STOCKS

News


వచ్చే 15-21 సెషన్ల కోసం 10 సిఫార్సులు

Monday 12th November 2018
Markets_main1542016479.png-21906

ముంబై: దేశీ స్టాక్‌ సూచీలు సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైనప్పటికీ.. క్రమంగా నష్టపోతూ 10 గంటల 30 నిమిషాల సమయానికి నష్టాల్లోకి చేరుకున్నాయి. 129 పాయింట్ల లాభంతో 35,287 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్‌.. మధ్యాహ్నం సమయానికి అర శాతం నష్టాల్లో కొనసాగుతోంది. ఇంట్రాడేలో 35,000 మార్కును కోల్పోయింది. శుక్రవారం ముగింపుతో పోల్చితే 23 పాయింట్ల లాభంతో 10,608 వద్ద ట్రేటింగ్‌ ప్రారంభించిన నిఫ్టీ ఈ సమయానికి 40 పాయింట్ల మేర నష్టపోయి 10,532 పాయింట్లకు పడిపోయింది. ఈ నేపథ్యంలో నిఫ్టీకి బలమైన మద్దతు స్థాయి 10,500 వద్ద ఉండగా.. ఈ స్థాయిని కోల్పోతే బేర్స్‌ బలం పుంజుకుంటారని చార్ట్‌వ్యూ ఇండియా డాట్‌ ఇన్‌ టెక్నికల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రేడింగ్‌ అడ్వైజరీ చీఫ్‌ స్ట్రాటజిస్‌ మజర్‌ మహ్మద్‌ విశ్లేషించారు. కీలక నిరోధస్థాయి 10,710 పాయింట్ల వద్ద ఉన్నట్లు సూచించారు. ప్రస్తుత మార్కెట్‌ నిర్దేశిత దిశలో కాకుండా, ఒక దిశా అనేది లేకుండా ప్రయాణిస్తున్నందున ట్రేడర్లు స్టాక్‌ స్పెసిఫిక్‌గా ఉండడం మంచిదన్నారు. ఇరు వైపులా అవకాశాలను చూడడం మంచిదని సూచించారు. మార్కెట్‌కు దిశ వచ్చేవరకు ఇదే స్ట్రాటజీని పాటించడం బెటరని విశ్లేషించారు. వచ్చే 15-21 సెషన్ల కోసం 3 షేర్లను ఈయన సిఫార్సు చేశారు. మజర్‌ మహ్మద్‌తో పాటు మరికొంత మంది టెక్నికల్‌ అనలిస్టులు సిఫార్సుచేసిన షేర్ల జాబితా, వాటి టెక్నికల్‌ అంశాలు ఈ విధంగా ఉన్నాయి..

అనలిస్ట్‌:- మిలన్‌ వైష్ణవ్, టెక్నికల్‌ అనలిస్ట్, జెమ్‌స్టోన్‌ ఈక్విటీ రీసెర్చ్‌

లార్సన్‌ అండ్‌ టూబ్రో (ఎల్‌ అండ్‌ టీ) | సిఫార్సు: కొనొచ్చు | టార్గెట్ ధర: రూ.1,500 | స్టాప్ లాస్‌: రూ.1,295
ఈఏడాదిలో ఇప్పటివరకు ఈ షేరు దీర్ఘచతురస్రాకార నిర్మాణంలోనే కొనసాగింది. అయితే, నిఫ్టీ ఇన్‌ఫ్రా ఇండెక్స్‌తో పోల్చితే ఈ షేరు ఆర్‌ఎస్‌ లైన్‌ పైకి పెరుగుతున్న ఛానల్‌లో ఉండడమే కాకుండా ఈ నిర్మాణం నుంచి బ్రేకవుట్‌ సాధించింది. ప్రైస్‌ ఆసిలేటర్ పాజిటీవ్‌ మారడం, ఆర్‌ఎస్‌ 50-రోజుల సగటు కదలికల ఎగువన ఉండడం, వీక్లీ ఆర్‌ఎస్‌ఐ సైతం పాట్రన్‌ నుంచి బయటపడడం ఆధారంగా ఈ షేరును సిఫార్సు చేసినట్లు వెల్లడించారు. 

జామ్నా ఆటో | సిఫార్సు: కొనొచ్చు | టార్గెట్ ధర: రూ.92 | స్టాప్ లాస్‌: రూ.69
రూ.102 వద్ద నుంచి ఒక్కసారిగా భారీ పతనాన్ని చూసిన ఈ షేరు 50-రోజుల సగటు కదలికల దిగువకు పడిపోయినప్పటికీ.. రూ.67-72 వద్ద బేస్‌ను నిర్మించుకుంటున్నట్లు చార్టులు సూచిస్తున్నాయన్నారు. సీఎన్‌ఎక్స్‌500తో పోల్చితే ఆర్‌ఎస్‌ లైన్‌ మళ్లీ పెరిగి 50-రోజుల సగటు కదలికల ఎగువనకు చేరుకోవడం ఆధారంగా పెరుగుదల నమోదయ్యే అవకాశాన్ని వెల్లడిస్తున్నయని వివరించారు. పీపీఓ పాజిటీవ్‌గా మారుతోందని, ఎంఏసీడీ సైతం వచ్చే కొద్ది రోజుల్లో పాజిటీవ్‌గా మారనుందన్నారు. 

అనలిస్ట్‌:- చార్ట్‌వ్యూ ఇండియా డాట్‌ ఇన్‌ టెక్నికల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రేడింగ్‌ అడ్వైజరీ చీఫ్‌ స్ట్రాటజిస్‌ మజర్‌ మహ్మద్‌

స్టార్ పేపర్ | సిఫార్సు: కొనొచ్చు | టార్గెట్ ధర: రూ.210 | స్టాప్ లాస్‌: రూ.174
ఈ షేరు 100-రోజుల సగటు కదలికల ఎగువన బ్రేకవుట్‌ సాధించింది. ఇంతకుముందు కీలక నిరోధంగా ఉన్నటువంటి ఈస్థాయికి ఎగువన ముగిసిన నేపథ్యంలో షేరును కొనుగోలుచేయవచ్చని సూచించారు. పొజిషనల్‌ ట్రేడర్లు రూ.210 స్థాయి వరకు షేర్లను కొనుగోలు చేయవచ్చని సూచించిన ఆయన కచ్చితంగా రూ.174 వద్ద (ముగింపు ఆధారంగా) స్టాప్‌ లాస్‌ నిర్వహించాలని హెచ్చరించారు. 

ఆంధ్ర సుగర్స్ | సిఫార్సు: కొనొచ్చు | టార్గెట్ ధర: 447 | స్టాప్ లాస్‌: రూ.360
పుల్‌బ్యాక్‌ దశలో నూతన స్వింగ్‌ హైతో రూ.360 స్థాయిలో బేస్‌ను ఏర్పాటుచేసుకున్నట్లు కనిపిస్తోంది. ఇక్కడ నుంచి రూ.447 వరకు వెళ్లేందుకు అవకాశం ఉంది. పొజిషనల్‌ ట్రేడర్లు కచ్చితంగా రూ.360 వద్ద (ముగింపు ఆధారంగా) స్టాప్‌ లాస్‌ నిర్వహిస్తూ షేరును కొనుగోలుచేయవచ్చన్నారు. 

పవర్ గ్రిడ్ | సిఫార్సు: కొనొచ్చు | టార్గెట్ ధర: రూ.203 | స్టాప్ లాస్‌: రూ.184
రూ.185-192 స్థాయిలో కన్సాలిడేషన్‌ను పూర్తిచేసిన ఈ షేరు.. అధిక వాల్యూమ్స్‌తో బ్రేకవుట్‌ సాధించేందుకు సిద్ధంగా ఉంది. బ్రేకవుట్‌ తరువాత రూ.203 వద్దకు చేరుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం రూ.187 వద్ద ఉన్న ఈ షేరును పొజిషనల్‌ ట్రేడర్లు కచ్చితంగా రూ.184 వద్ద (ముగింపు ఆధారంగా) స్టాప్‌ లాస్‌ నిర్వహిస్తూ వచ్చే 15-21 సెషన్ల కోసం కొనుగోలుచేయవచ్చని సూచించారు.

అనలిస్ట్‌:- ఆనంద్‌ ఠక్కర్‌, ఈక్విటీ రీసెర్చ్‌ అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, ఆనంద్‌ రాఠీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌

అరబిందో ఫార్మా | సిఫార్సు: కొనొచ్చు | టార్గెట్ ధర: రూ.855 | స్టాప్ లాస్‌: రూ.797
వీక్లీ ట్రేడ్‌లైన్‌ రెసిస్టెన్స్‌ నుంచి బయటపడింది. వేవ్‌ 5 పైకి ప్రారంభమైన నేపథ్యంలో కనీసం రూ.855 వద్దకు చేరుకునే అవకాశం ఉందని అంచనావేశారు. ఇక్కడ నుంచి పడిపోతే రూ.797 వరకు చేరుకోవచ్చని.. ఈ స్థాయినే స్టాప్‌ లాస్‌గా నిర్వహిస్తూ, వచ్చే 15-21 సెషన్ల టార్గెట్‌తో షేరును కొనుగోలుచేయవచ్చని సూచించారు.

ఎవర్‌రెడీ ఇండస్ట్రీస్ | సిఫార్సు: కొనొచ్చు | టార్గెట్ ధర: రూ.220 | స్టాప్ లాస్‌: రూ.185
ఫాలింగ్‌ వెడ్జ్‌ పాట్రన్‌ నుంచి బ్రేకవుట్‌ సాధించిన ఈ షేరు.. ఫైవ్‌ వేవ్‌ పతన నిర్మాణాన్ని కూడా పూర్తిచేసినట్లు చార్జులు సూచిస్తున్నాయన్నారు. డైలీ చార్టులో ఎంఏసీడీ ఇండికేటర్‌ సానుకూలంగా ఉందన్నారు. వీక్లీ చార్టులో సైతం పాజిటీవ్‌ సంకేతం ఇస్తున్న ఈ షేరు.. పూర్తి పతనంలో నుంచి 38.2 శాతం వరకు రీట్రేస్‌మెంట్‌ను అంచనావేస్తున్నట్లు వెల్లడించారు. 

హెక్సావేర్‌ | సిఫార్సు: కొనొచ్చు | టార్గెట్ ధర: రూ.347.70 | స్టాప్ లాస్‌: రూ.308
డైలీ చార్టులో మల్టీ బోటమ్స్‌ను ఏర్పాటుచేసింది. షేరు పూర్తి పతనంలో 38.2 శాతం వరకు రీట్రేస్‌మెంట్‌ను అంచనావేస్తున్నట్లు వెల్లడించారు. దిగువస్థాయిలో రూ.308 అత్యంత కీలక మద్దతు స్థాయిగా ఉందన్నారు.

అనలిస్ట్‌:- కునాల్ పారార్, టెక్నికల్‌ డెస్క్‌ సీనియర్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌, చాయిస్‌ బ్రోకింగ్‌

మారుతీ సుజుకి | సిఫార్సు: కొనొచ్చు | టార్గెట్ ధర: రూ.7,670 | స్టాప్ లాస్‌: రూ.7,080
అవర్లీ చార్ట్‌ ప్రకారం.. ఇన్వర్స్‌ హెడ్‌ అండ్‌ షోల్డర్‌ అంచునకు చేరుకుంది. ఇక్కడ నుంచి బ్రేకవుట్‌ సాధిస్తే అప్‌మూవ్‌నకు ఆస్కారం ఉంది. డైలీ మూవ్‌మెంటమ్‌ ఇండికేటర్‌ ఆర్‌ఎస్‌ఐ సైతం పాజిటీవ్‌గా ఉన్నందున ఈ షేరును రూ.7,670 టార్గెట్‌తో కొనుగోలుచేయవచ్చని కునాల్‌ సూచించారు. రూ.7,080 వద్ద స్టాప్‌ లాస్‌ నిర్వహించాలని అన్నారు. 

ఫినోలెక్స్‌ కేబుల్స్ | సిఫార్సు: కొనొచ్చు | టార్గెట్ ధర: రూ.560 | స్టాప్ లాస్‌: రూ.510
ఈ షేరు 21-రోజుల సగటు కదలికల ఎగువనకు చేరుకుంది. ఇదే సమయంలో పరిమిత స్థాయి శ్రేణి నుంచి అత్యధిక వాల్యూమ్స్‌తో బయటపడిందని వివరించారు.

ఇవి కేవలం టెక్నికల్‌ అనలిస్టుల అభిప్రాయాలు మాత్రమే. ఇన్వెస్టర్లు తమ సొంత అధ్యయనం తరువాత మాత్రమే తుది నిర్ణయం తీసుకోవడం మంచిదని సాక్షీబిజినెస్‌డాట్‌కామ్‌ సూచన.


 You may be interested

‘ఆటో’ ట్రబుల్‌

Monday 12th November 2018

ఆటో రంగ షేర్లు సోమవారం పతనమయ్యాయి. నిఫ్టీ ఆటో ఇండెక్స్‌ 2 శాతానిపైగా పడిపోయింది. 9,047 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఒక్క భారత్‌ఫోర్జ్‌ మినహా ఆటో ఇండెక్స్‌లోని షేర్లన్నీ నష్టపోయాయి. టాటా మోటార్స్‌ భారీగా పతనమైంది. షేరు ధర దాదాపు 5 శాతంమేన నష్టపోయింది. దీని తర్వాత టాటా మోటార్స్‌ డీవీఆర్‌, హీరో మోటొకార్ప్‌ షేర్లు 4 శాతానికిపైగా పడిపోయాయి. ఇక మదర్‌సన్‌ సుమి, అపోలో టైర్స్‌ స్టాక్స్‌ 3

రూపీ @ 73

Monday 12th November 2018

గాడిలో పడిందనుకుంటున్న సమయంలో రూపాయి మళ్లీ పతనమైంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే 73 మార్క్‌ దిగువకు పడిపోయింది. 54 పైసలు క్షీణతతో 73.04 స్థాయికి బలహీనపడింది. క్రూడ్‌ ధరల పెరుగుదల నేపథ్యంలో దిగుమతిదారుల నుంచి డాలర్‌కు డిమాండ్‌ పెరగడం ప్రతికూల ప్రభావం చూపింది. ఇంటర్నేషనల్‌ బెంచ్‌మార్క్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 2.04 శాతం పెరుగుదలతో 71.61 డాలర్లకు చేరింది. దిగుమతిదారుల నుంచి డాలర్‌కు డిమాండ్‌ పెరగడం మాత్రమే కాకుండా,

Most from this category