STOCKS

News


ఐసీఐసీఐ షేరుపై బ్రోకరేజ్‌లు బుల్లిష్‌

Thursday 31st January 2019
Markets_main1548913902.png-23917

క్యు3 ఫలితాలు ఆశావహంగా ఉండడంతో పలు బ్రోకరేజ్‌లు ఐసీఐసీఐ బ్యాంకు షేరుపై పాజిటివ్‌గా మారాయి. క్యు3లో బ్యాంకు ఎన్‌ఐఐ, మార్జిన్లు మంచి వృద్ది నమోదు చేయడంతో పాటు మొండిపద్దుల విషయంలో మంచి మెరుగుదల చూపింది. దీంతో బ్యాంకు ఎన్‌పీఏ సైకిల్‌ టాప్‌అవుట్‌ అయినట్లు నిపుణులు భావిస్తున్నారు. 
బ్రోకరేజ్‌ల అంచనాలు
- సీఎల్‌ఎస్‌ఏ: కొనొచ్చు రేటింగ్‌. టార్గెట్‌ను రూ. 450 నుంచి 470కి పెంచింది. ఎర్నింగ్స్‌లో మెరుగుదల కనిపిస్తోంది. కాసా బలంగా ఉంది. ఫైనాన్స్‌ రంగంలో ఈ షేరు టాప్‌పిక్స్‌లో ఒకటి. స్వల్పకాలానికి కొచ్చర్‌ విషయంలో ఇబ్బందులు తప్పవు. బ్యాంకు ఎన్‌పీఏలు దాదాపు 12 త్రైమాసికాల కనిష్ఠానికి రావడం విశేషం. 
- జెఫర్రీస్‌: కొనొచ్చు రేటింగ్‌. టార్గెట్‌ను రూ. 385 నుంచి రూ. 450కి పెంచింది. ఆర్‌ఓఈ 16 శాతానికి పైగా ఉండడం విశేషం. రాబోయే కాలంలో కూడా కోర్‌ ఆర్‌ఓఈలో ఇదే తరహా వృద్ధి ఉండొచ్చు. ఈపీఎస్‌లో 47.5 శాతం చక్రీయ వార్షిక వృద్ధి ఉంటుందని అంచనా. అయితే మార్జిన్‌ అంచనాలను మాత్రం బ్రోకింగ్‌ సంస్థ స్వల్పంగా తగ్గించింది. 
- మోర్గాన్‌స్టాన్లీ: ఓవర్‌వెయిట్‌ రేటింగ్‌. టార్గెట్‌ రూ. 510. పీపీఓపీ, అసెట్‌క్వాలిటీ అంచనాల కన్నా బాగున్నాయి. రాబోయే ఏడాదిలో వీటిలో మరింత నాణ్యత కనిపిస్తుందని అంచనా. 
- మాక్క్వైరీ: అవుట్‌పెర్ఫామ్‌ రేటింగ్‌. టార్గెట్‌ను రూ. 416 నుంచి రూ. 460కి పెంచింది. బలమైన ఫలితాలు ప్రకటించింది. క్రెడిట్‌కాస్ట్‌లు తగ్గే సమయంలో ఈ షేరు అత్యంత ఎంచుకోదగినది. నిర్వహణ పారామీటర్లు స్థిరంగా ఉన్నాయి. 



You may be interested

ఎయిర్‌టెల్‌ ఫలితాలు.. ఏం చూడాలి?

Thursday 31st January 2019

టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్‌ నేడు క్యూ3 ఫలితాలు ప్రకటించనుంది. ఈ దఫా కంపెనీ నష్టాలు రూ. 500- 900 కోట్ల మధ్య ఉండొచ్చని బ్రోకింగ్‌ సంస్థలు భావిస్తున్నాయి. రెవెన్యూ వృద్ధి ఒక్క శాతం ఉండొచ్చని, ఇందుకు ప్రధానంగా ఆఫ్రికా వ్యాపారమే కారణమని అంచనా వేస్తున్నాయి. దేశీయ వ్యాపారంలో కూడా కన్సాలిడేషన్‌ కనిపిస్తోందని తెలిపాయి. నికర ఆదాయంలో 15- 20 శాతం నష్టం ఉండొచ్చని అంచనా. కస్టమర్లు తగ్గడం ఫలితాలపై ప్రభావం

కోబ్రా కథనం అసత్యం

Thursday 31st January 2019

ఖండించిన డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ఆధార్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ విక్రయం ! ముంబై: డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ కంపెనీ రూ.31,000 కోట్ల కుంభకోణానికి పాల్పడిందంటూ ఆన్‌లైన్‌​ న్యూస్‌ పోర్టల్‌, కోబ్రాపోస్ట్‌ వెల్లడించిన వార్త సత్యదూరమని ఆ కంపెనీ ఖండించింది. ఎలాంటి డొల్ల కంపెనీలకు రుణాలివ్వలేదని, పార్టీలకు విరాళాలు ఇచ్చామనడం కూడా అబద్ధమేనని కంపెనీ చైర్మన్‌ కపిల్‌ వాధ్వాన్‌ పేర్కొన్నారు. వికాస్‌ శేఖర్‌ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదులోని అంశాల ఆధారంగానే కోబ్రాపోస్ట్‌ సత్యదూరమైన కథనాన్ని పోస్ట్‌ చేసిందని విమర్శించారు.

Most from this category