ చెందనుందని తెలిపింది. స్టాక్‌ ధర ఏడాది భవిష్యత్‌ ఎర్నింగ్స్‌కి 29 రెట్లు వద్ద ఉందని, తన ప్రత్యర్థి కంపెనీలతో పోలిస్తే ఇది డిస్కౌంట్‌లో ఉందని పేర్కొంది. 

స్టాక్‌: మారుతీ సుజుకీ
రేటింగ్‌: కొనొచ్చు
టార్గెట్‌ ప్రైస్‌: రూ.11,300
వ్యాల్యుయేషన్స్‌ చౌకగా ఏమీలేవని అయితే దీర్ఘకాల అంచనాలు, ఎర్నింగ్స్‌ వృద్ధి పరం చూస్తే ఇవి ఆమోదయోగ్యమేనని పేర్కొంది. పోటీతత్వం తగ్గిందని, ఇతర గ్లోబల్‌ కంపెనీలు భారత్‌పై కాకుండా వాటి వాటి ప్రధాన మార్కెట్‌పై దృష్టి కేంద్రీకరించాయని తెలిపింది. 

స్టాక్‌: ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌
రేటింగ్‌: కొనొచ్చు
టార్గెట్‌ ప్రైస్‌: రూ.2,350
కాసా రేషియో బాగుండటం, కొత్త రిటైల్‌ విభాగాల్లోకి కార్యకలాపాలను విస్తరించడం వంటి అంశాలు వృద్ధికి దోహదపడతాయని పేర్కొంది. భారత్‌ ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూజన్‌ కొనుగోలు వల్ల లాభదాయకత పెరగొచ్చని అంచనా వేసింది. 



You may be interested

వ్యాల్యు పిక్‌: ఐఐఎఫ్‌ఎల్‌ హోల్డింగ్స్‌

Friday 24th August 2018

వ్యాల్యు పిక్‌: ఐఐఎఫ్‌ఎల్‌ హోల్డింగ్స్‌ బ్రోకరేజ్‌ సంస్థ ఆనంద్‌రాఠి తాజాగా ఐఐఎఫ్‌ఎల్‌ హోల్డింగ్స్‌పై పాజిటివ్‌గా ఉంది. కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. ఎందుకో ఒకసారి చూద్దాం... బ్రోకరేజ్‌: ఆనంద్‌రాఠి  స్టాక్‌: ఐఐఎఫ్‌ఎల్‌ హోల్డింగ్స్‌ రంగం: ఫైనాన్స్‌ ప్రస్తుత ధర: రూ.721 టార్గెట్‌ ప్రైస్‌: రూ.910 బ్రోకరేజ్‌ సంస్థ ఆనంద్‌రాఠి తాజాగా ఐఐఎఫ్‌ఎల్‌ హోల్డింగ్స్‌పై బుల్లిష్‌గా ఉంది. ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చిని సిఫార్సు చేస్తోంది. వచ్చే ఏడాది కాలంలో టార్గెట్‌ ప్రైస్‌ను రూ.910గా నిర్ణయించింది. ఐఐఎఫ్‌ఎల్‌ హోల్డింగ్స్‌.. ఐఐఎఫ్‌ఎల్‌ ఫైనాన్స్‌,

ట్రంప్‌ను దింపేస్తే.. మార్కెట్లో మంటలేనా?

Friday 24th August 2018

తనను అభిశంసిస్తే క్రాష్‌ తప్పదని హెచ్చరించిన ప్రెసిడెంట్‌ అవకాశాలు తక్కువేనంటున్న నిపుణులు గట్టిగా యత్నిస్తున్న డెమోక్రాట్లు కీలకం కానున్న నవంబర్‌       తెపరితనంతో ముందుకు దూకే ట్రంప్‌ పాలనకు చరమగీతం పడనుందా? చరిత్రలో అత్యంత భయానకమైన క్రాష్‌ పొంచి ఉందా? ఇక ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌మెంట్‌ చేదు గుళికేనా?.. ఒక్కసారిగా  ప్రపంచ మార్కెట్లలో అనేక సందేహాలు... ఎన్నో భయాలు, మరెన్నో ఆందోళనలు.. వీటన్నింటికీ కారణాలేంటి?.. చూద్దాం... అంతర్జాతీయ మార్కెట్లు ఉలిక్కిపడేలా చేయడం అమెరికా అధ్యక్షుడికి పరిపాటిగా మారింది. ఇదే కోవలో మరోమారు

Most from this category