STOCKS

News


సిప్లా అంచనాలు మిస్‌..!

Monday 5th November 2018
Markets_main1541404807.png-21718

ముంబై:- ఔషధ రంగ దిగ్గజం సిప్లా సెప్టెంబర్‌ క్వార్టర్‌ ఫలితాలు విశ్లేషకుల అంచనాలను మిస్‌ అయ్యాయి. ఈ క్యూ2లో విశ్లేషకులు రూ.450 కోట్ల నికరలాభాన్ని అంచనా వేయగా, కంపెనీ రూ.377.05 కోట్ల నికరలాభాన్ని మాత్రమే ఆర్జించింది. ఇదే క్యూ2లో విశ్లేషకులు రూ.4270 కోట్ల అమ్మకాలు అంచనా వేయగా, రూ.3,947.93 కోట్లకు పరిమితమైంది. గతేడాది ఇదే క్యూ2లో కంపెనీ ఆర్జించిన రూ.3,988.24కోట్లతో పోలిస్తే అ‍మ్మకాలు 1శాతం తక్కువ. గతేడాది ఇదే క్యూ2లో నమోదైన రూ.422.39కోట్లతో పోలిస్తే ఇది 11శాతం తక్కువ. ఇదే సెప్టెంబర్‌ క్వార్టర్‌లో ఎబిటా సైతం తగ్గుముఖం పట్టింది. గతేడాది క్యూ2లో కంపెనీ రూ.784 కోట్ల ఎబిటాను నమోదు చేయగా, ఈ క్యూ2లో రూ.701 కోట్లకు పరిమితమైంది. కాగా విశ్లేషకులు మాత్రం రూ.830 కోట్ల ఎబిటాను అంచనా వేశారు. మార్జిన్లు సైతం 19.2శాతం నుంచి 17.5శాతానికి పరిమితమయ్యాయి.
2.50శాతం నష్టపోయిన షేరు ధర:-
ఫలితాలు అంచనాలను అందుకోలేకపోవడంతో షేరు ధర నష్టాల్లో ట్రేడ్‌ అవుతోంది. నేడు సిప్లా షేరు రూ.608.5ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడే ప్రారంభంలో 1.50శాతం లాభపడింది. అయితే ఫలితాల ప్రకటన అనంతరం షేరు నష్టాల్లోకి మళ్లింది. ఫలితాలు అంచనాలకు అందుకోవడంలో విఫలమవడంతో ఇన్వెస్టర్లు షేరు అమ్మకాలకు మొగ్గుచూపారు. ఫలితంగా షేరు 8శాతం నష్టపోయి రూ.558.10
కనిష్టానికి పతనమైంది. మధ్యాహ్నం గం.2:300ని.లకు షేరు గత ముగింపు(రూ.608.5) ధరతో పోలిస్తే 7.50శాతం నష్టంతో రూ.555ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ. 508.10 రూ.678.00లుగా నమోదయ్యాయి.



You may be interested

అక్టోబర్‌లో సేవల రంగం జోరు

Monday 5th November 2018

52.2కి పెరిగిన ఇండెక్స్‌.. భారత్‌లో సేవల రంగం అక్టోబర్‌ నెలలో వేగంగా వృద్ధి చెందింది. నికాయ్‌ ఇండియా సర్వీసెస్‌ బిజినెస్‌ యాక్టివిటీ ఇండెక్స్‌ 52.2కి ఎగసింది. కొత్త ఆర్డర్లు పెరగడం, దీంతో ఉద్యోగ సిబ్బంది విస్తరణ వంటి అంశాలు ఇందుకు కారణంగా నిలిచాయి. ఇండెక్స్‌ ఈ స్థాయిలో వేగంగా పెరగడం గత మూడు నెలల్లో (జూలై నుంచి చూస్తే) ఇదే ప్రథమం. కాగా సెప్టెంబర్‌లో ఇండెక్స్‌ నాలుగు నెలల కనిష్ట స్థాయి

సంవత్ 2075లో సెన్సెక్స్‌ శ్రేణి 35,000-45,000 పాయింట్లు

Monday 5th November 2018

50 శాతం మార్కెట్‌ విశ్లేషకుల అంచనా ఇదే ముంబై: సంవత్ 2075లో సెన్సెక్స్‌ 45,000 పాయింట్లకు చేరుకునే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. పలు ప్రాంతాలలో నూతన ఏడాది ప్రారంభంగా భావించే దీపావళి పండుగ దగ్గర పడిన సందర్భంగా.. ఇక్కడ నుంచి వచ్చే ఏడాది పాటు మార్కెట్‌ ఎలా ఉండవచ్చనే అంశంపై ఒక ఆంగ్ల చానల్‌ నిర్వహించిన సర్వేలో ఈ మేరకు అంచనాలు వెల్లడయ్యాయి. పోల్‌లోని 50 శాతం మార్కెట్‌ విశ్లేషకులు

Most from this category