STOCKS

News


ఈ రెండు స్టాక్స్‌ కొనొచ్చు: సెంట్రమ్‌

Friday 10th August 2018
Markets_main1533889816.png-19122

సెం‍ట్రమ్‌.. బజాజ్‌ ఆటో, హిందుస్తాన్‌ జింక్‌ స్టాక్స్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. వీటిని ఒకసారి పరిశీలిస్తే..

స్టాక్‌: బజాజా ఆటో
ఇండస్ట్రీ: ఆటోమొబైల్‌
రేటింగ్‌: కొనొచ్చు
ప్రస్తుత ధర: రూ.2,656
టార్గెట్‌ ప్రైస్‌: రూ.3,188
సెంట్రమ్‌.. బజాజ్‌ ఆటోపై బై రేటింగ్‌ను కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. కంపెనీ మార్కెట్‌ వాటాపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించిందని తెలిపింది. మార్కెట్‌లో 20 శాతానికి పైగా వాటాను సొంతం చేసుకునే దాకా పలు ప్రొడక్టులను తక్కువ ధరకే కస్టమర్లకు అందుబాటులో ఉంచుతామని పేర్కొంది. దీని వల్ల కంపెనీ మార్జిన్లపై ఒత్తిడి నెలకొంటుందని సెంట్రమ్‌ తెలిపింది. ధరల వ్యూహాం, దేశీ టూవీలర్‌ విభాగంలో బలమైన అమ్మకాలు, ఎగమతుల రివకరీ అంశాలు కారణంగా రానున్న రెండేళ్లలో రెండంకెల వృద్ధి సాధిస్తామని బజాజ్‌ ఆటో పేర్కొంది. విక్రయాల్లో వృద్ధి ఉన్నప్పటికీ ప్రస్తుత క్యూ1 ఫలితాలు తమ అంచనాలను అందుకోలేదని, మార్జిన్లు తక్కువగానే ఉన్నాయని సెంట్రమ్‌ తెలిపింది. భవిష్యత్‌ వృద్ధి అవకాశాలు బాగున్నాయని పేర్కొంది. టూవీలర్‌ విభాగంలో తీవ్రమైన ధరల పోటీ ప్రతికూల అంశమని తెలిపింది. 

స్టాక్‌: హిందుస్తాన్‌ జింక్‌
ఇండస్ట్రీ: మెటల్‌
రేటింగ్‌: కొనొచ్చు
ప్రస్తుత ధర: రూ.285
టార్గెట్‌ ప్రైస్‌: రూ.310
తాము హిందుస్తాన్‌ జింక్‌ రేటింగ్‌ను హోల్డ్‌ నుంచి బైకి అప్‌గ్రేడ్‌ చేస్తున్నట్లు సెంట్రమ్‌ పేర్కొంది. కంపెనీ ఫండమెంటల్స్‌ బలంగా ఉన్నాయని, ఉత్పత్తి పెంపునకు ప్రణాళికలు రూపొందిస్తోందని తెలిపింది. జింక్‌ ధరల్లోని ఇటీవల కరెక‌్షన్‌ చోటుచేసుకుందని, అయితే రానున్న కాలంలో అంతర్జాతీయ వాణిజ్య పరిస్థితుల వల్ల వీటిల్లో మళ్లీ పెరుగదుల ఉంటుందని పేర్కొంది. ఓపెన్‌ కాస్ట్‌ మైనింగ్‌ నిలిపివేత వల్ల ఉత్పిత్తి తగ్గిందని తెలిపింది. ఈబీటా కూడా అంచనాలకు దిగువునే ఉందని పేర్కొంది. అయితే భవిష్యత్‌ వృద్ధి అవకాశాలు సానుకూలముగా ఉన్నాయని తెలిపింది. జింక్‌ ప్రైసింగ్‌ ఫండమెంటల్స్‌ బలంగా ఉన్నాయని పేర్కొంది. ఆకర్షణీయ డివిడెంట్‌ చెల్లింపులు, క్యాష్‌ ఫ్లో ఎక్కువగా ఉండటం, మెటల్‌ సరఫరా తగ్గడం వంటి అంశాలు కారణంగా స్టాక్‌కు బై రేటింగ్‌ ఇచ్చామని తెలిపింది.  

బజాజ్‌ ఆటో, హిందుస్తాన్‌ జింక్‌ కంపెనీల వివరాలు, పనితీరు వంటి ఇతరత్రా సమాచారం కోసం ఈ కింది లింక్‌లపై క్లిక్‌ చేయండి...

View Pdf One (1533889836Bajaj Auto - Q1FY19 Result Update - Centrum 23072018.pdf)
View Pdf Two (255049429Hindustan Zinc - Q1FY19 Result Update - Centrum 23072018.pdf)

You may be interested

ఎస్‌బీఐ నష్టాలు @ రూ.4,876 కోట్లు

Friday 10th August 2018

ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్‌ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) తాజాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసిక (ఏప్రిల్‌-జూన్‌, క్యూ1) ఆర్థిక ఫలితాలను వెల్లడించింది. బ్యాంక్‌ రూ.4,876 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. ఇక నికర వడ్డీ ఆదాయం రూ.21,798 కోట్లుగా నమోదయ్యింది. స్థూల ఎన్‌పీఏలు 10.69 శాతంగా, నికర ఎన్‌పీఏలు 5.29 శాతంగా ఉన్నాయి. గత త్రైమాసికంలో స్థూల ఎన్‌పీఏలు 10.91 శాతంగా , నికర

పన్నెండు వేల పాయింట్లు పక్కా!

Friday 10th August 2018

వర్ధమాన మార్కెట్లలో భారత్‌ బెస్ట్‌ మార్కెట్‌ నిపుణుడు అతుల్‌ సూరి దేశీయ మార్కెట్లు మార్చి కనిష్ఠాల నుంచి కోలుకొని ఆల్‌టైమ్‌ హైని తాకాయి. ఈ నేపథ్యంలో గత రెండు మూడునెలల్లో వర్ధమాన మార్కెట్లలో ఇండియా ఈక్విటీ మార్కెట్లే బెస్ట్‌ అని ప్రముఖ మార్కెట్‌ నిపుణుడు, మారథాన్‌ ట్రెండ్స్‌ సీఈఓ అతుల్‌ సూరీ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం యూఎస్‌ మార్కెట్లు తమ ఆల్‌టైమ్‌ హైని చేరలేక అవస్థపడుతున్నాయని, ఎంఎస్‌సీఐ వర్ధమాన మార్కెట్‌ సూచీ తన జీవిత

Most from this category