STOCKS

News


దీర్ఘకాలానికి ఫార్మా...: కోటక్‌

Tuesday 12th March 2019
Markets_main1552332402.png-24536

మొత్తం మీద మార్కెట్‌లో లాభ, నష్టాల రేషియో గణనీయంగా మెరుగుపడిందని కోటక్‌ సెక్యూరిటీస్‌ టెక్నికల్‌ రీసెర్చ్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీకాంత్‌ చౌహాన్‌ తెలిపారు. ఎంపిక చేసిన ప్రభుత్వరంగ స్టాక్స్‌లో కొనుగోళ్లు జరుగుతున్నాయని, ప్రస్తుత ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి వస్తుందన్న మార్కెట్‌ నమ్మకాన్ని ఇది తెలియజేస్తోందన్నారు. తాజా మార్కెట్‌ పరిస్థితుల్లో గతంలోని బేస్‌ 10,550 స్థానం ఇప్పుడు 10,850 బేస్‌గా మారిందని తెలిపారు. ఎగువ స్థాయిలో మార్కెట్‌ 11,350-11,400 వరకు వెళ్లే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. 

 

రంగాలవారీగా...
బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీల్లో ఆసక్తి పెరిగిందని, మార్కెట్లలో కొనుగోళ్ల విశ్వాసం కనిపిస్తోందని శ్రీకాంత్‌ చౌహాన్‌ తెలిపారు. బాగా నష్టపోయి ఉన్న విద్యుత్‌, ఇంధన రంగాల స్టాక్స్‌ మంచి పనితీరు చూపిస్తున్నాయని, ఎంపిక చేసిన స్టాక్స్‌లో వ్యాల్యూ బయింగ్‌ (అత్యంత చౌక ధరల వద్ద కొనుగోళ్లు) మొదలైందన్న దానికి ఇది సంకేతంగా పేర్కొన్నారు. రానున్న పాలసీ సమావేశంలో ఆర్‌బీఐ ఎంపీసీ రేట్ల కోతను విధించే అవకాశం ఉందని, దీంతో బాండ్ల ఈల్డ్‌ క్షీణించడం బ్యాంకులు, విద్యుత్‌, ఇంధనరంగ స్టాక్స్‌ కొనుగోళ్లకు ట్రిగ్గర్‌గా పనిచేస్తుందన్నారు. రూపాయి బలపడడంతో టెక్నాలజీ స్టాక్స్‌ లాభాల స్వీకరణ ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. రేట్ల కోతతో రూపాయి మరింత బలపడే అవకాశాల నేపథ్యంలో లార్జ్‌క్యాప్‌ ఐటీ స్టాక్స్‌కు ప్రస్తుతం దూరంగా ఉండడం మంచిదన్నారు. ‘‘ఫార్మా రంగ స్టాక్స్‌కు దీర్ఘకాలిక పరిస్థితిలో మార్పు వచ్చింది. 2018 అక్టోబర్‌ నుంచి పడినప్పుడల్లా ఈ రంగ స్టాక్స్‌లో కొనుగోళ్లు చోటు చేసుకుంటున్నాయి. కనుక దీర్ఘకాలం కోసం ఫార్మా స్టాక్స్‌ను కొనుగోలు చేసుకోవచ్చు’’ అని సూచించారు. పొజిషన్‌ ట్రేడర్లు, మధ్యకాల ఇన్వెస్టర్లు మెటల్స్‌, ఆటో, ఎఫ్‌ఎంసీజీ రంగ స్టాక్స్‌లో ట్రేడ్‌ చేసుకోవచ్చన్నారు. నిఫ్టీ 10,990ను బ్రేక్‌ చేస్తే షార్ట్‌కు వెళ్లొచ్చని, 11,050ను స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలని సూచించారు. 



You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 33 పాయింట్లు డౌన్‌

Tuesday 12th March 2019

ప్రపంచ మార్కెట్లు నుంచి అందిన సానుకూల పవనాల ఫలితంగా భారత్‌ సూచీలు శుక్రవారం గ్యాప్‌అప్‌తో ప్రారభమయ్యే సంకేతాల్ని ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అందిస్తోంది.  ఈ ఉదయం ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 63 పాయింట్లు పెరిగింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.45 గంటలకు 11,265 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం రోజు ఇక్కడ నిఫ్టీ మార్చి ఫ్యూచర్‌ 11,202 పాయింట్ల వద్ద ముగిసింది. గత  రాత్రి అమెరికా, యూరప్‌ సూచీలు 1 శాతం వరకూ లాభాలతో

ఎన్నికల ముందు విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు 

Tuesday 12th March 2019

మరో నెల రోజుల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ఆరంభం అవుతుండగా, ముందుగానే విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీల్లో కొనుగోళ్లను ఆరంభించారు. నరేంద్ర మోదీ తిరిగి అధికారంలోకి వస్తారని, మరింత బలమైన ఆర్థిక సంస్కరణలు, పాలసీ సులభతరానికి అవకాశాలు ఉంటాయన్న అంచనాలే వారి పెట్టబడులకు కారణంగా అనలిస్టులు పేర్కొంటున్నారు. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల పెట్టుబడులు ఫిబ్రవరిలో 2.42 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. ఇది 15 నెలల గరిష్ట స్థాయి. 2018లో ఉన్న నికర

Most from this category