STOCKS

News


ట్యారిఫ్‌లు తగ్గిస్తామని ప్రకటించిన చైనా

Monday 5th November 2018
Markets_main1541397172.png-21711

- స్వేచ్ఛా వాణిజ్యాన్ని మరింత వేగంగా పెంపొందిస్తున్నామని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌ వ్యాఖ్య.

షాంఘై: దిగుమతి సుంకాలను తగ్గిస్తామని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌ సోమవారం ఉదయం ప్రకటించారు. స్వేచ్ఛా వాణిజ్యాన్ని పెంపొందించడం ద్వారా తమ దేశంలో ప్రపంచ శ్రేణి వ్యాపార వాతావరణాన్ని నెలకొల్పనున్నట్లు ఇక్కడ జరిగిన చైనా ఇంటర్నేషనల్‌ ఇంపోర్ట్‌ ఎక్స్‌పో ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వెల్లడించారు. విస్తృత స్థాయి మార్కెట్‌ ప్రవేశం కోసం తాము ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉంటున్నామని వారం రోజులు పాటు జరిగే ఈ కార్యక్రమంలో ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగా కస్టమ్స్ క్లియరెన్స్ విధానాలను సులభతరం చేయడం, మేధోసంపత్తి హక్కుల ఉల్లంఘనలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించడం వంటి నిర్ణయాలను వేగవంతంగా అమలుచేయనున్నట్లు చెప్పారు. విద్య, టెలికమ్యూనికేషన్స్, సాంస్కృతిక రంగాలకు మరింత ప్రోత్సాహం అందించనున్నట్లు తెలిపారు. ఇతర దేశాలతో చైనా స్వేచ్ఛా వాణిజ్యాన్ని కోరుకుంటుందనే విషయానికి ఈ కార్యక్రమయం ఒక చక్కటి ఉదాహరణగా ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికే 250 బిలియన్‌ డాలర్ల విలువైన చైనా ఉత్పత్తులపై అమెరికా ట్యారిఫ్‌ విధించగా.. 110 బిలియన్‌ డాలర్ల విలువైన అమెరికా ఉత్పత్తులపై చైనా ట్యారిఫ్‌లు విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదిరి.. ఈ అంశం ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థలను కుదిపేస్తున్న సమయంలో తాజా జిన్ పింగ్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ను ఉద్ధేశించి ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. ‘వారి సొంత సమస్యలను కప్పిపుచ్చుకోవడం కోసం ఇతరును ఏలెత్తి చూపడం మంచికాదు. చేతిలో ఫ్లాష్‌లైట్‌ పట్టుకుని ఇతరుల బలహీనతలపై ఫోకస్‌ చేస్తూ... వారి బలహీనతలను దాచివేసే ప్రయత్నం చేస్తున్నారు.’ అని వ్యాఖ్యానించారు.



You may be interested

ప్రభుత్వరంగ బ్యాంకు షేర్ల ర్యాలీ

Monday 5th November 2018

మార్కెట్‌ నష్టాల ట్రేడింగ్‌లోనూ సోమవారం ప్రభుత్వరంగ బ్యాంకు(పీఎస్‌బీ) షేర్లు ర్యాలీ చేస్తున్నాయి. నేడు ఇండెక్స్‌ 2,930.05 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ప్రభుత్వ రంగ బ్యాంకులకు రెండో విడుత మూలధన సాయం కింద రూ.54వేల కోట్లు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైందనే వార్త వెలువడిన నేపథ్యంలో ఈ రంగ షేర్లు ర్యాలీ చేశాయి. ఇండెక్స్‌ ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లోనే 2శాతం లాభపడి 2,983.20 ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఉదయం గం.11:00లకు ఇండెక్స్‌ గత

స్థిరంగా పసిడి ధర

Monday 5th November 2018

డాలర్‌ స్థిరమైన ర్యాలీతో పసిడి ధర సోమవారం స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఆసియా ట్రేడింగ్‌లో భారత వర్తమానకాలం ప్రకారం ఉదయం గం.10.20లకు ఔన్స్‌ పసిడి ధర 0.50డాలర్‌(అరడాలరు)స్వల్ప లాభంతో 1,233.70 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా సెనెట్‌లో ఉన్న 100 స్థానాల్లో 35 స్థానాలకు అమెరికా ప్రతినిధుల సభలోని మొత్తం 435 స్థానాలకు రేపు (మంగళవారం) మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వేచిచూసే ధోరణి అవలంభిస్తున్న కారణంగా

Most from this category