కలిసిరాని ఫలితాలు...కెనరా బ్యాంక్ 5 శాతం డౌన్
By Sakshi

ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తృతీయ త్రైమాసికం (క్యూ3)లో ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. అధిక వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) అండతో పాటు మెరుగైన ఆస్తుల నిర్వహణ కారణంగా ఈ క్యూ3లో బ్యాంక్ ఏకంగా నికరలాభాన్ని 152శాతం పెంచుకుంది. గతేడాది ఇదే క్యూ3లో నికరలాభం రూ.125 కోట్లను నమోదు చేయగా, ఈ క్యూ3లో రూ.317.52 కోట్లను సాధించింది. నికర వడ్డీ ఆదాయం రూ.3184 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే క్యూ3లో ఆర్జించిన రూ.3679 కోట్లతో పోలిస్తే ఇది 4శాతం అధికం. త్రైమాసిక ప్రాతిపదికన బ్యాంకు స్థూల నిరర్థక ఆస్తులు 10.56 శాతం నుంచి 10.25శాతానికి తగ్గాయి. నికర నిరర్థక ఆస్తులు సైతం 6.54శాతం నుంచి 6.37శాతానికి పరిమితమయ్యాయి. ప్రోవిజన్లు క్వార్టర్ టు క్వార్టర్ మాత్రం రూ.2,403 కోట్ల నుంచి రూ.2,733 కోట్లకు ఎగిశాయి.
5శాతం పతనమైన షేరు
క్యూ3లో ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలు ప్రకటించినప్పటికి షేరు మాత్రం నష్టాల బాట పట్టింది. నేడు బీఎస్ఈ ట్రేడింగ్‌లో షేరు రూ.254.55ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో ఫలితాల ప్రకటన అనంతరం షేరు అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. ఈ నేపథ్యంలో షేరు 5శాతం పతమైన రూ. 240.20 ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.2:00లకు షేరు గత ముగింపు ధర(రూ.253.55)తో పోలిస్తే 4శాతం నష్టంతో రూ.243.50ల వద్ద ట్రేడ్ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ. 240.20 రూ.261.90లుగా ఉన్నాయి.
You may be interested
10700 దిగువన నిఫ్టీ ముగింపు
Monday 28th January 2019ఇన్వెస్టర్ల అప్రమత్తతతో సోమవారం మార్కెట్ భారీ నష్టంతో ముగిసింది. నిఫ్టీ 10700 మార్కును కోల్పోగా, సెన్సెక్స్ 35700 పాయింట్ల స్థాయిని వదులుకుంది. ఐటీ, మీడియా రంగ షేర్లలో తప్ప మిగిలిన అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్ 369 పాయింట్ల కోల్పోయి 35,656 వద్ద, నిఫ్టీ 119 పాయింట్ల నష్టపోయి 10,661.55 వద్ద ముగిసింది. బ్యాంకింగ్ షేర్ల భారీ పతనం కారణంగా బ్యాంకు నిప్టీ ఇండెక్స్ 462 పాయింట్ల నష్టపోయి
సెన్సెక్స్ 400 పాయింట్లు, నిఫ్టీ 130 పాయింట్లు క్రాష్
Monday 28th January 2019సోమవారం పాజిటివ్‌గా ప్రారంభమై కొద్ది నిముషాల్లోనే నష్టాలకు జారుకున్న మార్కెట్లో మధ్యాహ్న సమయానికి అమ్మకాలు తీవ్రతరమయ్యాయి. దాంతో 1.40 గంటలకు బీఎస్ఈ సెన్సెక్స్ 400 పాయింట్లకుపైగా పతనమై 35,605 పాయింట్ల వద్దకు పడిపోయింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 130 పాయింట్లకుపైగా క్షీణించి 10,650 పాయింట్ల దిగువకు జారిపోయింది. మరో నాలుగురోజుల్లో జనవరి ఫ్యూచర్ కాంట్రాక్టులు ముగియనున్న నేపథ్యంలో బుల్స్ వారి లాంగ్ పొజిషన్లను పెద్ద ఎత్తున ఆఫ్లోడ్చేస్తున్న కారణఃగా ఈ పతనం సంభవించినట్లు