STOCKS

News


జనవరి 29న చాలెట్‌ హోటల్స్‌ ఐపీఓ

Saturday 26th January 2019
Markets_main1548500428.png-23825

కే.రహేజా గ్రూప్‌కు చెందిన చాలెట్‌ హోటల్స్‌ ఐపీఓ జనవరి 29న ప్రారంభం కానుంది. ఇదే నెల 30న ముగిసే ఈ ఐపీఓ ద్వారా రూ.1640 కోట్లు సమీకరించాలన్నది యోచన. ఐపీఓ ధర శ్రేణి రూ.275- రూ.280గా ఉంది. ఇష్యూలో భాగంగా కంపెనీ 950 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. ప్రమోటర్‌ గ్రూప్‌  రూ.609 కోట్ల విలువైన 2.46 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించనుంది. ఇష్యూ కోసం కనీసం 53 షేర్ల(ఒక లాట్‌)కు దరఖాస్తు చేసుకోవాలి. సమీకరించిన మూల ధన నిధుల్లో కొంత రుణ చెల్లింపులకు మరింతకొంత సాదారణ వ్యాపార అవసరాల నిమిత్తం వినియోగిసున్నట్లు కంపెనీ తెలిపింది. జేఎం ఫైనాన్షియల్‌ లిమిటెడ్‌, యాక్సిస్‌ క్యాపిటల్‌ లిమిటెడ్‌, మోర్గాన్‌ స్టాన్లీ ఇండియా కంపెనీ ఐపీఓకు లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరించనున్నారు. ఐపీఓ ప్రక్రియ అనంతరం షేర్లను బీఎస్‌, ఎన్ఎస్‌ఈ ఎక్చే‍్సంజ్‌ల్లో లిస్ట్‌ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. మార్చి 2018 నాటికి కంపెనీ టర్నోవర్ రూ.930 కోట్లుగా, ఇబిటా రూ.350 కోట్లుగానూ నమోదైంది. 2018 నాటికి సంస్థ రుణభారం రూ.2653 కోట్లుగా ఉంది.You may be interested

బడ్జెట్‌ రోజు ఈ తాయిలాలు?!

Sunday 27th January 2019

మరో నాలుగు రోజుల్లో బడ్జెట్‌ కేటాయింపులు పార్లమెంటు ముందుకు రానున్నాయి. లోక్‌సభ ఎన్నికల ముందు ప్రవేశపెట్టే చివరి బడ్జెట్‌ (ఓటాన్‌ అకౌంట్‌) కావడంతో ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పలు వర్గాలను ఆకర్షించేందుకు కొన్ని ప్రకటనలు చేయవచ్చని ఎక్కువ మంది విశ్లేషకులు అంచనాలతో ఉన్నారు. త్వరలో జరిగే ఎన్నికల్లో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్‌డీఏ అతిపెద్ద కూటమిగా అవతరిస్తుందని తాజా సర్వేలు పేర్కొన్నా, 2014తో పోలిస్తే సీట్ల సంఖ్య తగ్గుతుందని తేల్చాయి.

అమెరికా షట్‌డౌన్‌కు తాత్కలిక ముగింపు

Saturday 26th January 2019

అమెరికా చరిత్రలోనే సుదీర్ఘకాలం పాటు కొనసాగుతున్న ప్రభుత్వ ‘షట్‌డౌన్‌’కు శుక్రవారం తాత్కలిక ముగింపు పడింది. ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వ కార్యకలాపాలను తాత్కలికంగా ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. 35 రోజుల పాటు సాగిన ప్రభుత్వ ‘షట్‌డౌన్‌’పై అటు పార్టీ, ప్రభుత్వ, దేశ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ట్రంప్‌ 3వారాల వరకు ప్రభుత్వ కార్యకలాపాలు కొనసాగుతాయని తాజాగా వెల్లడించారు. వచ్చే నెల 15వరకు ప్రభుత్వ కార్యక్రమాలకు అవసరమైన నిధులను విడుదల

Most from this category