STOCKS

News


ఐపీఓకు... ఆరు ప్రభుత్వ సంస్థలు

Saturday 29th December 2018
Markets_main1546053950.png-23296

  • ఆమోదం తెలిపిన సీసీఈఏ

 న్యూఢిల్లీ: ఆరు ప్రభుత్వ రంగ సంస్థలు త్వరలో ఐపీఓకు (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) రానున్నాయి. ఈ ఆరు పీఎస్‌యూలు ఐపీఓకు రావడానికి ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలిపినట్లు న్యాయ శాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ చెప్పారు. అంతే కాకుండా కుద్రేముఖ్‌ ఐరన్‌ ఓర్‌ కంపెనీ (కేఐఓసీఎల్‌) ఫాలో ఆన్‌ ఆఫర్‌కు (ఎఫ్‌పీఓ) కూడా సీసీఈఏ ఆమోదం తెలిపింది. ఈ ఆరు పీఎస్‌యూలను స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ చేయడం వల్ల వాటి విలువ పెరుగుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు.
ఐపీఓకు రానున్న ఆరు పీఎస్‌యూలు ఇవే...

  1. రైల్‌ టెల్‌ కార్పొరేషన్‌ ఇండియా
  2. టెలికమ్యూనికేషన్‌ కన్సల్టెంట్స్‌(ఇండియా) (టీసీఐఎల్‌)
  3. నేషనల్‌ సీడ్‌ కార్పొరేషన్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌ఎస్‌సీ)
  4. తెహ్రీ హైడ్రో డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (టీహెచ్‌డీసీఐఎల్‌,)
  5. వాటర్‌ అండ్‌ పవర్‌ కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (ఇండియా)
  6. ఎఫ్‌సీఐ ఆరావళి జిప్సమ్‌ అండ్‌ మినరల్స్‌(ఇండియా)(ఎఫ్‌ఏజీఎమ్‌ఐఎల్‌)



You may be interested

మొండిబండ 10లక్షల కోట్లు

Saturday 29th December 2018

 రూ.8.95 లక్షల కోట్ల మొండి బకాయిలు పీఎస్‌బీలవే - ఎన్‌పీఏల్ని గుర్తించటంలో పెరిగిన సమర్థత - ఎక్కువ మోసాలు ప్రభుత్వరంగ బ్యాంకుల్లోనే - రుణ పోర్ట్‌ఫోలియోలో మోసాలు ఆందోళనకరం - బ్యాంకింగ్‌ రంగ ధోరణులు, ప్రగతిపై ఆర్‌బీఐ నివేదిక ముంబై: ఆర్‌బీఐ ఆదేశాలతో దేశీయ బ్యాంకులు చేపట్టిన దిద్దుబాటు చర్యల ఫలితంగా... గడిచిన ఆర్థిక సంవత్సరం (2017-18)లో బ్యాంకింగ్‌ రంగంలోని స్థూల మొండి బకాయిలు (ఎన్‌పీఏ) ఏకంగా 11.2 శాతం... అంటే రూ.10.39 లక్షల కోట్లకు చేరాయి.

85 శాతం స్టాక్స్‌లో ఈ ఏడాది నష్టాలే

Friday 28th December 2018

నష్టాల సంవత్సరంగా 2018 స్థిరపడిపోతుంది. ఎందుకంటే 85 శాతం స్టాక్స్‌ ఈ ఏడాది ప్రతికూల రాబడులు (నష్టాలు) ఇచ్చాయని గణాంకాలు తెలియజేస్తున్నాయి. చురుగ్గా ట్రేడయ్యే 2,371 స్టాక్స్‌లో 2,011 స్టాక్స్‌ నష్టాలనే మిగిల్చాయి. కొన్నింటిలో నష్టాలు నామమాత్రంగా ఉంటే, కొన్నింటిలో మోస్తరు, కొన్నింటిలో భారీగాను ఉన్నాయి. 90 శాతం వరకూ పతనమైన మిడ్‌, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ పదుల సంఖ్యలో ఉన్నాయి.    గీతాంజలి జెమ్స్‌ ఇన్వెస్టర్లకు కన్నీరే మిగిలింది. నీరవ్‌మోదీ భారీ స్కామ్‌

Most from this category