మూలధన సాయం ప్రకటనతో ప్రభుత్వరంగ బ్యాంకు షేర్ల ర్యాలీ
By Sakshi

అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో మార్కెట్ మిడ్‌సెషన్ సమయానికి నష్టాల బాట పట్టింది. అయితే ఎన్ఎస్ఈలో ప్రభుత్వరంగ బ్యాంకు షేర్లకు ప్రాతినిథ్యం వహిస్తున్న నిఫ్టీ పీఎస్‌యూ ఇండెక్స్ మాత్రం 1శాతం ర్యాలీ చేసింది. వచ్చే ఏడాది మార్చి ఆఖరు నాటికి ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ.42వేల కోట్ల మూలధన సాయం అందిస్తామని కేంద్ర శాఖ ప్రకటన ఇందుకు కారణమైంది. మధ్యాహ్నం గం.12:20ని.లకు ఇండెక్స్ అరశాతం లాభంతో 2,954.70వద్ద ట్రేడ్ అవుతోంది. ఇదే సమయానికి ఈ సూచీలో భాగమైన 11 షేర్లన్నీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అత్యధికంగా యూనియన్ బ్యాంక్ 2.50శాతం ర్యాలీ చేసింది. ఓరియంటల్ బ్యాంక్ 1.50శాతం లాభపడింది. అలాగే సెంట్రల్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ షేర్లు 1శాతం పెరిగాయి. విజయా బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్బీఐ, పీఎన్బీ, ఐడీబీఐ బ్యాంక్ షేర్లు అరశాతం లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
మధ్యాహ్నం గం.12:20ని.లకు ప్రధాన సూచీలైన సెన్సెక్స్ 48.43 పాయింట్ల నష్టంతో 35,305.65 వద్ద, నిఫ్టీ 15 పాయింట్ల నష్టంతో 10,613 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
You may be interested
4నెలల కనిష్టానికి నిఫ్టీ మెటల్ ఇండెక్స్
Tuesday 27th November 201852-వారాల కనిష్టానికి జేఎస్పీఎల్, వేదాంత స్టీల్ షేర్లు మెటల్ షేర్ల పతనం మంగళవారం ట్రేడింగ్ సెషన్స్‌లోనూ కొనసాగుతుంది. ఎన్ఎస్ఈలో మెటల్ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్ ఇండెక్స్ నేటి ట్రేడింగ్ మరో 2.50శాతం నష్టపోయింది. నేడు నిఫ్టీ ఇండెక్స్ 3,157ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 2.50శాతం క్షీణించి 3,092శాతానికి పతనమైంది. ఇది నిఫ్టీ మెటల్ ఇండెక్స్‌కు 4నెలల కనిష్టస్థాయి. మధ్యాహ్నం గం.1:30ని.లకు ఇండెక్స్ గత ముగింపుతో పోలిస్తే 0.50శాతం
నవంబర్ సిరీస్‌లో 10,743 పాయింట్లకు నిఫ్టీ..!
Tuesday 27th November 2018ముంబై: మరో రెండు రోజుల్లో నవంబర్ ఎఫ్ అండ్ ఓ సిరీస్ ముగియనుండగా.. ఈ సిరిస్ క్లోజింగ్ సమయానికల్లా నిఫ్టీ 10,743 పాయింట్లకు చేరుకునే అవకాశం ఉందని డెరివేటీవ్ అనలిస్టులు భావిస్తున్నారు. 200-రోజుల సాధారణ సగటు కదిలికల స్థాయి ఇక్కడ ఉన్నందున సిరీస్ ముగిసే సమయానికి నిఫ్టీ ఈ స్థాయిని తిరిగి పరీక్షించే అవకాశం ఉందని అంచనావేస్తున్నారు. సోమవారం చోటుచేసుకున్న 139 పాయింట్ల రికవరీ వీరి అంచనాలకు మరింత బలంచేకూర్చింది.