STOCKS

News


ఆర్‌ఐఎల్‌ షేరు ఇంకా పెరుగుతుందా?

Friday 22nd March 2019
news_main1553245442.png-24753

ఈ నెల్లో మార్కెట్‌ పరుగులను మించి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు ర్యాలీ జరిపింది. సుమారు నెల రోజుల్లో దాదాపు 23 శాతం లాభపడింది. మార్చి20న షేరు బీఎస్‌ఈలో ఆల్‌టైమ్‌ హై 1386రూపాయలను తాకింది. ఈ రేంజ్‌లో షేరు దూసుకుపోవడంతో ఇకపై ఎలాంటి ప్రదర్శన జరుపుతుందో? ఈ స్థాయిల వద్ద కొనవచ్చా? అని అనేక సందేహాలు రిటైలర్స్‌ మదిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో షేరు లాభాల పరుగు కొనసాగుతుందని ఎక్కువమంది అనలిస్టులు, బ్రోకింగ్‌ సంస్థలు అంచనా వేస్తున్నాయి. రాయిటర్స్‌ సర్వేలో ఆర్‌ఐఎల్‌ షేరుపై 10 మంది అనలిస్టులు బలమైన కొనుగోలు, 16 మంది కొనొచ్చు, ఐదుగురు హోల్డ్‌, ఇద్దరు అమ్మొచ్చు, ఇద్దరు బలమైన అమ్మకం రేటింగులను ఇచ్చారు. 

  •  ఎస్‌బీఎస్‌ సెక్యూరిటీస్‌ అండ్‌ క్యాపిటల్‌ మార్కె్‌‍ట్స్‌ సంస్థ ఆర్‌ఐఎల్‌కు కొనొచ్చు రేటింగ్‌ను రూ. 1500 టార్గెట్‌ను ఇచ్చింది. కంపెనీ రిటైల్‌ వ్యాపారంపై బ్రోకింగ్‌ సంస్థ పాజిటివ్‌గాఉంది.
  •  జియో, రిటైల్‌ వ్యాపారాలు ఎబిటా విస్తరణకు దోహదం చేస్తాయని, దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఎబిటా 30 శాతం వృద్ది నమోదు చేస్తుందని హెచ్‌ఎస్‌బీసీ అంచనా వేసింది. జీఆర్‌ఎం క్షీణత కారణంగా ఏర్పడే తరుగును రిటైల్‌వ్యాపారం సమర్ధవంతంగా పూడుస్తుందని తెలిపింది. దీంతో కంపెనీ మార్జిన్లలో పెద్దగా కోతలుండవని అంచనా వేసింది. ఆర్‌ఐఎల్‌ రిటైల్‌ రెవెన్యూ వృద్ధి వచ్చే పదిపదిహేనేళ్ల పాటు 15 శాతం వరకు ఉండొచ్చని తెలిపింది. ఈ పాజిటివ్‌ అంశాల కారణంగా షేరు మరింత ముందుకు సాగవచ్చని తెలిపింది.
  •  ఈ షేరు కౌంటర్లో సౌష్ఠవాకార పురోగమనం కనిపిస్తోందని కేఆర్‌ చౌక్సీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ తెలిపింది. ఇన్‌ఫ్రా ఆస్తులను కంపెనీ ద్రవ్యీకరణ చేసుకోనుందన్నారు. రిటైల్‌, జియోలు కంపెనీకి ‍ప్రధాన బలగాలని తెలిపింది. షేరుకు కొనొచ్చు రేటింగ్‌ ఇచ్చింది.
  •  కొందరు నిపుణులు మాత్రం షేరుపై న్యూట్రల్‌గా ఉన్నారు. జియో, రిటైల్‌ విభాగాలపై ఆశలున్నా, జీఆర్‌ఎం క్షీణత కంపెనీ మార్జిన్లను దెబ్బతీయవచ్చని ఐడీబీఐ క్యాప్‌ అభిప్రాయపడింది. స్టాకు తమ టార్గెట్‌ ధరకు పైన ట్రేడవుతోందని తెలిపింది. ఈ పరిస్థితుల్లో ఇకమీదట షేరు ఎలాంటి కదలిక చూపుతుందని చెప్పలేమన్నారు. అయతే మూడేళ్ల కాలపరిమితితో అట్టిపెట్టుకుంటే మాత్రం కచ్ఛితంగా పాజిటివ్‌గా ఉన్నట్లు చెప్పవచ్చన్నారు. 
  •  ఈపీఎస్‌ పెరగడం, వాల్యూషన్లు ఖరీదుగా మారినందున షేరుకు అండర్‌పెర్ఫామ్‌ రేటింగ్‌ ఇస్తున్నట్లు జెఫర్రీస్‌ తెలిపింది. 


RIL

You may be interested

ఒడిదుడుకుల మార్కెట్లో రియల్టీ షేర్ల ర్యాలీ

Friday 22nd March 2019

ఒడిదుడుకుల మార్కెట్‌ ట్రేడింగ్‌లో రియల్టీ రంగ షేర్లు రాణిస్తున్నాయి. ఈ రంగానికి చెందిన ప్రెస్టేజ్‌ ఎస్టేజ్‌, ఓబేరాయ్‌ రియల్టీ, గోద్రేజ్‌ ప్రాపర్టీ షేర్ల ర్యాలీతో ఎన్‌ఎస్‌ఈలో రియల్టీ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహిస్తున్న నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ 2.50శాతం లాభపడింది.  నేడు నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ 266 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో ఇన్వెస్టర్లు లాభస్వీకరణ పూనుకోవడంతో అన్ని రంగాలకు చెందిన షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనైప్పటికీ, రియల్టీ రంగ

భారత్‌ జీడీపీ అంచనాలను తగ్గించిన ఫిచ్‌

Friday 22nd March 2019

వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఇండియా జీడీపీ వృద్ది రేటు అంచనాను ఫిచ్‌ రేటింగ్స్‌ 7 శాతం నుంచి 6.8 శాతానికి తగ్గించింది. ఎకానమీలో అనుకున్నదానికన్నా ఎక్కువ బలహీనత కనిపించవచ్చని అందుకే వృద్ధి అంచనా తగ్గిస్తున్నామని తెలిపింది. అయితే అంచనా తగ్గించినా, 6.8 శాతం వృద్ది రేటు ఆమోదయోగ్యమేనని తెలిపింది. ఆపై ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 7. 1 శాతంగా నమోదు కావచ్చని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర వృద్ధి రేటు

Most from this category