STOCKS

News


సెంట్రల్‌ బ్యాంక్‌కు రూ.200 కోట్లు

Saturday 29th December 2018
Markets_main1546056698.png-23304

- ఈసాప్స్‌ ద్వారా సమీకరణ
- ఆమోదం తెలిపిన డైరెక్టర్ల బోర్డ్‌

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూ.200 కోట్లు సమీకరించనున్నది. ఎంప్లాయీ స్టాక్‌ పర్చేజింగ్‌ స్కీమ్‌లో (ఈఎస్‌పీఎస్‌) భాగంగా ఉద్యోగులకు షేర్లు జారీ చేయటం ద్వారా ఈ నిధులు సమీకరిస్తామని సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తెలిపింది. ఈ మేరకు గురువారం జరిగిన డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలిపిందని బ్యాంక్‌ వెల్లడించింది. దీనికి వాటాదారుల ఆమోదం పొందడం కోసం అసాధారణ సమావేశాన్ని ఎప్పుడు నిర్వహించాలి? షేర్ల ధర ఎంత ఉండాలి ? ఎంత డిస్కౌంట్‌ ఇవ్వాలి తదితర వివరాలను త్వరలోనే డైరెక్టర్ల కమిటీ నిర్ణయిస్తుందని పేర్కొంది.
 ఈ బాటలోనే పలు పీఎస్‌బీలు..
ఎంప్లాయీ స్టాక్‌ పర్చేజింగ్‌ స్కీమ్‌ ద్వారా పలు ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు నిధులు సమీకరిస్తున్నాయి. ఈ స్కీమ్‌ ద్వారా రూ.500 కోట్లు​ సమీకరించనున్నామని ఇటీవలే సిండికేట్‌ బ్యాంక్‌ తెలిపింది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ఇప్పటికే రూ.500 కోట్లు సమీకరించింది. అలహాబాద్‌ బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌, యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కెనరా బ్యాంక్‌లు ఈ స్కీమ్‌ను ఉపయోగించుకున్నాయి. కాగా రూ.200 కోట్ల నిధుల సమీకరణ వార్తల నేపథ్యంలో బీఎస్‌ఈలో సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 1 శాతం వరకూ లాభపడి రూ.36.05 వద్ద ముగిసింది.



You may be interested

ఉక్కు సుంకంపై అమెరికాతో చర్చలు

Saturday 29th December 2018

న్యూఢిల్లీ: అమెరికా ప్రభుత్వం ఉక్కు దిగుమతులపై విధిస్తున్న భారీ సుంకాలను తగ్గించాలని.. అక్కడి అధికారును భారత ప్రభుత్వం కోరింది. ఉక్కు ఎగుమతి సంస్థల ప్రయోజనాల దృష్యా అమెరికా ప్రభుత్వ అధికారులతో శుక్రవారం చర్చలు జరిపినట్లు కేంద్ర ఉక్కు కార్యదర్శి బినోయ్ కుమార్ తెలిపారు. సెయిల్‌ నిర్వహించిన ఒక సమావేశంలో ఈ అంశాన్ని వెల్లడించిన ఆయన.. ‘ఉక్కు దిగుమతులపై సుంకాలు తగ్గించాలని అమెరికా అధికారులను అడిగాం. భారత స్టీల్‌ పరిశ్రమ చాలా

పీవీఆర్‌ రూ.750 కోట్ల సమీకరణ

Saturday 29th December 2018

-త్వరలో క్యూఐబీలకు షేర్ల జారీ - వాటాదారుల ఆమోదం కోరిన కంపెనీ న్యూఢిల్లీ: మల్టీప్లెక్స్‌ థియేటర్‌ చెయిన్‌ను నిర్వహిస్తున్న పీవీఆర్‌ సంస్థ రూ.750 కోట్లు సమీకరించనుంది. క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ బయ్యర్లకు (క్యూఐబీ) షేర్లు జారీ చేయటం ద్వారా ఈ నిధులు సమీకరించనున్నామని పీవీఆర్‌ తెలిపింది. ఈ మేరకు తమ డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలిపిందని, ఈ ప్రతిపాదనకు వాటాదారుల ఆమోదం కోరుతున్నామని వివరించింది. ఈ నెల 31 నుంచి వచ్చే నెల 29

Most from this category