STOCKS

News


హెచ్‌డీఎఫ్‌సీ ద్వయంపై సీఎల్‌ఎస్‌ఏ బుల్లిష్‌

Monday 25th February 2019
Markets_main1551083285.png-24320

హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్‌ ద్వయం షేర్లపై సీఎల్‌ఎస్‌ఏ రేటింగ్‌ సం‍స్థ బుల్లిష్‌గా ఉంది. ఈ రెండు షేర్లు ధీర్ఘకాలంలో 25 నుంచి 30శాతం రాబడి ఇచ్చే అవకాశం ఉందని బ్రోకరేజ్‌ అంచనా వేసింది. ఇటీవల కొన్ని అవాంఛనీయ సంఘటనలతో ఆర్థిక రంగం కొంత ఒడిదుడుకులకు లోనైప్పటికీ.., గృహరంగానికి మాత్రం భారీ డిమాండ్‌ నెలకొని ఉంది. ఈ రంగంలో హెచ్‌డీఎఫ్‌ షేరు టాప్‌ పిక్‌గా కొనసాగుతుందని బ్రోకరేజ్‌ సంస్థ తెలిపింది. ఈ కారణాలతో హెచ్‌డీఎఫ్‌సీ షేరుకు టార్గెట్‌ ధరను రూ.2360కు పెంచుతున్నట్లు పేర్కోంది. అలాగే హెచ్‌డీఎఫ్‌ బ్యాంక్‌ టార్గెట్‌ ధరను రూ.2,730లకు పెంచుతున్నట్లు బ్రోకరేజ్‌ తెలిపింది. బ్యాంక్‌ను సమర్థవంతం‍గా నడిపిస్తున్న ప్రస్తుత మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆదిత్య పూరి పదవీకాలాన్ని మరింత కాలం పొడిగించే అవకాశం బ్యాంక్‌కు కలిసొస్తుంది. ఎన్‌బీఎఫ్‌సీ సంక్షోభాన్ని అధిగమించేందుకు 1లేదా 2ఏళ్ల పట్టవచ్చని, అయితే సీఏఎస్‌ఏ డిపాజిట్ల వృద్ధి బ్యాంకు కలిసొచ్చే మరో అంశమని బ్రోకరేజ్‌ సంస్థ పేర్కోంది.



You may be interested

ఎగసి పడిన రియల్టీ షేర్లు

Monday 25th February 2019

ఇళ్ల కొనుగోళ్లపై పన్ను భారాన్ని తగ్గిస్తూ జీఎస్‌టీ మండలి తీసుకున్న నిర్ణయంతో సోమవారం రియల్టీ షేర్లు ఎగిసిపడ్డాయి. నిర్మాణంలో ఉన్న ఇళ్లపై జీఎస్‌టీ శాతాన్ని 12 శాతం నుంచి 5శాతానికి, అందుబాటు ధరల్లో ఉన్న ఇళ్లపై పన్నును 8శాతం నుంచి 1శాతానికి తగ్గిస్తున్నట్లు ఆదివారం జీఎస్‌టీ మండలి ప్రకటించింది. ఈ ప్రకటనతో నేడు రియల్‌ ఎస్టేట్‌ షేర్లు ఉదయం ట్రేడింగ్‌లో భారీ లాభపడి మిడ్‌సెషన్‌ సమయానికి క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి.

బ్యాంక్‌ నిఫ్టీ జంప్‌

Monday 25th February 2019

ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ షేర్ల ర్యాలీ అండతో సోమవారం బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 27000 మార్కును అందుకుంది. మార్కెట్‌ లాభాల ర్యాలీలో భాగంగా ఐసీఐసీఐ బ్యాంక్‌, యస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్లు 1శాతం వరకు ర్యాలీ చేయడంతో నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 172 పాయింట్లు(0.75 శాతం)లాభపడి 27,039.45 పాయింట్ల గరిష్టాన్ని తాకింది. ఉదయం గం.11:45ని.లకు ఇండెక్స్‌ గత ముగింపు(26867)తో పోలిస్తే అరశాతం లాభంతో 27,022 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

Most from this category