STOCKS

News


చురుగ్గా ట్రేడవుతున్న షేర్లివే..!

Tuesday 17th July 2018
Markets_main1531812747.png-18391

అంతర్జాతీయంగా ముడిచమురు ధర దిగిరావడంతో మంగళవారం మిడ్‌షెషన్‌ సమయానికి దేశీయ మార్కెట్‌ లాభాల్లో ట్రేడ్‌ అవుతోంది. మధ్యాహ్నం గం.12:45ని.లకు బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 25 పాయింట్ల లాభంతో 36,348 వద్ద,  ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 28 పాయింట్ల లాభంతో 10,965 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. ఈ తరుణంలో ఎన్‌ఎస్‌ఈలో ట్రేడింగ్‌లో కొన్ని షేర్లు భారీ ట్రేడింగ్‌ పరిమాణంతో ట్రేడ్‌ అవుతున్నాయి. వాటిలో రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ షేరు  1.90 కోట్ల వాల్యూమ్స్‌తో ట్రేడ్‌ అవుతుండగా, తరువాతి స్థానంలో పీసీ జ్యువెలర్‌ షేరు 1.79 కోట్ల పరిమాణంలో, జై ప్రకాష్‌ అసోసియేట్స్‌ షేరు 1.79 కోట్ల వాల్యూమ్స్‌తో ట్రేడ్‌ అవుతున్నాయి. వీటితో పాటు అశోక్‌ లేలాండ్స్‌ షేరులో 78లక్షలు, సుజలాన్‌ ఎనర్జీ 75లక్షలు, ఐడీబీఐ బ్యాంకు 63లక్షలు, ఐడీఎఫ్‌సీ బ్యాంకు 60 లక్షలు, పంబాబ్‌ నేషనల్‌ బ్యాంకు 58లక్షల పరిమాణంతో  ట్రేడ్‌ అవుతున్నాయి. మరోవైపు ముడిచమురు ధర దిగిరావడంతో పెట్రోనెట్‌ కంపెనీలైన హెచ్‌పీసీఎల్‌(6శాతం), ఐఓసీ(4.50శాతం), బీపీసీఎల్‌(3శాతం) టాప్‌-3 గెయినర్లగా ట్రేడ్‌ అవుతున్నాయి. నిన్న వెల్లడించి కంపెనీ ఆర్థిక ఫలితాలు మిశ్రమంగా ఉండటంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపడంతో హిందూస్థాన్‌యూనిలివర్‌ అత్యధికంగా 4శాతం పతనమై నిఫ్టీ టాప్‌-1 లూజర్‌గా ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

హెచ్‌యూఎల్‌ రేటింగ్‌ డౌన్‌గ్రేడ్‌

Tuesday 17th July 2018

సోమవారం క్యు1 ఫలితాలు ప్రకటించిన హెచ్‌యూఎల్‌ షేరు మంగళవారం ట్రేడింగ్‌లో దాదాపు 3 శాతం పతనమైంది. ఫలితాలు బాగున్నప్పటికీ కొన్ని బ్రోకరేజ్‌లు కంపెనీ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేశాయి. కొన్ని సంస్థలు టార్గెట్‌ ధరను పెంచాయి.  క్యు1 ఫలితాల అనంతరం హెచ్‌యూఎల్‌పై వివిధ బ్రోకరేజ్‌ల అంచనాలు, అభిప్రాయాలు... 1. యాక్సిస్‌ క్యాపిటల్‌: రేటింగ్‌- హోల్డ్‌. టార్గెట్‌ రూ. 1720. రేటింగ్‌ను కొనొచ్చు నుంచి తగ్గించింది. ఇటీవలి ర్యాలీతో షేరు వాల్యూషన్లు చాలా ఖరీదుగా మారాయి.

మిడ్‌క్యాప్స్‌ జోరు.. ఆర్‌కామ్‌ టాప్‌..

Tuesday 17th July 2018

మిడ్‌క్యాప్స్‌ జోరు చూపుతున్నాయి. మంగళవారం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ షేర్లతో పోలిస్తే మిడ్‌క్యాప్‌ షేర్లు మిన్నగా పెరిగాయి. . 11:40 సమయంలో బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 0.95 శాతం పెరుగుదలతో 15,197కు చేరింది. అదే సమయంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 0.11 శాతం వృద్ధితో 36,364 పాయింట్లకు ఎగసింది. ఇక ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ-50 కూడా 0.26 శాతం వృద్ధితో 10,966కి పెరిగింది. మిడ్‌క్యాప్‌ సూచీలో భాగమైన రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ (ఆర్‌కామ్‌) 6.32 శాతం,

Most from this category