STOCKS

News


సిమెంట్‌ షేర్లకు డిమాండ్‌

Tuesday 19th March 2019
Markets_main1552983739.png-24691

స్వల్ప లాభాలతో ట్రేడ్‌ అవుతున్న మార్కెట్లో మంగళవారం సిమెంట్‌ షేర్లకు డిమాండ్‌ నెలకొంది. ఇటీవల మౌలిక సదుపాయాల రంగం జోరందుకోవడంతో మార్కెట్లో సిమెంట్‌ షేర్లకు డిమాండ్‌ కొనసాగుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అత్యధికంగా ఇండియా సిమెంట్‌ 4.50శాతం లాభపడింది. రైన్ ఇండస్ట్రీస్‌ 3.50శాతం, ప్రిజం సిమెంట్స్‌ 3శాతం లాభపడ్డాయి. జే.కే సిమెంట్స్‌, అంబుజా సిమెంట్స్‌ షేర్లు 2శాతం ర్యాలీ చేశాయి. అలాగే అల్ట్రాటెక్‌ సిమెంట్‌, గ్రాసీం, ఏసీసీ సిమెంట్స్‌ షేర్లు 1శాతం పెరిగాయి. మరోవైపు ఆంధ్రా సిమెంట్‌, పాణ్యం సిమెంట్‌, బరంపూర్‌ సిమెంట్‌ షేర్లు 3శాతం నుంచి 1శాతం నష్టపోయాయి. మ
ఇక మార్కెట్ల విషయానికొస్తే... 

మిడ్‌సెషన్‌ సమయానికి సూచీలు స్వల్ప లాభాలతో ట్రేడ్‌ అవుతున్నాయి. సెన్సె‍క్స్‌ 80 పాయింట్ల లాభంతో 38175.43 వద్ద, నిఫ్టీ 18 పాయింట్లు పెరిగి 11480.45 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లు అత్యధికంగా లాభపడుతున్నాయి. అలాగే ఫార్మా, మీడియా షేర్లలో కూడా ఓ మోస్తారుగా కొనుగోళ్లు జరుగుతున్నాయి. మరోవైపు అటో, ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. 



You may be interested

మిడ్‌క్యాప్స్‌లో మరో 30 శాతం ర్యాలీ!

Tuesday 19th March 2019

ఐసీఐసీఐ డైరెక్ట్‌ అంచనా ఫిబ్రవరి కనిష్ఠాల నుంచి ఇప్పటికి మిడ్‌క్యాప్‌ సూచీ దాదాపు 12 శాతం కోలుకుంది. అయితే ఈ పరుగులు ఇంకా కొనసాగుతాయని, మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ మరో 30 శాతం మేర ర్యాలీ జరిపే ఛాన్సులున్నాయని ఐసీఐసీఐ డైరెక్ట్‌ అంచనా వేసింది. గతంలో మిడ్‌క్యాప్స్‌లో వచ్చిన భారీ పతనాలు 14 నెలలకు పూర్తయ్యాయని, ఆ తర్వాత మిడ్‌క్యాప్‌ సూచీ దాదాపు 40 శాతం వరకు ర్యాలీ జరిపిన చరిత్ర ఉందని

ఆర్‌కామ్‌-ఆర్‌జియో ఒప్పందం రద్దు

Tuesday 19th March 2019

అనుమతులు రాకపోవడం వల్లే న్యూఢిల్లీ: అంబానీ సోదరులకు చెందిన టెలికం కంపెనీలు రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ (అనిల్‌ అంబానీ), రిలయన్స్‌ జియో (ముకేశ్‌ అంబానీ) టెలికం ఆస్తులకు సంబంధించి 15 నెలల క్రితం తాము చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్టు ప్రకటించాయి. ప్రభుత్వం, రుణదాతల నుంచి అనుమతుల్లో జాప్యాన్ని కారణంగా పేర్కొ‍న్నాయి. 15 నెలల కాంలో 45 సమావేశాలు జరిగిన తర్వాత కూడా ఆర్‌కామ్‌కు రుణాలు ఇచ్చిన దేశ విదేశీ బ్యాంకులు ఆర్‌కామ్‌,

Most from this category