STOCKS

News


షేర్ల బైబ్యాక్‌ల సందడి!

Monday 18th February 2019
Markets_main1550429275.png-24232

కంపెనీలు మిగులు నిధులతో షేర్లను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపడంతో మార్కెట్లో సందడి నెలకొంది. షేర్ల బైబ్యాక్‌ విషయంలో టెక్‌ కంపెనీలకు ప్రభుత్వరంగ సంస్థలూ తోడయ్యాయి. 2019 ఆరంభం నుంచి ఇప్పటి వరకు 45 రోజుల్లో రెండు డజన్ల వరకు కంపెనీలు షేర్లను తిరిగి కొనుగోలు చేయనున్నట్టు ప్రకటనలు చేయడం, ఇందులో కొన్ని కొనుగోళ్లు పూర్తి చేయడం కూడా ముగిసింది. ఈ షేర్ల బైబ్యాక్‌ విలువ సుమారు 17,000 కోట్ల రూపాయిలకు పైమాటే. 2018 సంవత్సరం మొత్తం మీద జరిగిన షేర్ల బైబ్యాక్‌ విలువ 54,500 కోట్లు. ఆరేళ్ల కాలంలో గతేడాది గణాంకాలే గరిష్టం. 

 

ఈ ఏడాది జరిగే షేర్ల తిరిగి కొనుగోలు (బైబ్యాక్‌) విలువ గతేడాది స్థాయిలోనే ఉండొచ్చని పెట్టుబడుల సలహా సేవల సంస్థ టార్గెట్‌ ఇన్వెస్టింగ్‌ ప్రెసిడెంట్‌ సమీర్‌కర్లా తెలిపారు. నిజానికి 2016 నుంచి చూస్తే షేర్ల బైబ్యాక్‌ విలువ ఏటేటా భారీగా పెరుగుతూ వస్తోంది. మరి ఈ ఏడాది గణాంకాలు గతేడాదిని మించితే అదో సరికొత్త రికార్డు అవుతుంది. కంపెనీలు తమ మిగులు నిల్వల నుంచి కొంత భాగాన్ని షేర్ల బైబ్యాక్‌ కోసం వినియోగిస్తున్నాయి. దీనివల్ల అటు కంపెనీలు, ఇటు వాటాదారులకు రెండు విధాల ప్రయోజనాలున్నాయి. ఒకటి భవిష్యత్తు వృద్ధి అవకాశాల దృష్ట్యా కంపెనీ వాటాలకు అదనపు విలువ సమకూరుతుంది. మిగులు నిల్వలను డివిడెండ్‌గా పంపిణీ చేస్తే పన్ను భారం ఎక్కువగా ఉంటుంది. డివిడెండ్‌కు బదులు షేర్ల బైబ్యాక్‌ చేపడితే, ఆ మేరకు పన్ను ఆదాతో పాటు, వాటాలు కొంత తగ్గి, మిగిలిన వాటాల విలువ పెరుగుతుంది. ముఖ్యంగా గతేడాది నుంచి షేర్ల ధరలు దిద్దుబాటుకు గురవుతున్నాయి. ఇంత తక్కువ ధరల్లో బైబ్యాక్‌ చేపట్టడం వాటాదారులకు మరింత విలువను చేకూర్చేదే అవుతుంది. 

 

దేశీయ రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌ రూ.8,260 కోట్లతో షేర్ల బైబ్యాక్‌ చేపడుతున్నట్టు గత నెలలో ప్రకటించింది. టీసీఎస్‌ 2018లో రూ.16,000 కోట్లతో బైబ్యాక్‌ను పూర్తి చేసింది. ముఖ్యంగా షేర్ల ధరలు క్షీణించడం కూడా కంపెనీలు బైబ్యాక్‌ చేపట్టడానికి దారితీస్తున్నాయని ఇండియానివేష్‌ సెక్యూరిటీస్‌ అంటోంది. ముఖ్యంగా మిడ్‌, స్మాల్‌క్యాప్‌ కంపెనీల షేర్ల పతనం కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వరంగంలోని కోల్‌ ఇండియా, ఎన్‌హెచ్‌పీసీ, ఎన్‌ఎండీసీ, ఐవోసీ తదితర కంపెనీలు సైతం బైబ్యాక్‌లో చురుగ్గా పాల్గొన్నాయి.



You may be interested

లాభాలు, ఆదాయాల్లో నిరంత వృద్ధి

Monday 18th February 2019

పెట్టుబడులకు సంబంధించి ఇన్వెస్టర్లు చూడాల్సిన ముఖ్యమైన అంశాలు ఎన్నో ఉంటాయి. అందులో ఓ కంపెనీ ఆదాయం, లాభం ఏటేటా ఏ స్థాయిలో వృద్ధి చెందుతున్నాయనేది ముఖ్యమైనవి. బీఎస్‌ఈలో లిస్టెడ్‌ కంపెనీల్లో సుమారు 23 కంపెనీల ఆదాయాలు, లాభాలు 2017 మూడో త్రైమాసికం నుంచి వృద్ధి చెందుతూనే ఉన్నాయి.    రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నికర లాభం డిసెంబర్‌ త్రైమాసికంలో వార్షికంగా అంతకుమందు అదే కాలంలో పోల్చి చూస్తే 8.8 శాతం వృద్ధితో 10,251 కోట్లుగా

ఈ స్టాక్స్‌ సంపద సృష్టిస్తాయా...?

Monday 18th February 2019

వ్యాల్యూ ఇన్వెస్టింగ్‌ను పాటించే ప్రముఖ ఇన్వెస్టర్‌ సంజయ్‌ భక్షి ‘వ్యాల్యూక్వెస్ట్‌ ఇండియా మోట్‌ ఫండ్‌’ పోర్ట్‌ఫోలియోను పరిశీలించడం వల్ల రిటైల్‌ ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియో నిర్మాణ పరంగా కొంత అవగాహన పొందొచ్చు. ఆయన పోర్ట్‌ఫోలియోలో ఎన్నో స్టాక్స్‌ ఉన్నప్పటికీ... స్టాక్‌ ఎక్సేంజ్‌ల వద్దనున్న సమాచారం ప్రకారం ఏడు కంపెనీల్లో ఒక శాతానికి పైగా ఈ ఫండ్‌కు వాటాలు ఉన్నట్టు తెలుస్తోంది.    అంబికా కాటన్‌ మిల్స్‌, అసెల్యా కాలే సొల్యూషన్స్‌, టీవీఎస్‌ శ్రీచక్ర,

Most from this category