STOCKS

News


2–3 వారాలకు ఈ షేర్లు చూడొచ్చు

Monday 25th February 2019
Markets_main1551090375.png-24322

2–3 వారాల్లో రాబడులకు అవకాశం వున్న   షేర్లపై వివిధ అనలిస్టులు రూపొందించిన అంచనాలివే..

అనలిస్ట్‌: వైశాలి ఫారిఖ్, టెక్నికల్‌ అనలిస్ట్, ప్రభుదాస్‌ లీలాధర్‌

హీరో మోటో కార్ప్‌

సిఫార్సు: బై,  టార్గెట్‌: రూ. 2950, స్టాప్‌లాస్‌: రూ. 2650
 ఈ షేరు ఇటీవల 2,960 గరిష్టస్థాయి నుంచి పీకవుట్‌ అయిన తర్వాత రూ. 2,580 వరకూ తగ్గింది. అయితే ఈ కనిష్టస్థాయి వద్ద డెయిలీ చార్టుల్లో డబుల్‌ బాటమ్‌ ఫార్మేషన్‌ను కనపర్చి, బుల్లిష్‌ క్యాండిల్‌ ఏర్పాటుచేసుకుంది. ఓవర్‌సోల్డ్‌ జోన్‌ నుంచి ఆర్‌ఎస్‌ఐ ట్రెండ్‌ రివర్స్‌ అయినట్లు కన్పిస్తున్నందున, ప్రస్తుత ధరలో కొనుగోలుచేసి రూ. 2,560 స్టాప్‌లాస్‌తో రూ. 2,950 టార్గెట్‌ ధర కోసం అట్టిపెట్టవచ్చు. 

జెఎస్‌డబ్ల్యూ స్టీల్‌
సిఫార్సు: బై, టార్గెట్‌: రూ. 330, స్టాప్‌లాస్‌: రూ. 260

గత నాలుగైదు నెలల నుంచి ఈ షేరు గరిష్టస్థాయి రూ.427 నుంచి చాలావరకూ లాభాల్ని కోల్పోయింది. కానీ ఇటీవల రూ. 255 సమీపంలో బాటమ్‌అవుట్‌ అయిన సంకేతాల్ని కనపరుస్తోంది. ఈ స్థాయి నుంచి బౌన్స్‌ అయిన తీరు కూడా తదుపరి అప్‌ట్రెండ్‌ను సూచిస్తోంది. ఆర్‌ఎస్‌ఐ నెమ్మదిగా పెరుగుతూ పాజిటివ్‌ మూమెంటమ్‌ను ప్రదర్శిస్తోంది. ఈ కారణంగా జెఎస్‌డబ్ల్యూ స్టీల్‌ను కొనుగోలుచేసి, రూ. 260 స్టాప్‌లాస్‌తో రూ. 330 టార్గెట్‌ కోసం ట్రేడర్లు హోల్డ్‌ చేయవచ్చు.

అనలిస్ట్‌: ఆదిత్యా అగర్వాల్, టెక్నికల్‌ అనలిస్ట్, యస్‌ సెక్యూరిటీస్‌

మారుతి సుజుకి

సిఫార్సు:  కొనొచ్చు. టార్గెట్‌: రూ. 7215–7350, స్టాప్‌లాస్‌: రూ. 6700


61.8 ఫిబోనకి స్థాయి అయిన రూ. 6,700 వద్ద మారుతి పొందిన మారుతి సుజుకి ఎగువబాట పట్టింది. ఈ షేరు రూ. 6,950పైన స్థిరపడితే క్రమేపీ రూ. 7,215–7,350 శ్రేణికి చేరే ఛాన్స్‌ వుంది. డెయిలీ చార్టుల్లో పాజిటివ్‌ రివర్స్‌ల్‌ను సైతం కనపరుస్తోంది. ఇది బుల్లిష్‌నెస్‌కు సూచన.

డాబర్‌ ఇండియా 

సిఫార్సు: బై,  టార్గెట్‌: రూ. 470, స్టాప్‌లాస్‌: రూ. 467

చానల్‌ పాట్రన్‌ దిగువస్థాయిలో మద్దతు పొందిన డాబర్‌ ఇండియా తిరిగి పెరిగే ప్రయత్నం చేస్తున్నది. ఈ స్థాయి వద్ద మద్దతుపొంది, అప్‌ట్రెండ్‌వైపు మళ్లడం... రానున్న ట్రేడింగ్‌ సెషన్లలో ఇది మరింత పెరుగుతుందనడానికి సంకేతం.


అనలిస్ట్‌: మజర్‌ మహ్మద్, చీఫ్‌ స్ట్రాటజిస్ట్, చార్ట్‌వ్యూ ఇండియా

అశోక్‌ లేలాండ్‌

సిఫార్సు: బై,  టార్గెట్‌: రూ. 88, స్టాప్‌లాస్‌: రూ. 79

రెండు రోజుల క్రితం అధిక ట్రేడింగ్‌ పరిమాణంతో రివర్సల్‌ ఫార్మేషన్‌ను కనపర్చిన అశోక్‌లేలాండ్‌ స్వల్పకాలంలో మరింత పెరిగే సంకేతాల్ని అందిస్తోంది. ఒక్కరోజు భారీగా పెరిగిన తర్వాత...కొంత కరెక్ట్‌ అయ్యి, కన్సాలిడేషన్‌లోకి మళ్లి రూ. 80 సమీపంలో మంచి బేస్‌ను ఏర్పాటుచేసుకుంది. ఈ స్థాయి నుంచి పుల్‌బ్యాక్‌ ర్యాలీ జరిగే అవకాశం వుంది. 

 

ఎక్సయిడ్‌ ఇండస్ట్రీస్‌

సిఫార్సు: బై, టార్గెట్‌: రూ. 277, స్టాప్‌లాస్‌: రూ. 202

రూ. 273 గరిష్టస్థాయి నుంచి దిద్దుబాటుకు లోనైన ఎక్సయిడ్‌ ఇండస్ట్రీస్‌ గత రెండు సెషన్లుగా రూ. 203 సమీపంలో మద్దతు పొందినట్లు కన్పిస్తోంది. ఈ స్థాయి వద్ద ఈ షేరు స్థిరంగా వున్నందున...పుల్‌బ్యాక్‌ ర్యాలీకి సిద్ధమైనట్లు పరిగణించవచ్చు. 
 



You may be interested

10850పైన నిఫ్టీ ముగింపు

Monday 25th February 2019

ఐటీ, అటో ప్రైవేట్‌ రంగ షేర్ల ర్యాలీతో మార్కెట్‌ సోమవారం లాభంతో ముగిసింది. చివరి గంటలో కొనుగోళ్ల కారణంగా సూచీలు ఇంట్రాడే గరిష్టం వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌ 341 పాయింట్లు లాభపడి 36,213 వద్ద, నిఫ్టీ 88 పాయింట్లు పెరిగి 10,880 వద్ద స్థిరపడ్డాయి. ప్రైవేట్‌ రంగ షేర్ల ర్యాలీతో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 291 పాయింట్లు లాభపడి 27,159 వద్ద స్థిరపడింది. ప్రపంచమార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలతో నేడు

ఎగసి పడిన రియల్టీ షేర్లు

Monday 25th February 2019

ఇళ్ల కొనుగోళ్లపై పన్ను భారాన్ని తగ్గిస్తూ జీఎస్‌టీ మండలి తీసుకున్న నిర్ణయంతో సోమవారం రియల్టీ షేర్లు ఎగిసిపడ్డాయి. నిర్మాణంలో ఉన్న ఇళ్లపై జీఎస్‌టీ శాతాన్ని 12 శాతం నుంచి 5శాతానికి, అందుబాటు ధరల్లో ఉన్న ఇళ్లపై పన్నును 8శాతం నుంచి 1శాతానికి తగ్గిస్తున్నట్లు ఆదివారం జీఎస్‌టీ మండలి ప్రకటించింది. ఈ ప్రకటనతో నేడు రియల్‌ ఎస్టేట్‌ షేర్లు ఉదయం ట్రేడింగ్‌లో భారీ లాభపడి మిడ్‌సెషన్‌ సమయానికి క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి.

Most from this category