STOCKS

News


అన్ని కాలాల్లోనూ పనితీరులో భేష్‌!

Monday 31st December 2018
Markets_main1546231402.png-23323

  • అన్ని కాలాల్లోనూ పనితీరులో భేష్‌!
  • రిలయన్స్‌ లార్జ్‌క్యాప్‌ ఫండ్‌

దీర్ఘకాలం కోసం ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేయాలనుకునే వారు తప్పక పరిశీలించాల్సిన పథకాల్లో రిలయన్స్‌ లార్జ్‌క్యాప్‌ ఫండ్‌ కూడా ఒకటి. గతంలో రిలయన్స్‌ టాప్‌ 200 పేరుతో ఈ పథకం నడిచింది. సెబీ నూతన నిబంధనల మేరకు పేరు మారింది. ఇది లార్జ్‌క్యాప్‌ ఆధారిత పథకం. దీర్ఘకాలంలో ఇప్పటి వరకు చూసుకుంటే మంచి పనితీరును ప్రదర్శించింది. గతంలో డైవర్సిఫైడ్‌ విధానంలో ఇన్వెస్ట్‌ చేసే ఈ పథకం సెబీ మ్యూచువల్‌ ఫండ్‌ పథకాల పునర్‌వ్యవస్థీకరణ అనంతరం... లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌ ఆధారిత విధానానికి మళ్లింది. ఈ పథకం పనితీరుకు ప్రామాణికంగా చూసే సూచీ బీఎస్‌ఈ 100. గతంలో బెంచ్‌ మార్క్‌ బీఎస్‌ఈ 200గా ఉండేది. అంటే మార్కెట్‌ విలువ పరంగా అగ్రస్థాయి 100 కంపెనీల్లోనే ఇన్వెస్ట్‌ చేస్తుంది. దీంతో ప్రస్తుత ఆటుపోట్ల వంటి సమయాల్లో పెట్టుబడుల పరంగా రిస్క్‌ తక్కువ కోరుకునే వారికి ఈ పథకం అనుకూలంగా ఉంటుంది.
రాబడులు
గత ఏడాది కాలంలో మార్కెట్లో ఆస్థిరతలతో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ రంగాల సూచీలు 10-15 శాతం స్థాయిలో నష్టపోయాయి. విడిగా స్టాక్స్‌ను చూస్తే 50 శాతానికి పైగా నష్టపోయినవీ ఉన్నాయి. అయితే, ఇదే కాలంలో లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌లో నష్టాలు తక్కువగా ఉండడం, కొన్ని రంగాల స్టాక్స్‌ ర్యాలీ చేయడం చూశాం. ముఖ్యంగా లార్జ్‌క్యాప్‌ మ్యూచువల్‌ ఫండ్‌ విభాగంలో గడిచిన ఏడాది కాలంలో రిలయన్స్‌ లార్జ్‌క్యాప్‌ పథకం నష్టాలను కేవలం 0.6 శాతానికి పరిమితం చేసుకుని మెరుగైన స్థాయిలో ఉంది. మూడేళ్ల కాలంలో బీఎస్‌ఈ 100 రాబడులు 10.4 శాతమే కాగా, రిలయన్స్‌ లార్జ్‌క్యాప్‌ ఫండ్‌ వార్షికంగా 11.3 శాతం చొప్పున రాబడులిచ్చింది. అదే ఐదేళ్ల కాలంలో బీఎస్‌ఈ 100 వార్షికంగా 12 శాతం రాబడులు ఇస్తే, ఈ పథకం వార్షిక రాబడులు 17.7 శాతంగా ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ టాప్‌ 100, ఆదిత్యబిర్లా సన్‌లైఫ్‌ ఫ్రంట్‌లైన్‌ ఈక్విటీ, ఎస్‌బీఐ బ్లూచిప్‌ పథకాలతో పోలిస్తే పనితీరు పరంగా ముందుంది. అన్ని కాలాల్లోనూ మంచి పనితీరుతో ఈ విభాగంలో అగ్ర స్థాయి పథకాల్లో ఒకటిగా కొనసాగుతోంది. దీర్ఘకాలం కోసం సిప్‌ రూపంలో ఇన్వెస్ట్‌ చేసుకోవడం ద్వారా మరింత మెరుగైన రాబడులకు అవకాశం ఉంటుంది.
పోర్ట్‌ఫోలియో
బ్యాంకింగ్‌ రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఫార్మా రంగానికి ద్వితీయ ప్రాధాన్యమిచ్చింది. దివిస్‌ ల్యాబ్స్‌ ఇటీవలి కాలంలో బ్రహ్మాండమైన పనితీరు చూపించడం ఈ పథకానికి కలిసొచ్చింది. సాఫ్ట్‌వేర్‌, ఆటోమొబైల్స్‌కు కేటాయింపులను తగ్గించింది. పెట్రోలియం ఉత్పత్తులు, ఇండస్ట్రియల్‌ క్యాపిటల్‌ గూడ్స్‌ రంగాలకు స్వల్పంగా కేటాయింపులను పెంచింది. కన్‌స్ట్రక్షన్‌, మెటల్‌ రంగాల స్టాక్స్‌ను పోర్ట్‌ఫోలియోకు గత ఏడాది కాలంలో యాడ్‌ చేసింది. సీమెన్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ను కొత్తగా చేర్చుకుంది.You may be interested

వచ్చే ఏడాది ఆర్థిక వృద్ధి జోరు- సీఐఐ

Monday 31st December 2018

న్యూఢిల్లీ: పలు అంతర్జాతీయ ప్రతికూల సంఘటనలు జరిగినప్పటికీ, ఈ ఏడాది వేగవంతమైన వృద్ధి సాధించిన ఆర్థిక వ్యవస్థగా గుర్తింపుపొందిన భారత్‌ 2019లో సైతం ఇదే జోరును ప్రదర్శించగలదని పరిశ్రమల సమాఖ్య సీఐఐ అంచనావేసింది. సర్వీసుల రంగం పటిష్టమైన పనితీరుతో పాటు లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో వినియోగ డిమాండ్‌ మెరుగుదల కారణంగా 2019లో జీడీపీ వృద్ధి 7.5 శాతానికి చేరుతుందని సీఐఐ డైరెక్టర్‌ జనరల్‌ చంద్రజిత్‌ బెనర్జీ పేర్కొన్నారు. జీఎస్‌టీ అమలులో

డిఫాల్లర నుంచి బ్యాంకుల వసూళ్లు రూ.40,400 కోట్లు

Monday 31st December 2018

ముంబై: వివిధ కొత్త చట్టాల ఆసరాతో 2018తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు...డిఫాల్టర్ల నుంచి రూ. 40,400 కోట్లు వసూలు చేయగలిగాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఈ వసూళ్లు రూ.38,500 కోట్లుకాగా, గత ఆర్థిక సంవత్సరం అంతకుమించిన మొండి బకాయిల్ని వసూలు చేయడం గమనార్హం. ఇన్‌సాల్వెన్సీ బాం‍క్రప్టసీ కోడ్‌ (ఐబీసీ) అమలులోకి రావడం, సెక్యూరిటైజేషన్‌, రీకన్‌స్ర్టక‌్షన్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ అసెట్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫ్‌ సెక్యూరిటీ అసెట్స్‌ (ఎస్‌ఏఆర్‌ఎఫ్‌ఏఈఎస్‌ఐ) చట్ట సవరణలు

Most from this category