STOCKS

News


వచ్చే వారం ఎలా ఉంటుంది?

Saturday 29th December 2018
Markets_main1546080514.png-23317

ఈ వారాంతానికి నిఫ్టీ దాదాపు ఒక్క శాతం లాభంతో 10860 పాయింట్ల వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా ఈ వారం మార్కెట్లు భారీ పతనాలు చూశాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి డిసెంబర్‌లో దాదాపు 3 లక్షల కోట్ల డాలర్ల సంపద ఆవిరైంది. రాబోయే రోజుల్లో అమెరికా మార్కెట్లు మరింత పతనమవుతాయన్న భయాలున్నాయి.
చార్టులేమంటున్నాయి?
నిఫ్టీ క్రమంగా ఉత్సాహం కోల్పోతున్న సూచనలున్నాయి. చార్టుల్లో చిన్న చిన్న క్యాండిల్స్‌ ఏర్పడుతున్నాయి. పలు కీలక ఇండికేటర్లు సెల్‌ సంకేతాలు ఇస్తున్నాయి. ప్రస్తుత ర్యాలీకి వాల్యూంల మద్దతు కనిపించడంలేదు. అందువల్ల పైస్థాయిల్లో అమ్మకాలు వెల్లువెత్తవచ్చు. టెక్నికల్‌గా 11000 పాయింట్లు నిఫ్టీకి బలమైన నిరోధంగా పనిచేస్తుంది. ఈ స్థాయిపై సౌకర్యవంతంగా ముగిసేవరకు కొత్త లాంగ్స్‌ తీసుకోకుండా ఉండడం మంచిది. షార్ట్‌ పొజిషన్లకు ఈ స్థాయిని స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలి. అంతర్జాతీయ అంశాలు కూడా ఈ వారం కీలక పాత్ర పోషిస్తాయి. దిగువన 10300- 10600 పాయింట్ల వద్ద మద్దతు దొరకవచ్చు. ఈ స్థాయిల్లో కొనుగోళ్లు కనిపిస్తాయి. ఆప్షన్‌ డేటా చూస్తే 11200, 11000 పాయింట్ల వద్ద కాల్స్‌ ఎక్కువగా ఉండగా, 10500, 10000 పాయింట్ల వద్ద పుట్స్‌ అధికంగా ఉన్నాయి. 
ఇన్వెస్టర్లు చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఎంపిక చేసిన రంగాల్లో స్టాకులను ఎంచుకోవడం ఉత్తమం. లేదంటే ఒక పతనం పూర్తయ్యేవరకు వేచిచూడడం ఇంకా మంచిది. 



You may be interested

సోమవారం వార్తల్లోని షేర్లు

Monday 31st December 2018

వివిధ వార్త‌ల‌కు అనుగుణంగా సోమ‌వారం ప్రభావిత‌మ‌య్యే షేర్ల వివ‌రాలు ఇవి:- రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్‌:-  త‌న అనుబంధ సంస్థ రిల‌య‌న్స్ ఇండస్ట్రీయ‌ల్ ఇన్వెస్ట్‌మెంట్స్ అండ్ హోల్డింగ్ లిమిటెడ్(ఆర్ఐఐహెచ్ఎల్‌) రూ.75 కోట్ల‌కు మించకుండా ఈక్విటీ వాటాల కొనుగోలుకు పున‌రుత్పాద‌క కంపెనీ కనోడా ఎన‌ర్జీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్(కేఈఎస్ఎల్‌) కంపెనీతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది.  ఈ ఒప్పందం త‌ర్వాత కేఈఎస్ఎల్‌లో 88శాతం వాటా ఆర్ఐఐహెచ్ఎల్ సొంతమవుతుంది. కేడిలా హెల్త్‌కేర్‌:- మెటిమెల నివార‌ణ చికిత్సలో వినియోగించే క్లైండమిసిన్ ఫాస్ఫేట్, బెంజోయిల్

ఎఫ్‌పీఐలపై కోటక్‌ నివేదిక

Saturday 29th December 2018

నవంబర్‌ నెలలో వివిధ మార్కెట్లలోకి నిధుల ప్రవాహం ఇలా ఉంది... దేశీయంగా: చాలా నెలల తర్వాత భారత మార్కెట్లోకి ఎఫ్‌పీఐలు మరలా వచ్చాయి. నవంబర్‌లో లిస్టెడ్‌ ఫండ్స్‌లోకి 46.3 కోట్ల డాలర్లు, జీఈఎం ఫండ్స్‌లోకి 52.9 కోట్ల డాలర్లు వచ్చాయి.  వర్ధమాన దేశాల్లోకి: భారత్‌తో పాటు చైనా, సౌత్‌కొరియా మార్కెట్లలో విదేశీ నిధులు రాగా, రష్యా మార్కెట్లో నుంచి విదేశీ ఇన్వెస్టర్లు 10.6 కోట్ల డాలర్లను ఉపసంహరించుకున్నారు.  మరిన్ని వివరాలకు కింద ఇచ్చిన పీడీఎఫ్‌

Most from this category