STOCKS

News


38000 దిగువన సెన్సెక్స్‌ ముగింపు

Monday 25th March 2019
Markets_main1553510902.png-24790

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమన భయాలు మార్కెట్‌ రెండోరోజూ ముంచేశాయి. వరుస ర్యాలీ అనంతరం గత శుక్రవారం క్షీణించిన భారత్‌ సూచీలు సోమవారం సైతం పతనమయ్యాయి. ఈ క్రమంలో తాజాగా సెన్సెక్స్‌ 38000 స్థాయిని కోల్పోగా, నిఫ్టీ 100 పాయింట్లను నష్టపోయింది. అన్ని రంగ షేర్లలో తీవ్రతరమైన అమ్మకాలతో సెన్సెక్స్‌ 355 పాయింట్లు పతనమై 37,809 వద్ద, నిఫ్టీ 103 పాయింట్లను నష్టపోయి 11,354 వద్ద ముగిసింది. అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ ఉన్నట్టుండి ఈ ఏడాది(2019)లో వడ్డీ రేట్ల పెంపు ఉండబోదంటూ సంకేతాలివ్వడంతో ఇన్వెస్టర్లలో ఆర్థికవృద్ధి ఆందోళనలు రేకెత్తాయి. ఫలితంగా అమెరికా, ఆసియా మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఈ ప్రతికూల సంకేతాలను అందిపుచ్చుకున్న మార్కెట్‌ నేడు నష్టాలతో మొదలైంది. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గుచూపడంతో సూచీలు ఆద్యంతం నష్టాల్లోనే ట్రేడ్‌ అయ్యాయి. అన్ని రంగ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. అయితే అత్యధికంగా బ్యాంకింగ్‌ రంగ షేర్లు నష్టపోగా, ఫార్మా షేర్లు మాత్రం స్వల్పంగా నష్టపోయాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 450 పాయింట్లకుపైగా పతనమై 37,667 వద్ద, నిఫ్టీ సైతం 146 పాయింట్లు నష్టపోయి 11,311.60 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి.  
టాటామోటర్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, వేదాంత, ఇన్ఫ్రాటెల్‌, జీ లిమిటెడ్‌ షేర్లు 2.50శాతం నుంచి 4.50శాతం నష్టపోగా, పవర్‌ గ్రిడ్‌, కోల్‌ ఇండియా, హెచ్‌పీసీఎల్‌, ఓఎన్‌జీసీ, ఐఓసీ షేర్లు 1.50శాతం నుంచి 4.50శాతం లాభపడ్డాయి. 



You may be interested

మిడ్‌క్యాప్‌లో ఇన్వెస్ట్‌ చేశారా?

Tuesday 26th March 2019

హావెల్స్‌ కంపెనీలో 1997లో రూ.10,000 ఇన్వెస్ట్‌ చేసి ఉంటే... ఆ షేర్ల విలువ ఇప్పటి మార్కెట్‌ ధర ప్రకారం రూ.3.50 కోట్లు. మిడ్‌క్యాప్‌ సత్తా అంటే ఇదే మరి. అయితే, అలా అని కొన్న ప్రతీ కంపెనీ ఈ స్థాయిలో ర్యాలీ చేస్తుందనుకోవద్దు. కాకపోతే ఈ తరహా భారీ రాబడులను ఇచ్చిన షేర్ల సంఖ్య చెప్పుకోతగ్గ స్థాయిలో ఉంది. అయితే, స్మాల్‌, మిడ్‌క్యాప్‌లో ఇ‍న్వెస్ట్‌ చేసిన వారికి  2018 సంవత్సరం

బ్యాంక్‌ నిఫ్టీ 1శాతం డౌన్‌

Monday 25th March 2019

మార్కెట్లో జరిగిన అమ్మకాలతో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ సోమవారం 1శాతం నష్టపోయింది. ఇంట్రాడేలో ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ బ్యాంకు షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడం ఇండెక్స్‌ను భారీగా నష్టపోయింది. ముఖ్యంగా ప్రైవేట్‌రంగ బ్యాంక్‌ షేర్లైన ఐసీఐసీఐ బ్యాంక్‌, యస్‌బ్యాంక్‌, కోటక్‌ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ షేర్ల 2శాతం పతనం ఇండెక్స్‌ను భారీగా దెబ్బతీశాయి. అలాగే ఫెడరల్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఎస్‌బీఐ బ్యాంక్‌, పంజాజ్‌ నేషనల్‌ బ్యాంక్‌,

Most from this category