STOCKS

News


డిసెంబరు నాటికి 11,500 పాయింట్లకు నిఫ్టీ..!

Saturday 14th July 2018
Markets_main1531545463.png-18311

ముంబై: నిఫ్టీ 10,900 స్థాయి ఎగువన కొనసాగుతున్నంతకాలం.. 11,171 పాయింట్లను అధిగమించే అవకాశం ఉందనే ఆశావాద ధోరణిలో ఉండవచ్చని చార్ట్‌వ్యూ ఇండియా డాట్‌ ఇన్‌ టెక్నికల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రేడింగ్‌ అడ్వైజరీ చీఫ్‌ స్ట్రాటజిస్‌ మజర్‌ మహమద్‌ అన్నారు. ఈ ఏడాది డిసెంబరు నాటికి కీలక స్థాయిని అధిగమించడమే కాకుండా 11,500 పాయింట్లకు చేరుతుందని టార్గెట్‌ ఇచ్చారు. ప్రస్తుత స్థాయి నుంచి జీవితకాల గరిష్టస్థాయికి చేరుకోవడానికి కేవలం 2 శాతం దూరంలోనే నిఫ్టీ 50 ఉందన్న ఆయన సెన్సెక్స్‌ ఇప్పటికే నూతన గరిష్టస్థాయిని తాకిన నేపథ్యంలో ఈ సూచీకి సైతం ఎక్కువ సమయం ఏమీ పట్టకపోవచ్చని భావిస్తున్నట్లు తెలిపారు. టెక్నికల్‌గా చెప్పాలంటే.. చార్ట్‌ ప్యాట్రన్స్‌ చాలా పాజిటివ్‌గా ఉన్నాయన్నారు. ఎనిమిది వారాల కన్సాలిడేషన్‌.. అంతకుముందు ఆరు నెలల దిద్దుబాటు దశ తరువాత ఇంతటి బలమైన సానుకూలత నమోదయ్యిందన్నారు. గడిచిన రెండు ట్రేడింగ్‌ సెషన్ల ప్రైస్‌ యాక్షన్‌ ఆధారంగా చూస్తే తాజా బ్రేకవుట్‌ తరువాత నిఫ్టీ విరామ దశలో ఉన్నట్లు వెల్లడవుతుందని తెలిపారు. డైలీ చార్టుల పరంగా 10,976 దిగువన ముగిసినప్పుడే బలహీనత ఉన్నట్లు తెలియజేశారు. 10,860 దిగువన ముగిస్తే తాజా బ్రేకవుట్‌ విఫలమయ్యి మరోసారి మార్కెట్‌ బేర్స్‌కు అనుకూలంగా మారుతుందన్నారు. అయితే, వీక్లీ చార్టుల ఆధారంగా మాత్రం బ్రేకవుట్‌ చాలా స్పష్టంగా ఉందని, బుల్‌ క్యాండిల్‌ను ఏర్పాటుచేసిందని అన్నారు. ఇది కన్సాలిడేషన్‌ బ్రేకవుట్‌లా ఉందన్న ఆయన విరామ దశ ముగియగానే మళ్లీ ర్యాలీ కొనసాగిస్తుందని విశ్లేషించారు. తాజా బ్రేకవుట్‌ తరువాత మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు సైతం స్థిరత్వాన్ని పొందనున్నట్లు తెలిపిన ఆయన నిఫ్టీ 9,531 స్థాయి వద్ద ఉన్నంత వరకు ఈ రంగాల సూచీలపై ఒత్తిడి ఉందన్నారు. డాలరుతో రూపాయి మారకం విలువ విషయానికి వస్తే.. 2013 నుంచి ఇప్పటివరకు 69 స్థాయిని నాలుగు సార్లు తాకిందని, ఇందుచేత ఇదే స్థాయిని బలమైన మద్ధతుగా భావించవచ్చని అన్నారు. ఈ స్థాయి వద్ద నిలవలేకపోతే 71.50 వద్దకు బలహీనపడే అవకాశం ఉందన్నారు. 4-7 శాతం వరకు రాబడిని ఇవ్వగలిగిన 3 షేర్లను సిఫార్సుచేశారు. అవేంటంటే..

బ్రిటానియా ఇండస్ట్రీస్ లిమిటెడ్ | ప్రస్తుత ధర రూ.6,472 | టార్గెట్ ధర రూ.6750 | స్టాప్ లాస్‌ రూ.6300 | రాబడి అంచనా 4 శాతం

మైండ్‌ట్రీ లిమిటెడ్ | ప్రస్తుత ధర రూ.1,065 | టార్గెట్ ధర రూ.1,126 | స్టాప్ లాస్‌ రూ.1017 | రాబడి అంచనా 5.7 శాతం

ఇండియన్ ఆయిల్ | ప్రస్తుత ధర రూ.159.30 | టార్గెట్ ధర రూ.170 | స్టాప్ లాస్‌ రూ.154 | రాబడి అంచనా 7 శాతం



You may be interested

ఈ ఏడాది బెస్ట్‌ స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌ ఇవే..

Saturday 14th July 2018

మొత్తం షేర్ల ప్రస్తుత ధర ఆధారంగా కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ నిర్ణయమౌతుంది. ఈక్విటీ పోర్ట్‌ఫోలియో కోసం చూసేటప్పుడు కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ కూడా చూడాలి. స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌.. మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ పరంగా 251 ర్యాంక్‌ నుంచి మొదలయ్యే కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేస్తాయి. ఇలాంటి ఫండ్స్‌ తన మొత్తం అసెట్స్‌లో 65 శాతం వరకు స్మాల్‌క్యాప్‌ కంపెనీల ఈక్విటీ, ఈక్విటీ సంబంధిత సాధనాల్లో పెట్టుబడిగా పెడతాయి. ఎవరైతే ఎక్కువ రిస్క్‌ తీసుకోవడానికి

ఏయూస్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులో వాటా విక్రయం

Saturday 14th July 2018

ముంబై:- నాన్‌-బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ ఏయూస్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులో ఇంటర్‌నేషనల్‌ ఫైనాన్స్‌ కార్పోరేషన్‌ వాటాను విక్రయించింది. ఓపెన్‌ మార్కెట్‌ లావాదేవీల ద్వారా 1.2శాతానికి సమానమైన 32లక్షల ఈక్విటీ షేర్లను విక్రయించినట్లు శుక్రవారం బీఎస్‌ఈ డాటా తెలిపింది. ఈ లావాదేవీ మొత్తం విలువ రూ.201.6 కోట్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికం చివరికి ఐఎఫ్‌సీ సంస్థకు ఏయూస్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులో 7.95శాతం వాటాను కలిగి ఉంది. ఇప్పుడు ఈ

Most from this category