STOCKS

News


సిమెంట్‌ షేర్ల ర్యాలీ

Tuesday 7th August 2018
Markets_main1533631711.png-19015

ముంబై:- సిమెంట్‌ షేర్లు మంగళవారం లాభాల బాట పట్టాయి. గత కొద్ది రోజులుగా స్తబ్ధుగా కొనసాగుతున్న సిమెంట్‌ షేర్లలో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసికంలో పలు సిమెంట్‌ కంపెనీల లాభాలు పుంజుకోవడంతో పాటు రానున్న రోజుల్లో నిర్మాణ రంగం మరింత వేగంగా వృద్ధి చెందుతుందనే అంచానాలతో ఇంట్రాడే లో పలు సిమెంట్‌ షేర్ల ర్యాలీ జోరుగా సాగుతోంది.
అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌:- నేడు బీఎస్‌ఈలో  రూ. 4177.05ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 2 శాతం లాభపడి రూ.4225ల స్థాయికి తాకింది. మధ్యాహ్నం గం.1:30లకు షేరు గత ముగింపు ధర(రూ.4177.05)తో పోలిస్తే 1.17 శాతం లాభంతో రూ.4226.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.
అంబుజా సిమెంట్స్‌:-  నేడు రూ.229.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 2 శాతం లాభపడి రూ.233.00ల స్థాయికి తాకింది. మధ్యాహ్నం 1:30లకు షేరు గత ముగింపు ధర(రూ.228.15)తో పోలిస్తే 1.40 శాతం లాభంతో రూ.231.35ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.
ఇండియా సిమెంట్స్‌:-  నేడు బీఎస్‌ఈలో రూ. 118.45 ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 5.55 శాతం లాభపడి రూ.124.40ల స్థాయికి తాకింది. మధ్యాహ్నం గం.1:30లకు షేరు గత ముగింపు ధర(రూ.117.85)తో పోలిస్తే 3.61 శాతం లాభంతో రూ.122.10ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.You may be interested

ఏఎంసీలపై బుల్లిష్‌

Tuesday 7th August 2018

ఐఐఎఫ్‌ఎల్‌ చైర్మన్‌ నిర్మల్‌ జైన్‌ వచ్చే పదేళ్లలో దేశీయ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ పరిశ్రమ లక్ష కోట్ల డాలర్లను దాటేస్తుందని ఐఐఎఫ్‌ఎల్‌ వ్యవస్థాపకుడు నిర్మల్‌ జైన్‌ అభిప్రాయపడ్డారు. అమెరికా ఎంఎఫ్‌ పరిశ్రమ విలువ 30 ఏళ్ల క్రితం 20000 కోట్ల డాలర్లని, ఇప్పుడు దాని విలువ 16 లక్షల కోట్ల డాలర్లని చెప్పారు. దేశీయ ఎంఎఫ్‌ పరిశ్రమ ప్రస్తుత విలు 30వేల కోట్ల డాలర్లని, త్వరలో ఇది లక్ష కోట్ల డాలర్ల మైలురాయిని

తగ్గినపుడు కొనండి..

Tuesday 7th August 2018

నాణ్యమైన స్టాక్స్‌పై దేవెన్‌ చోక్సీ సిఫార్సు రానున్న రోజుల్లో కంపెనీల ఎర్నింగ్స్‌లో బలమైన రెండంకెల వృద్ధి నమోదు కావచ్చని అంచనా వేస్తున్నారు కేఆర్‌ చోక్సీ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌ ఎండీ దేవెన్‌ చోక్సీ. ఎలక్ట్రికల్‌ గూడ్స్‌ అండ్‌ ఎక్విప్‌మెంట్‌ వ్యాపారాల్లో మంచి పెరుగుదల నమోదవుతూ వస్తోందన్నారు. ఎన్‌బీఎఫ్‌సీ, ఇన్సూరెన్స్‌ కంపెనీలు కూడా మంచి వృద్ధి నమోదు చేస్తున్నాయని తెలిపారు. హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ నుంచి సాహేతుకంగా 10 శాతం రాబడులను అంచనా వేయవచ్చని పేర్కొన్నారు.

Most from this category