STOCKS

News


హువావే సీఎఫ్‌ఓ అరెస్ట్‌తో మార్కెట్లకు షాక్‌

Thursday 6th December 2018
Markets_main1544074612.png-22681

చైనాకు చెందిన మొబైల్ దిగ్గజ సంస్థ హువావే చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌ఓ) మెంగ్ వాంగ్‌జోను కెనడా అధికారులు వాంకోవర్‌లో అరెస్టు చేశారు. ఇరాన్‌పై అమెరికా విధించిన వాణిజ్యపరమైన నిబంధలను ఉల్లంఘించారనే ఆరోపణలతో ఈమెను వాంకోవర్‌లో అరెస్ట్‌ చేసినట్లు కెనడియన్ జస్టిస్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి ఇయాన్ మెక్లాయిడ్ వెల్లడించారు. 2016 నుంచి యూఎస్‌ చట్టాలను ఉల్లంగిస్తూ పలు షిప్పింగ్స్‌ చేశారనే ఆరోపణల నేపథ్యంలో హువావే వ్యవస్థాపకుడు రెన్ జెంగ్ఫేయ్‌ కుమార్తె మెంగ్‌ వాంగ్‌జోను డిసెంబరు ఒకటిన అరెస్ట్‌ చేసినట్లు వెల్లడించిన ఆయన ఇంతకుమించి అదనంగా ఎటువంటి సమాచారాన్ని అందించలేమని అన్నారు. తదుపరి విచారణ నిమిత్తం ఈమెను అమెరికాకు పంపించే అవకాశం ఉందని తెలిపారు. తమ సీఎఫ్‌ఓ అరెస్టయ్యారని ట్విట్టర్‌ ద్వారా వెల్లడించిన ఆ సంస్థ యాజమాన్యం.. చట్టపరమైన అన్ని నిబంధనలను తాము   విధిగా పాటించినట్లు ట్విట్‌ చేసింది. ఇదే తరహాలో ఇంతకుముందు చెనాకు చెందిన జెడ్‌టీఈ కార్ప్‌ అధికారులు, హాంగ్ కాంగ్‌కు చెందిన స్కైకామ్ టెక్ కో లిమిటెడ్ అధికారులు కూడా అరెస్ట్‌ అయ్యారు. చైనా అధికారుల అరెస్టుల పర్వం కొనసాగుతున్న నేపథ్యంలో బుధవారం అంతర్జాతీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. బుధవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లకు సెలవు కాగా, గురువారం ఉదయం ఆసియా మార్కెట్‌లో ఎస్‌ అండ్‌ పీ 500 ఈ-మినీ ఫ్యూచర్స్‌ దాదాపు 2 శాతం నష్టపోయాయి. సోమవారం అర్జెంటీనా రాజధాని బ్యూనస్‌ ఎయిర్స్‌లో జరిగిన జీ–20 సదస్సు సందర్భంగా అమెరికా, చైనాల మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందం వెనక రాజకీయ కుట్రలు ఏమైనా ఉండి ఉంటాయా అనే అనుమానాలకు తావిస్తూ అరెస్టులు కొనసాగుతుండడంతో ఇటు జపాన్‌ నికాయ్‌ సైతం 0.8 శాతం పతనమైంది. సౌత్‌ కొరియా సూచీ 0.6 శాతం, ఆస్ట్రేలియా 0.2 శాతం తగ్గాయి. కరెన్సీ మార్కెట్‌లో యెన్‌తో డాలర్‌ విలువ 0.1 శాతం నష్టపోయింది. భారత మార్కెట్లలో నిఫ్టీ గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమైంది.You may be interested

వ్యాపారులందరికీ పాన్‌ తప్పనిసరి!

Thursday 6th December 2018

న్యూఢిల్లీ: ఇకపై వ్యాపారం చేసే ప్రతి ఒక్కరూ పాన్‌ (పర్మినెంట్‌ అకౌంట్‌ నెంబర్‌) తీసుకోవాల్సిందే. రోడ్డు పక్కన, మార్కెట్లలో, ఆఖరికి తోపుడు బండ్లపై వ్యాపారం చేసేవారు కూడా ఇక పాన్‌ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇకపై ఏడాదికి రూ.2.5 లక్షలకు మించి వ్యాపారం చేసే వారంతా పాన్‌ తప్పనిసరిగా తీసుకోవాలంటూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు నోటిఫికేషన్‌ జారీ చేసిది. వార్షికంగా రూ.2.5 లక్షలంటే... నెలకు దాదాపు రూ.20వేలు. అంటే

సేవల రంగం జోరు..

Thursday 6th December 2018

న్యూఢిల్లీ: కొత్త వర్క్ ఆర్డర్లు, సానుకూల మార్కెట్ పరిస్థితుల ఊతంతో నవంబర్‌లో సేవల రంగం వృద్ధి వేగం పుంజుకుంది. నాలుగు నెలల గరిష్ట స్థాయికి చేరింది. నికాయ్ ఇండియా సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ సూచీ నవంబర్‌లో 53.7 పాయింట్లుగా నమోదైంది. దీంతో వరుసగా ఆరో నెల కూడా వృద్ధి నమోదైనట్లయింది. అక్టోబర్‌లో ఇది 52.2 పాయింట్లుగా ఉంది. పర్చేజింగ్ మేనేజర్స్ సూచీ (పీఎంఐ) ప్రమాణాల ప్రకారం సూచీ 50 పాయింట్ల

Most from this category