STOCKS

News


క్యాష్‌ఫ్లో, లాభం... ఏది ముఖ్యం?

Tuesday 28th August 2018
Markets_main1535396688.png-19692

ఆపరేటింగ్‌ క్యాష్‌ఫ్లో (నిర్వహణలో భాగంగా వచ్చి పోయే నగదు ప్రవాహం/ఓసీఎఫ్‌) అనేది ఓ కంపెనీ ఏ విధంగా పనిచేస్తుందన్నది తెలుసుకునేందుకు ముఖ్యమైన పారామీటర్‌గా నిపుణులు చెబుతుంటారు. ఆదాయంలో ఎంత మేర నగదుగా మార్చగలుగుతుందో ఇది తెలియజేస్తోంది. నిజానికి చాలా మంది ఇన్వెస్టర్లు ఓ కంపెనీలో పెట్టుబడికి నికర లాభాన్నే ప్రమాణికంగా చూస్తుంటారు. ఓసీఎఫ్‌ అన్నది ఏడాదికోసారే ప్రకటించేది కాగా, నికర లాభం ప్రతీ త్రైమాసికానికి వెలువడేది. కనుక ఎక్కువ మంది ఇన్వెస్టర్ల దృష్టి దీనిపైనే ఉంటుంది. అయితే, నికర లాభం కంటే, ఆపరేటింగ్‌ క్యాష్‌ ఫ్లో ఓ వ్యాపారంలో కీలకమైనది. ఓ కంపెనీ రోజువారీ కార్యకలాపాలకు వీలుగా క్యాష్‌ఫ్లో అవసరం. కంపెనీ దీర్ఘకాలంలో విజయవంతంగా కొనసాగేందుకు గాను లాభాలను ఆర్జించాల్సి ఉంటుంది. అలాగే, సానుకూల నగదు ప్రవాహాలతో కొనసాగాల్సి ఉంటుంది. లాభాల్లోనే ఉన్నా పాజిటివ్‌ క్యాష్‌ ఫ్లో లేని కంపెనీ ఎక్కువ కాలం మనలేదన్నది నిపుణులు చెప్పే మాట. 

 

క్యాష్‌ఫ్లో అంటే...?
ఓ వ్యాపార నిర్వహణలో భాగంగా కంపెనీకి వచ్చే నగదు, కంపెనీ నుంచి వెళ్లే నగదును క్యాష్‌ ఫ్లో లేదా ఆపరేటింగ్‌ క్యాష్‌ఫ్లోగా పేర్కొంటారు. రోజువారీ కార్యకలాపాలు, పన్నులు, అవసరమైనవి కొనుగోలుకు... ఉద్యోగులకు చెల్లింపులు, నిర్వహణ ఖర్చులకు క్యాష్‌ఫ్లో కావాలి. ఓ కంపెనీ లిక్విడ్‌ అసెట్స్‌ పెరుగుదలను పాజిటివ్‌ క్యాష్‌ ఫ్లో తెలియజేస్తుంది. దీనివల్ల కంపెనీ రుణాలను తీర్చివేయగలదు. తన వ్యాపారంపై తిరిగి పెట్టుబడులు పెట్టగలదు. వాటాదారులకు రాబడులను ఇవ్వగలదు. ఖర్చులకు చెల్లింపులు చేయడంతోపాటు భవిష్యత్తులో ఎదురయ్యే ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేందుకు నిధుల్ని పక్కన పెట్టగలదు. నెగటివ్‌ క్యాష్‌ ఫ్లో అనేది... ఓ కంపెనీ లిక్విడ్‌ ఆస్తులు తగ్గిపోతున్నాయని సూచిస్తుంది. కార్యకలాపాల ద్వారా వచ్చే నగదు ప్రవాహం, పెట్టుబడులపై వచ్చే నగదు ప్రవాహం, రుణాల ద్వారా వచ్చే నగదు ప్రవాహాలు అంటూ క్యాష్‌ఫ్లోను వేర్వేరుగా చూస్తారు. 

 

నికర లాభం...?
ఓ కంపెనీ తన వ్యాపార కార్యకాలపాల ద్వారా వచ్చే ఆదాయం నుంచి అన్ని రకాల ఖర్చులు, చెల్లింపులు తీసివేయగా మిగిలేది. విశ్లేషకులు ప్రధానంగా మూడు రకాల లాభాలను చూస్తుంటారు. ఇందులో స్థూల లాభం, నిర్వహణ లాభం, నికర లాభం. ప్రతీ లాభం కూడా ఎన్నో అంశాలను తెలియజేస్తుంది. ఓ కంపెనీ పనితీరు అంటే గత కాలంలోని పనితీరుతో పోల్చుకునేందుకు, అదే రంగంలోని పోటీ కంపెనీలతో పోల్చుకునేందుకు ఇవి ఉపయోగపడతాయి. ఈ మూడు లాభాలు కూడా ఓ కంపెనీ ఫలితాల పట్టికలో ఉంటాయి.

 

ఏది కీలకం?
ఈ రెండింటిలో ఏది కీలకమన్నది తేల్చుకోవాలంటే కంపెనీ వ్యాపారం, పరిస్థితులను బట్టే ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ఓ కంపెనీ ప్రతీ నెలా లాభం గడిస్తూ ఉండి, ఆస్తులపై డబ్బులు ముడిపడి లేదా డబ్బులు రావాల్సి ఉండి, ఉద్యోగులకు చెల్లింపులకు నగదు లేని పరిస్థితులను ఎదుర్కొంటుంటే... ఒక్కసారి రుణాలు తీర్చివేసినా లేదా వ్యాపార కార్యకలాపాల ఆదాయం పెరిగినా తిరిగి పాజిటివ్‌ క్యాష్‌ ఫ్లోకు వెళ్లగలదు. ఈ ఉదాహరణలో క్యాష్‌ ఫ్లోనే కీలకంగా చూడాలి. ఎన్ని ఇబ్బందులున్నా కానీ లాభాలను కంపెనీ నమోదు చేస్తోంది. అలా కాకుండా ఓ కంపెనీ ఆదాయం, నగదు ప్రవాహాలు పెంచుకున్నప్పటికీ... భారీ ఎత్తున రుణాలను కలిగి ఉంటే అది లాభాలను నమోదు చేయకపోవచ్చు. ఇక్కడ లాభాన్ని చూడాల్సి ఉంటుంది. లాభం లేని పరిస్థితులతో కంపెనీ నగదు ప్రవాహాలకు సైతం సమస్య ఏర్పడొచ్చు. You may be interested

ఈ సమయంలో ఏ షేర్లను ఎంచుకోవాలి...?

Tuesday 28th August 2018

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ ఏడాది భిన్నమైన ర్యాలీలను చేస్తుండడం గమనించొచ్చు. ఏడాది ఆరంభంలో కరెక్షన్‌ను చవిచూసిన సూచీలు, ఆ తర్వాత నుంచి క్రమంగా రికవరీ బాట పట్టి జీవితకాల గరిష్టాలకు దూసుకెళ్లాయి. కానీ, తరచిచూస్తే ఈ ర్యాలీ మార్కెట్‌ వ్యాప్తంగా జరుగుతున్నది మాత్రం కాదు. ఎంపిక చేసిన షేర్లలోనే కొనుగోళ్లు జరుగుతూ, సాగిపోతున్న ర్యాలీ మాదిరిగా ఉంది. మరి ఈ సమయంలో ఏ షేర్లను ఎంచుకోవాలి? అన్న సందేహం

ఐపీవోకు హెల్మెట్‌ తయారీ కంపెనీ ‘స్టడ్స్‌’

Tuesday 28th August 2018

హెల్మెట్‌ తయారీలో ప్రముఖ కంపెనీ అయిన స్టడ్స్‌ యాక్సెసరీస్‌ నిధుల సమీకరణకు ఐపీవో బాట పడుతోంది. ఐపీవోకు సంబంధించిన ముసాయిదా పత్రాలను సెబీ వద్ద దాఖలు చేసింది. ప్రమోటర్లు తమ వాటాల నుంచి 39.39 లక్షల షేర్లను ఐపీవోలో ఆఫర్‌ చేస్తుండగా, దీనికితోడు రూ.98 కోట్ల విలువైన షేర్లను తాజా ఈక్విటీ జారీ ద్వారా ఆఫర్‌ చేస్తోంది. స్టడ్స్‌ యాక్సెసరీస్‌ కేవలం హెల్మెట్లే కాకుండా ద్విచక్ర వాహన యాక్సెసరీల తయారీలోనూ

Most from this category