STOCKS

News


5నెలల కనిష్టానికి సిప్లా

Tuesday 6th November 2018
Markets_main1541493889.png-21758

ఔషధ రంగ దిగ్గజం సిప్లా షేరు మంగళవారం బీఎస్‌ఈ ట్రేడింగ్‌లో 5నెలల కనిష్టానికి చేరుకుంది. సిప్లా కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరంలో మార్కెట్‌ విశ్లేషకులు ఆశించిన స్థాయిలో ఫలితాలను నమోదు చేయలేకపోయింది. దీంతో పాటు సిటీ, హెచ్‌ఎస్‌బీసీ,  క్రెడిట్‌ శాచ్స్‌ వంటి బ్రోకరేజ్‌ సంస్థలు సిప్లా షేరు రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేశాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు షేరు అమ్మకాలకు మొగ్గుచూపడంతో షేరు నష్టాల బాట పట్టింది. పలితంగా నేడు షేరు 6.50శాతం పతనమైన రూ.528.10 వద్ద ఇంట్రాడే కనిష్టానికి పతనమైంది. ఈ ఇంట్రాడే కనిష్టస్థాయి సిప్లా షేరుకు 5నెలల కనిష్టస్థాయి. మద్యాహ్నం గం.1:30లని.లకు షేరు గత ముగింపు ధర(రూ.563.9)తో పోలిస్తే 6శాతం నష్టంతో రూ.533ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.508.10లు రూ.678.00లుగా నమోదయ్యాయి.
బ్రోకరేజ్‌ సంస్థ:-  
హెచ్‌బీసీ

రేటింగ్‌:- డౌన్‌గ్రేడింగ్‌ టు హోల్డ్‌,

టార్గెట్‌ ధర:- రూ.730లు నుంచి 610

బ్రోకరేజ్‌ సంస్థ:- క్రెడిట్‌ శాచ్స్‌
రేటింగ్‌:- డౌన్‌గ్రేడ్‌ టు న్యూట్రల్‌

టార్గెట్‌ ధర:- రూ.637ల నుంచి రూ.570
బోక్రరేజ్‌ సంస్థ:- సిటి

రేటింగ్‌:- ఈక్వల్‌వెయిట్‌ టు డౌన్‌గ్రేడ్‌

టార్గెట్‌ ధర:- రూ.716ల నుంచి రూ.548



You may be interested

నష్టాల్లో నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌

Tuesday 6th November 2018

ఒడిదుడుకుల మార్కెట్‌ ట్రేడింగ్‌లో భాగంగా  మంగళవారం మిడ్‌సెషన్‌ అనంతరం ఎన్‌ఎస్‌ఈలోని ప్రధాన సూచీ బ్యాంక్‌ నిఫ్టీ నష్టాల బాట పట్టింది. సూచీలుఓ పలు ప్రభుత్వరంగ షేర్ల నష్టాల ర్యాలీ ఇందుకు కారణమవుతోంది. ఎస్‌బీఐ, ఇండస్‌ ఇండక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్ల పతనంతో దాదాపు 1శాతం నష్టపోయి 25,558ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.3:00లకు ఇం‍డెక్స్‌ గత ముగింపు(25732.20)తో పోలిస్తే అరశాతం నష్టంతో 25,596.45 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

నిఫ్టీ 9,500లకు వస్తే కొనేయండి..

Tuesday 6th November 2018

లిక్విడిటీ సమస్యలు, రాజకీయ అస్థిరతల కారణంగా నిఫ్టీ-50 ఇండెక్స్‌ 9,500 స్థాయికి పడిపోతే అప్పుడు కళ్లు మూసుకొని స్టాక్స్‌ను కొనుగోలు చేయవచ్చని మార్కెల్లస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌ ఫౌండర్‌ సౌరభ్‌ ముఖర్జీ తెలిపారు. 9,500 స్థాయిలో రాజకీయ పరిస్థితులు, క్రూడ్‌ ధరల వంటి ఇతర అంశాల గురించి ఆలోచించాల్సిన పనిలేదని పేర్కొన్నారు. కాగా నిఫ్టీ గత రెండు నెలల కాలంలో దాదాపు 10 శాతానికిపైగా పడిపోయి మళ్లీ రీబౌండ్‌ అయ్యింది. బ్రెంట్‌

Most from this category