STOCKS

News


బ్యాంకులకు మూలధనం.. ఒరిగేదేంలేదు!!

Friday 21st December 2018
Markets_main1545378606.png-23139

  • గ్లోబల్‌ బ్రోకరేజ్‌ సంస్థ సిటీ అంచనా

కేంద్ర ప్రభుత్వం వచ్చే కొన్ని నెలల్లో ప్రభుత్వ బ్యాంకులకు రూ.83,000 కోట్ల మూలధనాన్ని అందిచనుంది. ఈ నిధుల సంబంధిత బ్యాంకుల వృద్ధికి దోహదపడకపోవచ్చని గ్లోబల్‌ బ్రోకరేజ్‌ సంస్థ సిటీ పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం అందించే మూలధనం ప్రభుత్వ బ్యాంకుల వృద్ధికి సహాయపడకపోవచ్చు. కానీ అవి దివాలా తీయకుండా ఆప్పగలదని పేర్కొంది. అలాగే మూలధనం అందుకోవడం వల్ల కొన్ని బ్యాంకులు ఆర్‌బీఐ నిర్దేశిత సత్వర దిద్దుబాటు చర్యల (పీసీఏ) నిబంధనల నుంచి బయటకు రాగలవని తెలిపింది. కేంద్రం అందించే మూలధనంలో నిరర్ధక ఆస్తుల కేటాయింపులు పోను వృద్ధికి అవసరమైన నిధులు బ్యాంకుల వద్ద మిగలవని పేర్కొంది. అధిక ఎన్‌పీఏలు ఇందుకు కారణమని తెలిపింది. అయితే ఎస్‌బీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా బ్యాంకులు వృద్ధి చెందగలని పేర్కొంది.  
కాగా నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ శుక్రవారం ఫ్లాట్‌గానే ప్రారంభమైంది. అయితే తర్వాత కొంత నష్టపోయింది. ఇతర ఇండెక్స్‌లతో పోలిస్తే ఇదే అతితక్కువగా పడిపోయింది. సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా వంటి స్టాక్స్‌ ఇండెక్స్‌లో టాప్‌ గెయినర్లుగా ఉన్నాయి. ఇండియన్‌ బ్యాంక్‌, ఓరియెంటల్‌ బ్యాంక్‌ కామర్స్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కెనరా బ్యాంక్‌ వంటి షేర్లు టాప్‌ లూజర్లుగా ఉన్నాయి. సెంట్రల్‌ బ్యాంక్‌ ఏకంగా 2 శాతానికి పైగా ఎగసింది. 



You may be interested

6 నెలల్లో ఆకర్షణీయంగా బ్లూచిప్స్‌!!

Friday 21st December 2018

వచ్చే 3-6 నెలల కాలంలో బ్లూచిప్‌ కంపెనీల షేర్లు ఆకర్షణీయ వ్యాల్యుయేషన్స్‌తో ఉంటాయని అవెండస్‌ క్యాపిటల్‌ ఆల్టర్నేట్‌ సీఈవో ఆండ్రూ హోలండ్‌ తెలిపారు. వచ్చే ఆరు నెలల కాలంలో గ్రామీణ డిమాండ్‌ పుంజుకోవడం వల్ల కార్పొరేట్‌ ఎర్నింగ్స్‌ పెరుగుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. మిడ్‌ క్యాప్స్‌, స్మాల్‌ క్యాప్స్‌తో పోలిస్తే లార్జ్‌ క్యాప్స్‌ మంచి రాబడులు అందిస్తాయని పేర్కొన్నారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు

నెలలో 12% రాబడి అందించే 3 స్టాక్స్‌

Friday 21st December 2018

ఐఐఎఫ్‌ఎల్‌కు చెందిన సీనియర్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ హడ్రియన్‌ మెన్డోంకా తాజాగా వచ్చే నెల రోజుల్లో 12 శాతం దాకా రాబడిని అందించగల మూడు స్టాక్స్‌ను సిఫార్సు చేశారు. అవేంటో చూద్దాం..  డీసీబీ బ్యాంక్‌: గత ఆరు క్వార్టర్లుగా చూస్తే ఈ స్టాక్‌ డౌన్‌ ట్రెండ్‌లోనే ఉంది. అయితే వీక్లి చార్ట్‌లో తన ఇన్వర్స్‌ హెడ్‌ అండ్‌ షోల్డర్‌ ప్యాట్రన్‌ నుంచి బ్రేక్‌ ఔట్‌ అయ్యింది. అలాగే ఫాలింగ్‌ చానల్‌ ప్యాట్రన్‌ నుంచి

Most from this category