STOCKS

News


నిధుల ప్రవాహం సన్నగిల్లడమే అసలు సమస్య!

Wednesday 16th January 2019
Markets_main1547633896.png-23619

మార్కెట్‌పై మార్నింగ్‌స్టార్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అభిప్రాయం
దేశీయ మార్కెట్లలోకి వస్తున్న దేశీయ, విదేశీయ నిధుల ప్రవాహం సన్నగిల్లుతోందని, మార్కెట్‌ పరుగులకు ఇదే అడ్డంకిగా మారవచ్చని మార్నింగ్‌స్టార్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రతినిధి కౌస్తుభ్‌ చెప్పారు. మార్కెట్లోకి సిప్‌ ద్వారా వచ్చే మొత్తం మాత్రం పెరుగుతోందని, కానీ ఇందులో పెరుగుదల రేటు సన్నగిల్లిందని తెలిపారు. మార్కెట్లోకి సరాసరిన 8-9 వేల కోట్ల రూపాయల నిధులు వచ్చే స్థితి నుంచి రూ.6వేల కోట్లకు పడిపోయాయన్నారు. అందువల్ల మార్కెట్‌ ఊపు ఇక్కడనుంచి ఆగిపోవచ్చని అంచనా వేశారు. వచ్చే ఆరు నుంచి తొమ్మిది నెలల్లో మార్కెట్‌ ఎలా ప్రవర్తిస్తుందనేది కీలకమన్నారు. గతేడాది మిడ్‌క్యాప్స్‌లో చాలా స్వల్ప కొనుగోళ్లు జరిగాయని కౌస్తుభ్‌ చెప్పారు. మార్కెట్లో గతేడాది వచ్చిన పెట్టుబడుల్లో అధికశాతం(90 శాతం వరకు) లార్జ్‌క్యాప్స్‌ వైపు మరలాయని తెలిపారు. దీంతో పాటు ఎక్కువ మంది ఫండ్‌ మేనేజర్లు లార్జ్‌క్యాప్స్‌వైపు చూస్తున్నారని అందువల్ల వీటి హవా మరికొంత కాలం నడుస్తుందని చెప్పారు. ఈతరుణంలో కొంతమేర రక్షణాత్మక పెట్టుబడులను నమ్ముకోవడం మంచిదని సూచించారు. ప్రస్తుతం కన్జూమర్‌ గూడ్స్‌, హోటల్స్‌ రంగాల్లో కొనుగోళ్లకు మంచి అవకాశముందని తెలిపారు. ఫైనాన్షియల్స్‌ రంగంలో గత జోరు కనిపించకపోవచ్చని కేవలం ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ లాంటి షేర్లలో మాత్రం పాజిటివ్‌ కదలికలుండవచ్చని అభిప్రాయపడ్డారు. 



You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 30 పాయింట్లు అప్‌

Thursday 17th January 2019

 జపాన్‌ మినహా ఆసియా మార్కెట్లు గురువారం పాజిటివ్‌గా ట్రేడవుతున్న నేపథ్యంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 30 పాయింట్లు పెరిగింది. భారత్‌లో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానమై సింగపూర్‌లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.45 గంటలకు 10,952 పాయింట్ల వద్ద కదులుతోంది. క్రితం రోజు ఇక్కడ నిఫ్టీ ఫ్యూచర్‌ 10,922 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. కాగా స్పాట్‌ నిఫ్టీ 10,890 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఆసియా మార్కెట్లో జపాన్‌ సూచి

ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్‌

Wednesday 16th January 2019

అంతర్జాతీయంగా నెలకొన్న బలహీన పరిస్థితుల నేపథ్యంలో బుధవారం భారత మార్కెట్‌ ఫ్లాట్‌గా ముగిసింది. యూరోప్‌లో బ్రెగ్జిట్‌ ఆందోళనతో పాటు ఆసియా మార్కెట్ల మిశ్రమ ముగింపు, ఐరోపా మార్కెట్ల మిశ్రమ ప్రారంభం దేశీయ మార్కెట్‌పై ప్రభావాన్ని చూపాయి. ఫలితంగా ప్రధాన సూచీలైన సెన్సెక్స్‌, నిఫ్టీలు అక్కడక్కడే ముగిశాయి.  నిఫ్టీ 3.50 పాయింట్లు లాభపడి 10890.30 వద్ద, సెన్సెక్స్‌ 2.96 పాయింట్ల లాభపడి 36321.29 ముగిసింది. హెచ్‌డీఎఫ్‌ఎఫ్‌, ఐటీసీ, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌,

Most from this category