STOCKS

News


సీఈఎస్‌ఈ 20శాతం క్రాష్‌

Tuesday 30th October 2018
Markets_main1540885196.png-21585

ఆర్పీ సంజీవ్‌ గోయెంకా గ్రూప్‌నకు చెందిన సీఈఎస్‌సీ లిమిటెడ్‌ షేరు మంగళవారం 26శాతం నష్టపోయింది. విద్యుత్‌యేతర బిజినెస్‌లను ప్రత్యేక కంపెనీలుగా విడదీయడం ఇందుకు కారణమైంది. నేడు సీఈఎస్‌సీ లిమిటెడ్‌ షేరు బీఎస్‌ఈలో రూ.670.15ల వద్ద ప్రారంభమైంది. గతేడాదిలో సీఈఎస్‌సీ యాజమాన్యం విద్యుతేతర వ్యాపారాలను న్యూ రిటైల్‌, వెంచర్‌ కంపెనీలు విడదీసేందుకు నిర్ణయించింది. దీనిలో భాగంగా సీఈఎస్‌సీ వాటాదారులకు తమ దగ్గరున్న ప్రతీ 10 షేర్లకుగాను రూ. 5 ముఖ విలువగల 6 రిటైల్‌ షేర్లు జారీ చేయనుంది. ప్రత్యేక కంపెనీల షేర్ల జారీకి అక్టోబర్‌ 31 రికార్డ్‌డేట్‌గా నిర్ణయించారు. ఈ మేరకు నేడు విద్యుతేతర బిజినెస్‌లను రెండు ప్రత్యేక కంపెనీలుగా విడదీసిన నేపథ్యంలో ఇంట్రాడేలో 26శాతం నష్టపోయి రూ.643.05ల వద్దకు పతనమైంది. మధ్యాహ్నం గం.12:30ని.లకు షేరు గత ముగింపు(రూ.864.07)ధరతో పోలిస్తే 19.29శాతం నష్టంతో రూ.697.90ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.643.05 రూ.1188.95లుగా ఉన్నాయి.



You may be interested

డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ దూకుడు

Tuesday 30th October 2018

ప్రముఖ హౌసింగ్‌ ఫైనాన్స్‌ సంస్థ డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ షేరు మంగళవారం 16శాతం లాభపడింది. నేడు ఈ షేరు బీఎస్‌ఈలో రూ. 186.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. లిక్విడిటీ కొరత కారణంగా ఇటీవల భారీగా పతనంతో ఈ షేరు కొనుగోలు ధర ఆకర్షణీయంగా ఉండటంతో ఇన్వెస్టర్లు షేరు కొనుగోలుకు మొగ్గచూపారు. ఫలితంగా ఇంట్రాడేలో 16శాతం ర్యాలీ చేసి రూ.214.30 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. మధ్యాహ్నాం గం.1:20ని.లకు షేరు గత ముగింపు

రెండోరోజూ అదే జోరు ..!

Tuesday 30th October 2018

క్రితం రోజు మార్కెట్‌ భారీ లాభాలకు కారణమైన ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ షేర్లు రెండో రోజూ అదే జోరును కనబరుస్తున్నాయి. ఈ ప్రభుత్వ బ్యాంక్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహిస్తున్న నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ మంగళవారం ట్రేడింగ్‌లో 5శాతం లాభపడింది. గత ట్రేడింగ్‌లో ఇండెక్స్‌ 8శాతం లాభపడిన సంగతి తెలిసిందే. ఉదయం గం.12:00లకు ఇండెక్స్‌ గత ముగింపు(2,778.40)తో పోలిస్తే 4శాతం లాభంతో 2,892.35ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి

Most from this category