STOCKS

News


తగ్గినపుడు కొనడమే సరైన వ్యూహం..!

Friday 7th December 2018
Markets_main1544170341.png-22732

ముంబై:  మార్కెట్‌ను చూసి ఏమాత్రం భయపడవద్దని, భారత మార్కెట్‌ పట్ల బుల్లిష్‌గా ఉండడం సరైన నిర్ణయమని బీఎస్‌ఈ సభ్యుడు రమేష్ దమానీ సూచించారు. అవకాశాలు ఉన్నప్పుడే మార్కెట్‌లో పెట్టుబడులు మంచిదని ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. మార్కెట్‌ మాయాజాలాన్ని యువకులు అర్థం చేసుకుని ఓర్పుగా ఉండాలని సూచించిన ఈయన.. ఇలా వేచి ఉండడం వల్ల దీర్ఘకాలంలో భారీ మొత్తంలో సంపదను పొందవచ్చని వివరించారు. ఇందుకు బుల్లిష్‌గా ఉండడం చాలా ముఖ్యమన్నారు. ‘పెట్టుబడుల క్రమంలో నిరాశ ఒక భాగం. చౌకగా ఉన్నప్పుడు కొనుగోలు చేసి ఓర్పుగా వేచిచూడడం అనేది మార్కెట్‌లో ఒక మంచి నిర్ణయం.’ అని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ మార్కెట్ల విషయానికి వస్తే.. నాయకత్వ స్టాక్స్‌ అయిన ఎఫ్‌ఏఎన్‌జీ ఒత్తిడిలో కొనసాగుతున్నాయి. రాబడి రేఖ తిరోగమనం చూస్తుంటే రానున్న ఆర్థిక మాంద్యం, వాణిజ్య యుద్దం అక్కడి మార్కెట్లకు సవాలు విసరనున్నట్లు సంకేతంగా ఉందన్నారు. ఈ పరిణామం భారత్‌కు కలిసివచ్చే అంశం అవుతుందన్నారు. ముడిచమురు ధర 60-70 డాలర్ల స్థాయిలో ఉన్నంత వరకు ఇబ్బంది ఉండన్నారు. ఎన్నికల అంశం తాత్కాలికమే కాగా.. వినియోగం, వృద్ధి, జనాభా భారత్‌కు కలిసివచ్చే అంశాలుగా వివరించారు. బుల్‌ మార్కెట్‌ అయిపోనుందనే ఆలోచన వద్దన్న ఆయన.. పెరిగినప్పుడు అమ్ముకోవడం కంటే, పడిపోతున్నప్పడు కొనుగోలు చేయడం మంచిదని సూచించారు. 


BSE

You may be interested

స్టీల్‌ షేర్లకు సిటీ షాక్‌

Friday 7th December 2018

గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సంస్థ సిటీ తాజాగా దేశీ స్టీల్‌ కంపెనీలకు గట్టి షాకిచ్చింది. రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేసింది. స్టీల్‌ ధరలు పడిపోవడం, రుణ భారం పెరుగుదల, అధిక వ్యాల్యుయేషన్స్‌ వంటి అంశాలను ఇందుకు కారణంగా పేర్కొంది. దీంతో ఇండియన్‌ స్టీల్‌ కంపెనీలు చూడటానికి ఆకర్షణీయంగా కనిపించడం లేదని తెలిపింది.  టాటా స్టీల్‌ స్టాక్‌ను విక్రయించొచ్చని సిఫార్సు చేసింది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.620 నుంచి రూ.440కి తగ్గించింది. సెయిల్‌ షేరు కూడా

5రోజుల తరువాత లాభాల్లోకి

Friday 7th December 2018

కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేరు ర్యాలీ అండతో శుక్రవారం బ్యాంక్‌ నిఫ్టీ 5 రోజుల తర్వాత లాభాల్లోకి మళ్లింది. రిజర్వ్‌ బ్యాంకు వడ్డీరేట్లపై యధాతథ నిర్ణయం నేపథ్యంలో బ్యాంకింగ్‌ రంగ షేర్లపై అ‍మ్మకాల ఒత్తిడి ఏర్పడింది. ఫలితంగా గత 5 ట్రేడింగ్‌ సెషన్స్‌లో బ్యాంకు నిఫ్టీ నష్టాలతోనే ముగిసింది. వారెన్‌ బఫెట్‌ కంపెనీ బెర్కషైర్ హాత్వే కోటక్‌ బ్యాంక్‌లో 10శాతం వాటాను కోనుగోలు చేస్తున్నట్లు వార్తలు వెలువడంతో నేడు ఆ

Most from this category