STOCKS

News


ఎంఎస్‌సీఐ స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌లో మరో 13 భారత కంపెనీలు

Wednesday 14th November 2018
Markets_main1542190340.png-22002

ఎంఎస్‌సీఐ గ్లోబల్‌ స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లో తాజాగా 13 దేశీ కంపెనీలకు స్థానం దక్కింది. ఫైనాన్షియల్‌ విభాగంలో ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, భార‌త్ ఫైనాన్షియ‌ల్ ఇంక్లూజ‌న్, ఈక్విటాస్ హోల్డింగ్స్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్,  పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు చోటుదక్కింది. వీటితో పాటు అదానీ ట్రాన్స్‌మిషన్స్‌, ఫ్యూచర్ కన్స్యూమర్, లెమన్ ట్రీ హోటల్స్, మెర్క్, స్కెఫ్లర్‌ ఇండియా, సస్‌టెక్‌ రియాల్టీ, టాటా కెమికల్స్, వెస్ట్ లైఫ్ డెవలప్‌మెంట్‌ ఉన్నాయి. 

తొలగించిన జాబితా
మొత్తం 37 భారత కంపెనీలను ఇండెక్స్‌ నుంచి తొలగించినట్లు వెల్లడైంది. వీటిలో ఆల్‌కార్గో, బీఈఎంఎల్‌, బొంబే డైయింగ్, ఎవర్‌రెడీ ఇండస్ట్రీస్, ఫోర్స్ మోటార్స్, హెచ్‌సీసీ, ఇన్ఫిబీమ్, జెట్ ఎయిర్‌వేస్, జేకే టైర్, మహీంద్ర హాలిడేస్, మన్‌పసాండ్ బ్రూవరేజస్, యునికేమ్ లాబోరేటరీస్ పేర్లు ఉన్నాయి. 

జాబితాలో నూతనంగా చేరిన ఫైనాన్షియ‌ల్ రంగ షేర్లు మంగళవారం ట్రేడింగ్‌లో 1-8 శాతం మేర లాభాలను నమోదుచేశాయి.



You may be interested

టాటామోటర్స్‌....మూడీస్‌ నెగిటివ్‌ రేటింగ్‌

Wednesday 14th November 2018

ప్రముఖ రేటింగ్‌ మూడీస్‌ ఇన్వెస్టర్‌ సర్వీసెస్‌ సంస్థ టాటామోటర్స్‌ షేరుపై రేటింగ్‌ అవుట్‌లుక్‌ను ‘‘స్థిరత్వం’’ నుంచి ‘‘ప్రతికూలం’’కు మార్చింది. టాటా మోటర్స్‌ బ్రిటన్‌ అనుబంధ సంస్థ జాగ్వర్‌ లాండ్‌ రోవర్‌(జేఎల్‌ఆర్‌) నిర్వహణ ప్రదర్శన అంచనాలకు మించి తక్కువగా నమోదు చేసింది రేటింగ్‌ తగ్గిస్తున్నట్టు మూడీస్‌ తెలిపింది. పెరుగుతున్న ఇన్‌పుట్‌ వ్యయాలు, ఇంధన ధరలు జేఎల్‌ఆర్‌ కంపెనీ పరపతి సామర్థ్యం బలహీనంగా ఉండటం, ఇటీవల మరోసారి తెరపైకి వచ్చిన యూరోపియన్‌ కూటమి

రాబడికి 10 సిఫార్సులు..!

Wednesday 14th November 2018

12,000 పాయింట్లకు నిఫ్టీ..! సాధారణ ఎన్నికలు సమీస్తున్నందున రానున్నకాలం స్టాక్‌ మార్కెట్‌కు అత్యంత కీలంగా ఉందని విశ్లేషించిన రెలిగేర్‌ బ్రోకింగ్‌ ప్రెసిడెంట్‌ జయంత్‌ మాంగ్లిక్‌.. మార్కెట్‌ పడిపోయినప్పుడల్లా అత్యంత నాణ్యమైన షేర్లను కొనుగోలుచేయడం ద్వారా వచ్చే ఏడాదికాలంలో మంచి రాబడిని పొందవచ్చని సూచించారు. నిఫ్టీ 11,760 పాయింట్ల జీవితకాల గరిష్టస్థాయిని తాకిన తరువాత ఇప్పటి వరకు 10 శాతం పడిపోగా.. ఈ సూచీ కీలక మద్దతు స్థాయి 10,000 పాయింట్ల వద్ద

Most from this category