STOCKS

News


సీఈఎస్‌సీ డీమెర్జర్‌తో ఇన్వెస్టర్‌కు లాభమెంత?

Friday 19th October 2018
Markets_main1539972786.png-21297

సీఈఎస్‌సీ డీమెర్జర్‌ ఎట్టకేలకు తుది అంకానికి చేరింది. పలు అంశాల కారణంగా ఏడాదికిపైగా ఇది జాప్యం అవుతూ వచ్చింది. అక్టోబర్‌ 31 తేదీని డీమెర్జర్‌కు రికార్డు తేదీగా కంపెనీ ఖరారు చేసింది. అంటే ఆ రోజు నాటికి డీమ్యాట్‌ అకౌంట్లో షేర్లు కలిగిన వారికి కంపెనీ నుంచి డీమెర్జ్‌ చేసి లిస్ట్‌ చేసే కొత్త కంపెనీల షేర్లు లభిస్తాయి. తొలుత ప్రస్తుత కంపెనీని నాలుగు వ్యాపారాలుగా వేరు చేసి లిస్ట్‌ చేయాలనుకుంది. విద్యుదుత్పత్తి, పంపిణీ వ్యాపారం వేరు చేసేందుకు అనుమతులు జాప్యం అవుతున్నాయి. ఈ కారణంగానే ఇన్నాళ్లూ డీమెర్జర్‌ ఆగిపోయింది. దీంతో విద్యుదుత్పత్తి, పంపిణీని ప్రస్తుత కంపెనీలోనే ఉంచేస్తోంది. రిటైల్‌, ఇతర వెంచర్లను డీమెర్జ్‌ చేసి లిస్ట్‌ చేయనుంది. 

 

డీమెర్జర్‌ స్కీమ్‌ ప్రకారం... సీఈఎస్‌సీ 10 షేర్లు కలిగిన వాటాదారులకు అదనంగా ఆర్‌పీ-ఎస్‌జీ రిటైల్‌ షేర్లు 6 లభిస్తాయి. అలాగే, ఆర్‌పీ-ఎస్‌జీ బిజినెస్‌ ప్రాసెస్‌ సర్వీస్‌ 2 షేర్లు లభిస్తాయి. సీఈఎస్‌సీలోని విద్యుదుత్పత్తి విభాగానికి 2,425 మెగావాట్ల సామర్థ్యం ఉంది. స్థిరమైన వృద్ధి, రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ రెండంకెల స్థాయిలో ఉంది. ఈ ఆస్తులపై కంపెనీ రూ.6,500 కోట్లు ఇన్వెస్ట్‌ చేసి ఉంది. ఒక్క విద్యుదుత్పత్తి, పంపిణీ వ్యాపారం షేరు విలువే రూ.983 చేస్తుంది. కానీ, ప్రస్తుతం కంపెనీ షేరు ధర రూ.893.65. 

 

రిటైల్‌ వెంచర్‌ స్పెన్సర్‌ టర్న్‌ అరౌండ్‌ అయింది. విడిగా లిస్ట్‌ చేస్తే మంచి వ్యాల్యూషన్‌ రానుంది. నష్టాల్లో ఉన్న స్పెన్సర్‌ పునరుద్ధరణ అనంతరం గతేడాది ఎబిట్డా సానుకూలంగా మారింది. రూ.2,091 కోట్ల టర్నోవర్‌పై రూ.17 కోట్ల ఎబిట్డా నమోదు చేసింది. తొలుత దుకాణాల సంఖ్య 2010 ఆర్థిక సంవత్సరం నాటికి 215గా ఉంటే, 2016 ఆర్థిక సంవత్సరానికి 118కు తగ్గించుకుంది. 2018 ఆర్థిక సంవత్సరానికి 128కు పెంచుకుంది. పెద్ద ఫార్మాట్‌ స్టోర్లపై కంపెనీ దృష్టి పెట్టింది. 2019 ఆర్థిక సంవత్సరంలో విక్రయాల్లో 20 శాతం వృద్ధి, 2020లో 15 శాతం మేర వృద్ధి నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. అలా చూస్తే కంపెనీ టర్నోవర్‌ రూ.2,800 కోట్లకు చేరుతుంది. 2020 ఆర్థిక సంవత్సరంలో విక్రయాల ఆధారంగా చూస్తే రిటైల్‌ షేరు ధర రూ.217గా అంచనా వేయవచ్చు. ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ అండ్‌ రిటైల్‌, ట్రెంట్‌ షేర్లు అయితే 2020 ఆర్థిక సంవత్సరం అంచనా విక్రయాలకు 1.96 రెట్ల ట్రేడ్‌ అవుతున్నాయి. 

 

ఇక మూడో వ్యాపారం చూస్తే.... ఫస్ట్‌సోర్స్‌ సొల్యూషన్స్‌, క్వెస్ట్‌మాల్‌. ఫస్ట్‌సోర్స్‌ వార్షిక విక్రయాలు 3,541 కోట్లు కాగా, లాభం రూ.327 కోట్లుగా ఉంది. 2020 ఆర్థిక సంవత్సరం ఫలితాల అంచనాల ప్రకారం ఒక్కో షేరు ధర రూ.165. అంటే ఈ మూడు వ్యాపారాల విలువల ఆధారంగా కలిపి చూస్తే ప్రస్తుత సీఈఎస్‌సీ అసలు విలువ రూ.1,350-1,365గా అంచనా కట్టొచ్చు. ప్రస్తుత ధర ప్రకారం ఇది డిస్కౌంట్‌కు లభిస్తోంది.You may be interested

షిర్డీ-హైదరాబాద్‌ మధ్య స్పైస్‌జెట్‌ విమానం

Saturday 20th October 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ నవంబరు 3 నుంచి షిర్డీ-హైదరాబాద్‌ మధ్య ప్రతిరోజు డైరెక్ట్‌ సర్వీసు నడుపనుంది. ఉదయం 9.35కు హైదరాబాద్‌లో బయల్దేరే విమానం షిర్డీలో 11 గంటలకు దిగుతుంది. తిరుగు ప్రయాణంలో 11.20కి ప్రారంభమై 12.40కి హైదరాబాద్‌ చేరుకుంటుంది. ఇందుకోసం బాంబార్డియర్‌ క్యూ400 రకం విమానాన్ని కేటాయించామని స్పైస్‌జెట్‌ చీఫ్‌ సేల్స్‌, రెవెన్యూ ఆఫీసర్‌ శిల్పా భాటియా తెలిపారు. టికెట్‌ ధర షిర్డీకి రూ.3,999, తిరుగు ప్రయాణానికి

ఈఎల్‌ఎస్‌ఎస్‌ మెరుగైన ఆప్షన్‌... ఎందుకంటే?

Friday 19th October 2018

పన్ను ఆదా చేసే పథకాల్లో ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (ఈఎల్‌ఎఎస్‌ఎస్‌) మెరుగైన ఆప్షన్‌గా నిపుణులు పేర్కొంటున్నారు. సెక్షన్‌ 80సీ కింద రూ.1.5 లక్షల ఆదాయంపై పన్ను మినహాయింపునకు పీపీఎఫ్‌, ఈపీఎఫ్‌, యులిప్‌లు, ఎన్‌ఎస్‌సీ, ఐదేళ్ల బ్యాంకు ఎఫ్‌డీ తదితర సాధనాలున్న విషయం తెలిసిందే. వీటన్నింటలో ఈఎల్‌ఎస్‌ఎస్‌ ఎందుకు మెరుగైనదన్న దానికి నిపుణులు పేర్కొంటున్న అంశాలు ఇవి...   తక్కువ లాకిన్‌ పీరియడ్‌ అంటే పెట్టుబడి పెట్టిన తర్వాత నిర్ణీత కాలం పాటు తిరిగి

Most from this category