News


ప్రభుత్వరంగ స్టాక్స్‌ పట్ల ఇన్వెస్టర్లలో ఆసక్తి

Saturday 10th November 2018
Markets_main1541830938.png-21862

అధిక డివిడెండ్‌ రాబడి, షేర్ల బైబ్యాక్‌లు, సెప్టెంబర్‌ త్రైమాసికంలో మంచి ఫలితాలు ఇవన్నీ కలసి ప్రభుత్వరంగ కంపెనీల పట్ల ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరిగిపోతోంది. మార్కెట్లలో తీవ్ర ఒడిదుడుకులు ఉండడంతో ఈ సమయంలో ప్రభుత్వరంగ స్టాక్స్‌ను ఇన్వెస్టర్లు భద్రంగా భావిస్తున్నట్టు విశ్లేషకులు పేర్కొంటున్నారు. బీఎస్‌ఈ పీఎస్‌యూ ఇండెక్స్‌ సెప్టెంబర్‌ 21 నుంచి చూస్తే కేవలం 2 శాతమే పడిపోవడం ఇందుకు నిదర్శంగా చెబుతున్నారు. కానీ, ఇదే కాలంలో సెన్సెక్స్‌ ఏడు శాతం నష్టపోయింది.

వీటికి డిమాం‍డ్‌ 

ముఖ్యంగా పవర్‌ ఫైనాన్స్‌ స్టాక్‌కు మంచి డిమాండ్‌ నెలకొంది. సెప్టెంబర్‌ 21 నుంచి చూస్తే ఈ స్టాక్‌ కొనుగోళ్ల మద్దతుతో ఏకంగా 21 శాతం ర్యాలీ చేసింది. ఆ తర్వాత భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ షేరకు ఆదరణ నెలకొంది. ఈ స్టాక్‌ 20 శాతం పెరిగింది. ప్రభుత్వరంగ బ్యాంకుల్లోనూ కొన్నింటికి కొనుగోళ్ల మద్దతు లభించడం ఆసక్తికరం. సెప్టెంబర్‌ 21 తర్వాత... ఓరియంటల్‌ బ్యాంకు ఆఫ్‌ కామర్స్‌ 19.6 శాతం, యూకో బ్యాంకు 18.7 శాతం, అలహాబాద్‌ బ్యాంకు 16 శాతం, ఎన్‌ఎల్‌సీ ఇండియా 16 శాతం, ఆర్‌ఈసీ 11.7 శాతం, బ్యాంకు ఆఫ్‌ మహారాష్ట్ర 11 శాతం, మంగళూర్‌ రిఫైనరీ 10 శాతం చొప్పున పెరిగాయి. నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ రంగంలో సంక్షోభం నేపథ్యంలో రిస్క్‌ తీసుకునే ఆసక్తి గత రెండు నెలల్లో తగ్గిపోయినట్టు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పీఎస్‌యూ కంపెనీలు, వీటిలోనూ డివిడెండ్‌ ఇచ్చే వాటిని పెట్టుబడికి మంచి అవకాశమని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. పైగా చాలా వరకు పీఎస్‌యూ కంపెనీలు గత రెండేళ్ల కాలంతో చూసుకుంటే విలువ పరంగా తక్కువ ధరలకే లభిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. పీఎస్‌యూ బ్యాంకు స్టాక్స్‌కు కూడా ఆదరణ లభిస్తుండడానికి కారణం... ఎన్‌పీఏల విషయంలో ఇప్పటికే అవి ఎక్కువ శాతం ప్రభావాన్ని ఎదుర్కోవడం, పుస్తక విలువ కంటే తక్కువకు ట్రేడ్‌ అవడమేనని చెబుతున్నారు. దీంతో వీటిని  కొనుగోలుకు మంచి అవకాశంగా భావిస్తున్నట్టు విశ్లేషకులు పేర్కొంటున్నారు. You may be interested

శాంసంగ్‌ ఫోల్డబుల్ ఫోన్లో ఏమున్నాయి?

Saturday 10th November 2018

దక్షిణ కొరియాకు చెందిన అగ్ర శ్రేణి ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం శాంసంగ్‌ ఫోల్డబుల్ ఫోన్‌ ఏ విధంగా ఉంటుందోనన్న ఆసక్తి వినియోగదారుల్లో చాలా తారా స్థాయిలోనే ఉంది. శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగిన శామ్‌సంగ్‌ డెవలపర్స్‌ సదస్సులో ఈ ఫోన్‌కు సంబంధించి కొన్ని అస్పష్ట వివరాలను కంపెనీ వైస్‌ ప్రెసిడెంట్‌ జస్టిన్‌ డెనిన్సన్‌ ఆవిష్కరించారు. చిన్న టాబ్లెట్‌ సైజులో జేబులో పట్టేంత పరిమాణంలోనే ఈ ఫోన్‌ ఉండనుంది. రానున్న నెలల్లోనే పెద్ద ఎత్తున తయారీకి

బుల్‌ మార్కెట్‌కు ఇది ముగింపు కాదు: దమానీ

Saturday 10th November 2018

ప్రస్తుత కరెక్షన్‌లో మార్కెట్‌ తీరును గమనిస్తే... ఇది బుల్‌ మార్కెట్లో వచ్చిన విరామమే కానీ, బుల్‌ మార్కెట్‌కు ముగింపు కాదని తాను భావిస్తున్నట్టు ప్రముఖ ఇన్వెస్టర్‌ రమేష్‌ ధమానీ తెలిపారు. మార్కెట్‌ ప్రతికూల వార్తలను పట్టించుకోవడం లేదన్నారు. ఇండిగో చాలా దారుణమైన ఫలితాలను ప్రకటించినా గానీ స్టాక్‌ 25 శాతం పెరిగినట్టు దమానీ తెలిపారు. ఇది బుల్‌ మార్కెట్లోనే సాధ్యమంటూ ఆయన ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.   మార్కెట్‌

Most from this category