STOCKS

News


క్యాడ్‌తోనే ఆందోళన..

Wednesday 10th October 2018
Markets_main1539159818.png-21016

అధిక క్రూడ్‌ ధరలు ఆర్థిక వ్యవస్థకు చేటని మనులైఫ్‌ ఏఎం ఎండీ రాణా బి గుప్తా తెలిపారు. ఒక వేళ వాణిజ్య లోటు 18-19 బిలియన్‌ డాలర్లమేర నమోదైతే.. అప్పుడు కరెంట్‌ అకౌంట్‌ లోటు (క్యాడ్‌) దాదాపు 3 శాతంగా ఉండొచ్చని అంచనా వేశారు. ఇది ఆందోళన చెందాల్సిన అంశమని తెలిపారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. ఫెడ్‌ పాలసీ నిర్ణయాలను రాజకీయాలు ప్రభావితం చేస్తాయని తాను భావించడం లేదన్నారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌కి కొన్ని వ్యక్తిగత అభిప్రాయాలు ఉండొచ్చని, అయితే ఫెడరల్‌ రిజర్వు మాత్రం తన పని తాను చేసుకుంటూ వెళ్తుందని తెలిపారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని గుర్తుచేశారు. అక్కడ పదేళ్ల బాండ్‌ ఈల్డ్స్‌ 3.4 శాతానికి పెరిగాయని పేర్కొన్నారు. ఇంకా పెరిగితే వర్ధమాన మార్కెట్లకు మంచిది కాదని తెలిపారు. ఈల్డ్స్‌ పెరిగాయంటే డాలర్‌ బలంగా ఉన్నట్లు అర్ధమని పేర్కొన్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ పటిష్టమైన వృద్ధి బాటలో పయనిస్తుంటే.. వర్ధమాన మార్కెట్లు మోస్తారు వృద్ధిని సాధిస్తున్నాయని తెలిపారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ బలమైన వృద్ధి నేపథ్యంలో ఫెడరల్‌ రిజర్వు రేట్లు పెంచుకుంటూ వస్తోందని, దీంతో లిక్విడిటీ తగ్గుతోందన్నారు. అమెరికా బాండ్‌ ఈల్డ్స్‌ 3.5 శాతానికి చేరితే.. వర్ధమాన కరెన్సీలు మరింత పడిపోతే.. అప్పుడు దేశీ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం ఉంటుందని తెలిపారు. ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు మోస్తారుగా ఉన్నప్పటికీ వర్ధమాన మార్కెట్లు విదేశీ ఇన్వెస్టర్లను ఆకర్షించడానికి వడ్డీ రేట్లు పెంచాల్సిన పరిస్థితి వస్తుందని పేర్కొన్నారు. ఇది మంచి చర్య కాదని అభిప్రాయపడ్డారు. ఇంధన ధరలను సవరించడం అనేది ఆర్థికంగా నెగటివ్‌ అంశమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ద్రవ్య లోటు లక్ష్యాన్ని 3.3 శాతంగా నిర్ణయించుకుందని తెలిపారు. అయితే ఇది 3.5 శాతానికి చేరొచ్చని అంచనా వేశారు. క్రూడ్‌ ధరల పెరుగుదల వల్ల క్యాడ్‌ పెరుగుతుందని, ఇది భారత్‌కు మంచిది కాదని తెలిపారు. 



You may be interested

రూపీ రికవరీ: నష్టాల్లో ఐటీ షేర్లు

Wednesday 10th October 2018

ముంబై:- కనిష్టస్థాయిల నుంచి రూపాయి రీకవరీ కారణంగా బుధవారం ఐటీ షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ఐటీ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ 2శాతంగా నష్టపోయింది. డాలర్‌ మారకంలో రూపాయి విలువ క్రితం ట్రేడింగ్‌ సెషన్‌లో 74.39 వద్ద జీవితకాల కనిష్టాన్ని నమోదు చేసింది. పతనమవుతున్న  రూపాయిని ఆదుకునేందుకు, ఆర్థిక వ్యవస్థలో లిక్విటిడిని పెంచేందుకు ప్రభుత్వం ఓపెన్‌ మార్కెట్‌ ద్వారా రూ.12వేల కోట్ల విలువైన బాండ్లను

బాండ్లు, రూపీకి ఆర్‌బీఐ బూస్ట్‌

Wednesday 10th October 2018

ప్రస్తుత పరిస్థితుల్లో లిక్విడిటీకి మద్దతునిచ్చే ఎలాంటి చర్య అయినా ఆహ్వానించదగినదేనని కోటక్‌ ఎంఎఫ్‌ సీఐవో (ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌), హెడ్‌ (ప్రొడక్ట్స్‌) లక్ష్మీ ఐయ్యర్‌ తెలిపారు. ఆమె ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఆర్‌బీఐ ఈ నెలలో రూ.36,000 కోట్ల మేర విలువైన బాండ్లను ఓపెన్‌ మార్కెట్‌ ద్వారా కొనుగోలు చేయాలని నిర్ణయించుకుందని, అందులో భాగంగానే అక్టోబర్‌ 11న రూ.12,000 కోట్లు ప్రభుత్వ బాండ్లను కొనుగోలు

Most from this category