STOCKS

News


సిమెంట్‌ రంగం.. క్యూ2 ఫలితాల ప్రివ్యూ..

Friday 12th October 2018
Markets_main1539330504.png-21088

సిమెంట్‌ రంగ కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (క్యూ2, జూలై-సెప్టెంబర్‌)లోనూ సందడి చేసే అవకాశాలు లేవని కోటక్‌ సెక్యూరిటీస్‌ తన నివేదికలో పేర్కొంది. వార్షికంగా విక్రయాల్లో 13 శాతం వృద్ధి నమోదైనప్పటికీ.. వ్యయాలు పెరుగుతుండటం, ధరల్లో చెప్పుకోదగ్గ పెరుగుదల లేకపోవడం వల్ల ప్రస్తుత క్వార్టర్‌లోనూ కంపెనీలు చెప్పుకోదగ్గ పనితీరు కనబర్చకపోవచ్చని అంచనా వేసింది. ఏసీసీ, అంబుజా వంటి కంపెనీల ఈబీటా వార్షికంగా 11 శాతం పెరగొచ్చని పేర్కొంది. దీని వ్యయాలు నియంత్రణ విధానాలు కారణమని తెలిపింది. స్థానిక కంపెనీల ఈబీటా వార్షికంగా 6 శాతం తగ్గొచ్చని పేర్కొంది. వ్యయాలు పెరుగుతుండటం, ధరల పెరుగుదల చెప్పుకునే విధంగా లేకపోవడం వంటివి ఎర్నింగ్స్‌ అంచనాలకు రిస్క్‌ అంశాలను తెలిపింది. 

కోటక్‌ సెక్యూరిటీస్‌ నివేదిక ప్రకారం..

♦ త్రైమాసికం పరంగా చూస్తే దేశం మొత్తంగా సిమెంట్‌ ధరలు 1 శాతం పెరిగాయి. ధరలు ఉత్తర, మధ్య భారత దేశంలో పెరిగితే.. దక్షిణ, పశ్చిమ భారత దేశంలో తగ్గాయి.

♦ అధిక పెట్‌-కోక్‌ ధరలు, అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి క్షీణించడం కారణంగా వ్యయాలు పెరగొచ్చు. 

♦ విక్రయాలు పెరగొచ్చనే అంచనాలున్నాయి.

♦ అధిక వ్యాల్యుయేషన్స్‌, వ్యయాల పెరుగుదల, ఎర్నింగ్స్‌ మోస్తారుగా ఉండొచ్చనే అంచనాల నేపథ్యంలో సిమెంట్‌ రంగ స్టాక్స్‌పై జాగ్రత్తగా ఉండాలి.



You may be interested

ఎన్‌బీఎఫ్‌సీ షేర్లను ఎలా డీల్‌ చేయాలి?

Friday 12th October 2018

నెల రోజులుగా ఎన్‌బీఎఫ్‌సీ రంగం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఈ రంగంలో పెట్టుబడులు పెట్టిన వాళ్లు ఇకపై ఏం చేయాలా? అని సంశయంలో పడిపోయారు. అయితే ఒక సారి ఈ రంగంలో చెలరేగిన తుఫాను చల్లబడ్డతర్వాత కమ్రంగా కోలుకుంటాయని నిపుణులు భావిస్తున్నారు. ముందుగా ఈ రంగాన్ని తీవ్రంగా వేధిస్తున్న లిక్విడిటీ సమస్యకు పరిష్కారం దొరికితే ఈ షేర్లు కోలుకుంటాయని చెబుతున్నారు. ఇప్పటికే ఈ రంగంలో పెట్టుబడులు పెట్టిన

సందడి చేస్తున్న అటో షేర్లు

Friday 12th October 2018

6శాతం లాభపడిన మహీంద్రా&మహీంద్రా ముంబై:- మార్కెట్‌ ర్యాలీ భాగంగా శుక్రవారం అటో షేర్లు సందడి చేస్తున్నాయి. అటో రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ అటో ఇండెక్స్‌ 4.50శాతం లాభపడింది. మహీంద్రా&మహీంద్రా, మారుతి కంపెనీ షేర్ల 6శాతం ర్యాలీ ఇండెక్స్‌ను ముందుండి నడిపించింది. మధ్యాహ్నం గం.12:25ని.లకు అటో ఇండెక్స్‌ గత ముగింపు (8739.50)తో పోలిస్తే 4.19శాతం లాభంతో 9,106.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఈ సూచీలో భాగమైన మొత్తం

Most from this category